తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నేవీ వైస్ అడ్మిరల్ అభినందన లేఖ...

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వ రూ.5కోట్ల ఆర్థికసాయం, హైదరాబాద్ బంజారాహిల్స్‌లో 711 గజాల ఇంటి స్థలం ఇచ్చింది.

news18-telugu
Updated: June 26, 2020, 11:24 PM IST
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు నేవీ వైస్ అడ్మిరల్ అభినందన లేఖ...
కల్నల్ సంతోష్ బాబు చిత్రపటానికి నివాళి అర్పిస్తున్న సీఎం కేసీఆర్
  • Share this:
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు నేవీ వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్ లేఖ రాశారు. కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి కేసీఆర్ చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. దేశ సేవలో ప్రాణాలు అర్పించిన ఓ అమరవీరుడి కుటుంబం పట్ల ముఖ్యమంత్రి చూపిన అభిమానానికి ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు వైస్ అడ్మిరల్ రెండు పేజీల లేఖను రాశారు. ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ ఏకంగా వందల కిలోమీటర్లు వెళ్లి కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించడం అంటే మామూలు విషయం కాదన్నారు. కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి అత్యున్నతమైన ప్యాకేజీని అందించడం ద్వారా మిగిలిన వారికి ఆదర్శంగా నిలిచారని అభినందించారు. అలాగే, కేసీఆర్ కుమార్తె, మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితను కూడా వైస్ అడ్మిరల్ అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్‌‌ను ఓ సారి సందర్శించవలసిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వైస్ అడ్మిరల్ ఎంఎస్ పవార్ ఆహ్వానించారు. ఎందరో సైనికులను తయారు చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక సంస్థలో తెలంగాణ నుంచి కూడా చాలా మంది ఉన్నారని ప్రస్తావించారు.

కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని పరామర్శించిన సీఎం కేసీఆర్ (File)


గాల్వన్ ఘర్షణలో అమరుడైన కల్నల్ సంతోష్‌ బాబు అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయిన సీఎం కేసీఆర్ అనంతరం సూర్యాపేట వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. సంతోష్ బాబు చిత్రపటానికి సీఎం కేసీఆర్ నివాళి అర్పించారు. సంతోష్ భార్య సంతోషి, తల్లితండ్రులు మంజుల, ఉపేందర్, సోదరి శృతిలను ఓదార్చారు. సంతోష్ పిల్లలు, అభిగ్న, అనిరుధ్ తేజలతో మాట్లాడారు. దేశరక్షణ కోసం సంతోష్ ప్రాణత్యాగం చేశారని ముఖ్యమంత్రి కొనియాడారు. సంతోష్ మరణం తనను ఎంతగానో కలచివేసిందని చెప్పారు సీఎం కేసీఆర్. ప్రభుత్వం సంతోష్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా వుంటుందని హామి ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని చెప్పారు.సంతోష్ భార్య సంతోషీకి గ్రూప్ ఒన్ ఉద్యోగం ఇచ్చే నియామక పత్రాన్ని స్వయంగా అందజేశారు తెలంగాణ సీఎం. హైదరాబాద్ లోని బంజార్ హిల్స్ లో 711 గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని సంతోష్ భార్యకు ముఖ్యమంత్రి అందించారు. సంతోష్ భార్యకు రూ. 4 కోట్ల చెక్కును, తల్లితండ్రులకు రూ.1 కోటి చెక్కును ముఖ్యమంత్రి అందించారు.
First published: June 26, 2020, 11:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading