Nayini Narasimha Reddy: వైఎస్ఆర్, చంద్రబాబుతో కలిసి అసెంబ్లీలోకి.. కేసీఆర్‌కు తొలి నుంచి అండగా..

Nayini Narasimha Reddy Death: కొద్దిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూశారు. 42 ఏళ్ల క్రితం తొలిసారి ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.

news18-telugu
Updated: October 22, 2020, 8:29 AM IST
Nayini Narasimha Reddy: వైఎస్ఆర్, చంద్రబాబుతో కలిసి అసెంబ్లీలోకి.. కేసీఆర్‌కు తొలి నుంచి అండగా..
నాయిని నర్సింహారెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
Nayini Narasimha Reddy Passes Away: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కన్నుమూశారు. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. కార్మిక నాయకుడిగా, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన నేతగా నాయిని నర్సింహారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సోషలిస్టు జీవితం.. సాదాసీదా మనస్తత్వం.. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే భోళాతనం.. నాయిని నర్సింహారెడ్డి సొంతం. సోషలిస్టుగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించి అందరికీ అందుబాటులో ఉండే కార్మికనేతగా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కొనసాగించిన నాయిని ఒకప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో జెయింట్‌కిల్లర్‌గా సంచలనం సృష్టించారు. ముషీరాబాద్‌ నియోజకవర్గంలో 1978లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఒకవైపు ఇందిరా కాంగ్రెస్‌ నుంచి అప్పటి కార్మిక మంత్రి టి.అంజయ్య, మరోవైపు రెడ్డి కాంగ్రెస్‌ నుంచి గతంలో కార్మిక మంత్రిగా పనిచేసిన జి.సంజీవరెడ్డిలతో ఆయన ఢీ కొన్నారు. ఆ ఇద్దరినీ ఓడించారు. 2,167 ఓట్ల మెజార్టీతో గెలుపొంది సంచలనం సృష్టించారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులుగా వ్యవహరించిన వైఎస్ఆర్, చంద్రబాబు సైతం అదే ఏడాది తొలిసారి ఎమ్మెల్యేలుగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టడం విశేషం. ఆ తరువాత 1985లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించిన నాయిని.. 2004లో మూడోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ వెంట..

2001లో టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన కేసీఆర్ వెంట నిలిచిన అతి కొద్దిమంది నాయకుల్లో నాయిని నర్సింహారెడ్డి ఒకరు. టీఆర్ఎస్ సీనియర్ నేతగా కొనసాగిన నాయిని.. ఆ పార్టీ ఒడిదొడుకుల్లో ఉన్న అనేక సమయాల్లోనూ కేసీఆర్‌కు అండగా నిలిచారు. ఒక దశలో పార్టీలోని పలువురు నేతలు తిరుగుబాటు చేసినా.. కేసీఆర్‌ వెంటే ఉండి ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. కేసీఆర్‌కు ఆప్తుడిగా, నమ్మకస్తుడిగా కొనసాగారు. 2004లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో టెక్నికల్‌ఎడ్యుకేషన్‌మంత్రిగా సేవలందించిన నాయిని.. కేబినెట్‌ నుంచి టీఆర్‌ఎస్‌ వైదొలగిన సమయంలో అమెరికానుంచే నేరుగా తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు పంపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో తన నిబద్ధతను చాటుకున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికై హోంమంత్రిగా, కార్మిక శాఖల మంత్రిగా పనిచేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేసీఆర్‌ వెన్నంటి ఉండి ప్రత్యేక రాష్ట్ర సాధనలో నాయిని కీలకపాత్ర పోషించారు.

Nayini narasimha reddy mlc post, cm kcr decision on nayini future, trs news, telangana news, నాయిని నర్సింహారెడ్డి ఎమ్మెల్సీ పదవి, నాయిని భవిష్యత్తుపై కేసీఆర్ నిర్ణయం, టీఆర్ఎస్ న్యూస్, తెలంగాణ న్యూస్
కేసీఆర్‌తో నాయిని(ఫైల్ ఫోటో)


నల్లగొండ నుంచి హైదరాబాద్‌కు...
నల్లగొండ జిల్లా చందంపేట మండలం నేరేడుగొమ్మ గ్రామానికి చెందిన నాయిని నర్సింహారెడ్డి ఫిబ్రవరి 12, 1940లో జన్మించారు. హెచ్‌ఎస్‌సీ వరకు చదువుకున్నారు. మొదటి నుంచే చురుకైన విద్యార్థిగా ఉంటూ వచ్చిన నాయిని ఆ ప్రాంతంలో జరిగే ప్రగతిశీల ఉద్యమాల్లో పాల్గొంటుండేవారు. ఈ క్రమంలోనే 1958 జనవరి 26వ తేదీన సోషలిస్టు పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ పార్టీ సమావేశం నాగార్జున సాగర్‌లో జరగగా దానికి సోషలిస్టు నాయకుడు బద్రి విశాల్‌పిత్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ సందర్భంగా స్థానిక నాయకుడు పాశం రుక్మారెడ్డితో సోషలిస్టు పార్టీ కార్యాలయంలో నమ్మకంగా పని చేయడానికి, చురుకైన ఓ కార్యకర్త కావాలని కోరగా అప్పుడు నాయిని నర్సింహారెడ్డి పేరును రుక్మారెడ్డి సూచించారు. దీంతో నాయిని ఆఫీసు కార్యదర్శిగా పని చేయడానికి 1962లో మొట్టమొదటిసారి హైదరాబాద్‌వచ్చారు. ఈ క్రమంలో ఆఫీసు బాధ్యతలతోపాటు పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు.

కార్మిక నాయకుడిగా ప్రత్యేక స్థానం సోషలిస్టు పార్టీ జాయింట్‌సెక్రటరీగా, ఆ తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా పదోన్నతి పొందుతూ వచ్చారు. ఈ క్రమంలో ట్రేడ్‌యూనియన్‌లీడర్‌గా మారి కార్మిక సమస్యలపై అనేక పోరాటాలు నిర్వహించారు. మొదట హమాలీ, తోపుడు బండ్ల కార్మికుల సమస్యలపై ఉద్యమించారు. నగరంలో మంచి పేరుప్రఖ్యాతలు సంపాదించారు. కార్మిక నాయకుడిగా ముద్ర వేసుకున్నారు. అనంతరం నాయిని నర్సింహారెడ్డి ప్రతిష్టాత్మకమైన వీఎస్‌టీ, ఐడీఎల్, హెచ్‌ఎంటీ, గంగప్ప కేబుల్స్, మోడ్రన్‌బేకరి వంటి కంపెనీల్లో కార్మికనేతగా గెలుపొందడంతోపాటు సికింద్రాబాద్‌హాకర్స్‌యూనియన్, మున్సిపల్‌వర్కర్స్‌యూనియన్లకు అధ్యక్షుడిగా కూడా కొనసాగారు. ఈ క్రమంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం 1975లో దేశంలో ఎమర్జెన్సీ విధించింది. ఎమర్జెన్సీలో నాయిని నర్సింహారెడ్డిని అరెస్టు చేసి ముషీరాబాద్‌జైల్లో 18 నెలల పాటు నిర్బంధించారు. ఎమర్జెన్సీ మొత్తంకాలం నాయిని జైల్లోనే గడిపారు. టీఆర్ఎస్‌లో కీలక పదవుల్లో ఉన్నప్పటికీ కార్మికగా అందరికి అందుబాటులో ఉన్నారు నాయిని. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత హోంమంత్రిగా ఉండటంతో పాటు కార్మికశాఖ మంత్రిగానూ వ్యవహరించారు.

రమిజాబీ కేసుతో వెలుగులోకి...
1978లో నల్లకుంట పోలీస్‌స్టేషన్‌పరిధిలో రమిజాబీ అనే ముస్లిం మహిళపై జరిగిన అత్యాచారం, దాడి ఘటన అప్పట్లో రాష్త్రాన్ని మొత్తం కుదిపివేసింది. బాధితుల పక్షాన నిలబడి నాయిని సుదీర్ఘ పోరాటం చేశారు. అప్పట్లో నల్లకుంట పోలీస్‌స్టేషన్‌ను వేలాది మందితో ముట్టడించారు. అప్పటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నల్లకుంట, ముషీరాబాద్‌ప్రాంతాలలో కర్ఫ్యూ కూడా విధించారు. ఈ ఘటనతోనే నాయిని ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.
Published by: Kishore Akkaladevi
First published: October 22, 2020, 8:16 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading