• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • NAZIMABAD 26 YEARS OLD YOUNG WOMAN JUNIOR ASSISTANT IN REVENUE DEPARTMENT DIED WITH CORONA IN KAMAREDDY FULL DETAILS HERE HSN

Nizamabad: ఈ యువతి పేరు విజయ.. 26 ఏళ్లకే రెండు ప్రభుత్వోద్యోగాలు సాధించింది.. కానీ కరోనా బారిన పడి పుట్టినరోజు నాడే..

Nizamabad: ఈ యువతి పేరు విజయ.. 26 ఏళ్లకే రెండు ప్రభుత్వోద్యోగాలు సాధించింది.. కానీ కరోనా బారిన పడి పుట్టినరోజు నాడే..

జూనియర్ అసిస్టెంట్ విజయ (ఫైల్ ఫొటో)

26 ఏళ్ల వయసులోనే రెండు ప్రభుత్వోద్యోగాలు సంపాదించిందా యువతి. తోటి ఉద్యోగులతో చలాకీగా మాట్లాడుతూ అందరిలోనూ ఉత్సాహాన్ని నింపేది. కానీ ఇంతలోనే కరోనా బారిన పడి..

  • Share this:
    సామాన్య ప్రజల జీవితాల్లో కరోనా తీవ్ర అల్లకల్లోలాన్నే సృష్టిస్తోంది. భార్యకు భర్తను దూరం చేస్తోంది. భర్త నుంచి భార్యను విడదీస్తోంది. చిన్నారులకు తల్లిదండ్రులను లేకుండా చేస్తోంది. అందరూ ఉన్నా ఒంటరి జీవితాన్ని గడిపేలా చేస్తోంది. ఎన్నో ఏళ్లు కడుపులో పెట్టుకుని పెంచిన బిడ్డను తల్లిదండ్రుల నుంచి దూరం చేస్తోంది. కడుపుకోతను మిగుల్చుతోంది. కష్టపడి చదివి ఉన్నతోద్యోగాలు సాధించి కుటుంబానికి ఆసరాగా ఉంటున్న వారిని కూడా కరోనా పొట్టనబెట్టుకుంటోంది. ఓ కుటుంబానికి ఆదరువును లేకుండా చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా కనిపిస్తున్న కథలివి. లక్షలాది మంది కుటుంబాల వ్యథలివి. కోట్లాది ప్రజల విషాధ గాథలివి. తాజాగా తెలంగాణలోనూ ఓ కుటుంబంలో అలాంటి విషాధ ఘటనే చోటు చేసుకుంది. ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    తెలంగాణలోని కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పద్మాజీవాడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వెల్డింగ్ షాపును నిర్వహిస్తున్నాడు. ఆయనకు 26 ఏళ్ల వయసున్న విజయ అనే కుమార్తె ఉంది. చిన్నప్పటి నుంచి చదువులో విజయ ముందుండేది. అందుకే కష్టపడి కూతురిని ఆ తండ్రి చదివించాడు. ఆడపిల్లకు చదువులు ఎందుకు పెళ్లి చేయమని బంధువులు, స్నేహితులు సూచించినా వారి మాటలను లెక్కపెట్టలేదు. కూతురిని ఉన్నత చదువులు చదివించాడు. చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగాలకు విజయ ప్రిపేర్ అయింది. అతి తక్కువ కాలంలోనే గ్రామ పంచాయతీ సెక్రటరీగా ఉద్యోగం సంపాదించింది.
    ఇది కూడా చదవండి: Viral Video: వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ఫన్నీ కామెంట్స్ తో సెటైర్లు..!

    ఓ వైపు ఆ ఉద్యోగంలో విధులు నిర్వహిస్తూనే ఉన్నతోద్యోగం కోసం ఆమె ప్రయత్నాలు చేసింది. ఫలితంగా రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా మరో ఉద్యోగం సంపాదించింది. ప్రస్తుతం విజయ తాడ్వాయి మండలంలో తహసీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తోంది. ఇటీవల ఆమె కరోనా వైరస్ బారిన పడింది. కూతురు మంచి ఉద్యోగంలో చేరిందన్న సంతోషాన్ని కరోనా కొన్నినాళ్లు కూడా ఆ తండ్రికి మిగల్చలేదు. కరోనాతో విజయ గురువారం మరణించింది. గురువారమే విజయ పుట్టినరోజు కావడంతో ‘పుట్టినరోజు నాడే చనిపోయావా తల్లీ‘ అంటూ కుటుంబ సభ్యుల రోదనలు చూసి స్థానికులు కంటతడిపెట్టారు. ఆమె మృతికి తోటి ఉద్యోగులు సంతాపం వ్యక్తం చేశారు.
    ఇది కూడా చదవండి: అమెరికాలో ఘోరం.. నట్టింట్లో రక్తపు మడుగులో భారతీయ భార్యాభర్తలు.. నాలుగేళ్ల కూతురు బాల్కనీలోకి వెళ్లి..
    Published by:Hasaan Kandula
    First published:

    అగ్ర కథనాలు