Home /News /telangana /

NAVEEN FROM NIZAMABAD DISTRICT IS SUPPLYING FREE FOOD TO CORONA PATIENTS VB NZB

Telangana: కరోనా బాధితులకు అండగా.. పేదలకు బాసటగా.. ఫుడ్ బ్యాంక్ పేరుతో సేవా కార్యక్రమాలు.. ఎక్కడంటే..

సేవా కార్యక్రమంలో పాల్గొన్న నవీన్, తదితరులు

సేవా కార్యక్రమంలో పాల్గొన్న నవీన్, తదితరులు

Telangana: క‌రోనా మ‌హ‌మ్మ‌రి కార‌ణంగా బంధాలు, బంధుత్వాలు దూర‌మ‌వుతున్నాయి. ఒక‌రిని ఒక‌రు క‌లిసే ప‌రిస్థితి లేదు. క‌రోనా సోకిన వారికి రెండు ముద్ద‌ల అన్నం పెట్టేందుకు ఎవ‌రు ముందుకు రాని ప‌రిస్థితులు ఉన్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో క‌రోనా బాధితుల‌కు నిజామాబాద్ ఫూడ్ బ్యాంక్ వారు అండ‌గా నిలిచారు.. క‌రోనా సోకి ఐసోలేష‌న్ ఉన్న కుటుంబాలకు ఉచితంగా భోజ‌నం అందిస్తున్నారు. బాధితుల్లో ధైర్యాన్ని నింపుతున్నారు.

ఇంకా చదవండి ...
  (పి. మ‌హేంద‌ర్, నిజామాబాద్ జిల్లా, న్యూస్18 తెలుగు)

  నిజామాబాద్ జిల్లా భీంగల్ కు చెందిన నవీన్ చంటి విద్యుత్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. జిల్లా కేంద్రంలో నివాసముంటున్నాడు. న‌గ‌రంలోని ప్ర‌ధాన వీధుల గుండా యాచకులు, అనాథలు, ఆకలితో అలమటిస్తున్నావారిని చూసి చ‌లించిపోయాడు. వారికి కనీసం కడుపు నిండా భోజనమైనా పెట్టాలని అనుకున్నాడు. 2016 ఫిబ్రవరి14 న నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్ పేరుతో సేవా సంస్థను ప్రారంభించాడు. నవీన్ సంకల్పానికి ముగ్గురు స్నేహితులు చేయూతనిచ్చారు. ప్రతి ఆదివారం అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విష‌యాన్ని సోష‌న్ మీడియాలో చూసిన యువ‌కులు ఆక‌ర్షితులై వాలంట‌ర్లుగా చేరారు. ఇప్ప‌డు సుమారు 250 మంది వలంటీర్లుగా ఉన్నారు. ఉదయం ఆరు నుంచి ఏడు గంటల వరకు వలంటీర్లంతా కలిసి కలిసి అన్నం వండి, తొమ్మిది గంటల నుంచి సొంత వాహనాల్లో భోజన ప్యాకెట్లు తీసుకుని యాచకులు, అనాథలను వెతుకుంటూ వెళ్ళి వారికి అందిస్తారు. సుమారు మూడేళ్ల పాటు ఇలా ఆకలి తీర్చుతున్నారు. వారంలో ఒక రోజు భోజ‌నం అందిస్తే స‌రిపోద‌నుకున్నారు. దీంతో 2020 ఫిబ్రవరి 14న ఫౌండేషన్ వార్షికోత్సవం సందర్భంగా 365 రోజులు భోజ‌నం అందించాల‌ని మరో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

  ఈ సేవా సంస్థ‌లో ఉన్న వారంతా ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న వారే కావ‌డంతో ప్ర‌తి రోజు సాయంత్రం భోజ‌నం అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. దీంతో ప్ర‌తి రోజు సాయంత్రం కూరలతో హైజ‌నిక్ భోజనం పెడుతున్నారు. గ‌త ఏడాది కరోనా మ‌హ‌మ్మ‌రి కార‌ణంగా వలస కూలీలు వారి సొంత ప్రాంతాల‌కు వెళ్లే వారికి అన్నం, పండ్లు, బిస్కెట్లు అందిచారు. కాలి నడకన వెళ్తున్న సుమారు లక్ష మంది చత్తీస్ గడ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ కు చెందిన వలస కార్మికులు ఫుడ్ బ్యాంక్ వాహనం ద్వారా మేడ్చల్ నుండి నిర్మల్ వరకు 250 కిలోమీటర్ల మేర తాగునీటితో పాటు భోజనం అందించి మాన‌వ‌త్వాన్ని చాటుకున్నారు. అయితే క‌రోనా సేకండ్ వేవ్ చాలా తీవ్రంగా ఉంది. దీంతో క‌రోనా సోకిన వారికి అంద‌రు దూరంగా ఉంటున్నారు. సొంత వారు కూడా వారికి అంటి ముట్ట‌న‌ట్టుగా వ్య‌వ‌హిస్తున్నారు. దీంతో క‌రోనా బారిన‌ప‌డి ఐసోలేష‌న్ లో ఉన్న వారికి ఫుడ్ అందించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.

  అనుకున్న‌దే త‌డువుగా బాధితుల ఇంటికి వెళ్లి వారి ఇంట్లో ఎంత మంది స‌భ్యులు ఉంటే అంత మందికి భోజ‌నం ఉచితంగా అందిస్తున్నారు. ఉద‌యం ఆరుగంట‌ల‌కు వలంటీర్స్ అంద‌రు ఒక్క‌ద‌గ్గ‌కు చేరుకోని వంట‌లు చేస్తారు. అన్నం, కురాల‌ను ప్యాక్ చేస్తారు. ఓ వాహనంలో అన్ని స‌ర్దుకోని వెళ్లి బాధిత కుటుంబాలు రెండు పూటలకు స‌రిప‌డా భోజ‌నాన్ని అందిస్తూ వారి ఆక‌లి తీర్చుతూ మేమున్నామనే భరోసా క‌ల్పిస్తున్నారు. నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్ అంటే అంద‌రికి తెలిసిపోయింది. సోష‌ల్ మీడియ‌లో రోజు వైర‌ల్ అవుతుంది. దీంతో క‌రోనా బాధితులు ఫుడ్ మొబైల్ నంబ‌ర్ కు పోన్ చేసి వారి వివ‌రాలు చెబుతున్నారు. అలాంటి వారికి ఫుడ్ బ్యాంక్ అండ‌గా నిలుస్తుంది..

  సేవా కార్యక్రమంలో పాల్గొన్న వలంటీర్లు


  సేవా కార్యక్రమంలో పాల్గొన్న వలంటీర్లు


  సేవా కార్యక్రమంలో పాల్గొన్న వలంటీర్లు


  దాత‌ల వ‌ద్ద నుంచి సంస్థ ఎప్పుడూ న‌గ‌దు తీసుకోలేదు. సరుకులు, సామగ్రిని మాత్రమే స్వీకరిస్తారు. ప్ర‌తి రోజు భోజ‌నం పంపిణీ చేసేందుకు ఇబ్బంది ఏర్పడగా దానికోసం వలంటీర్లంతా తలా కొంత డబ్బు పోగు చేసి ఓ వాహనాన్ని కొనుగోలు చేశారు. వారికి బాసటగా నిలిచేందుకు దాత ముందుకు వచ్చారు. ఆయనే కొంత డబ్బును నేరుగా వాహన కంపెనీ డీలర్ కు పంపించారు. ప్రత్యక్షంగా నగదు తీసుకోకూడదనే నియమాన్ని సంస్థ ఎప్పుడూ ఉల్లంఘించలేదని నిజామాబాద్ ఫుడ్ బ్యాంక్ వ్య‌వ‌స్థాప‌కులు న‌వీన్ చంటి అన్నారు. తెలంగాణలో ఎక్కడా ఆకలికేకలు లేకుండా చూడటమే లక్ష్యంగా ఫుడ్ బ్యాంక్ ద్వారా సేవలు అందిస్తున్నామ‌ని పుడ్ బ్యాంక్ వ్య‌వ‌స్థాపకుడు న‌వీన్ చంటి అంటున్నారు. ఇప్ప‌టికే 250మంది వలంటీర్ల తో కామారెడ్డి, ఆర్మూర్, నిర్మల్, ఖమ్మం జిల్లా సత్తుపల్లి, నల్గొండ, సిద్దిపేట, కరీంనగర్, హైదరాబాద్ లో తమ సేవలు కొన‌సాగుతున్నాయ‌న్నారు.
  Published by:Veera Babu
  First published:

  Tags: Food supply, Free food for corona, Nizamabad District, Telangana, Telangana News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు