హోమ్ /వార్తలు /తెలంగాణ /

Basara : బాసరలో శారదీయ నవరాత్రి మహోత్సవాలు .. శైలపుత్రి అవతారంలో సరస్వతిదేవి దర్శనం

Basara : బాసరలో శారదీయ నవరాత్రి మహోత్సవాలు .. శైలపుత్రి అవతారంలో సరస్వతిదేవి దర్శనం

Basara 1Day

Basara 1Day

Basara: సరస్వతిదేవి కొలువైన బాసర పుణ్యక్ష్తేరంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. చదువుల తల్లిగా ఆశీసులు అందిస్తున్న అమ్మవారు శారదీయ నవరాత్రి మహోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. మొదటి రోజు అమ్మవారి శైల పుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nirmal, India

(K.Lenin,News18,Adilabad)

తెలంగాణ(Telangana) వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా జ్ఞానదేవతగా, సరస్వతిదేవిగా కొలువైన బాసర(Basara)పుణ్యక్ష్తేరంలో శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం(Monday)నుంచి ప్రారంభమయ్యాయి. నిర్మల్( Nirmal)జిల్లా బాసరలో చదువుల తల్లిగా ఆశీసులు అందిస్తున్న జ్ఞానసరస్వతి దేవి(Gnanasaraswati devi)దేవస్థానంలో శారదీయ నవరాత్రి మహోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు అమ్మవారి శైల పుత్రి(Sailaputri)అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఇంచార్జి ఈ.ఓ సోమయ్య(Incharge E.O Somaiah)సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు.

Bandi Sanjay : ఇకపై రాజకీయ విమర్శలకు బండి సంజయ్‌ దూరం .. తెలంగాణ బీజేపీ చీఫ్‌లో చేంజ్‌కి కారణం..?

శైలపుత్రిగా సరస్వతిదేవి..

అమ్మవారి ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. మంగళ సేవ, గణపతి పూజ, సుప్రభాత సేవలతో ఈ ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, వేదపండితులు ఆలయంలోని శ్రీ సరస్వతి, శ్రీ లక్ష్మీ మహాకాళి అమ్మవార్లకు మహాభిషేకం, అలంకరణతోపాటు శాస్తోక్తంగా ఘటస్థాపన చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ శారదీయ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తొలిరోజు అమ్మవారు శైలపుత్రి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.

దర్శనభాగ్యం కోసం భక్తులు క్యూ..

సరస్వతి దేవి శైలపుత్రి అవతారంలో దర్శనమివ్వడంతో భక్తులు అమ్మవారి దర్శనభాగ్యం కోసం వేలాదిగా తరలివచ్చారు. క్యూ లైన్లలో ఉన్న భక్తుల కోసం ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. సోమవారం అమ్మవారికి కట్టె పొంగలిని నైవేద్యంగా పెట్టారు.శారదీయ నవరాత్రి మహోత్సవాలు సందర్భంగా మహరాష్ట్రకు చెందిన భక్తులు ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారి నైవేధ్యంతో పాటు భక్తులకు ప్రసాదాలను ఉచితంగా అందజేస్తున్నారు.

Sad news: ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులు జలసమాధి ..ఎలా జరిగిందంటే..?

కట్టె పొంగలి నైవేద్యం..

బాసరలోని సరస్వతిదేవి అమ్మవారు తొద్దిరోజుల పాటు రోజుకు ఒక్కో రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. వేములవాడ ఆలయంలో, జోగులాంగ దేవస్ధానంలో సోమవారం నుంచి శరన్నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌ 5వ తేది వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఆయా పుణ్యక్షేత్రాల్లో అమ్మవార్ల ప్రత్యక్షమయ్యే రూపాలను దర్శించుకునేందుకు భక్తులు ప్రత్యేక శ్రద్ద చూపిస్తున్నారు. ఆలయాల్లో భక్తి, శ్రద్దలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Basara, Navaratri, Telangana News

ఉత్తమ కథలు