BRS MLC Padi Kaushik Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy)కి ఊహించని షాక్ తగిలింది. ఇటీవల ఆయన తెలంగాణ గవర్నర్ తమిళిసై (Telangana Governor Tamilisai)పై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు గానూ..జాతీయ మహిళా కమీషన్ నోటీసులు జారీ చేసింది. తాను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని ఈ మేరకు నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా గత కొంతకాలంగా తెలంగాణ సర్కార్ కు, గవర్నర్ తమిళిసైకి గ్యాప్ వచ్చింది. ఈ క్రమంలో ఓ కార్యక్రమంలో పాడి కౌశిక్ రెడ్డి పెండింగ్ బిల్లులపై గవర్నర్ తీరుపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. దీనితో జాతీయ మహిళా కమీషన్ నోటీసులు ఇచ్చింది. మరి ఈ నోటిసులపై పాడి కౌశిక్ రెడ్డి (Padi Kaushik Reddy) ఎలా స్పందిస్తారో చూడాలి.
గవర్నర్ పై చేసిన వ్యాఖ్యలకు జాతీయ మహిళా కమీషన్ ఈనెల 14న నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ నోటీసుల్లో ఫిబ్రవరి 21న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు విచారణకు రావాలని పేర్కొన్నారు. అయితే సమయం తక్కువగా ఉన్నందున ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ నోటిసులపై ఆయన స్పందిస్తే కానీ దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. కాగా కొన్నిరోజులుగా పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లో యాక్టివ్ గా ఉంటున్నారు. ఇటీవల హుజురాబాద్ టికెట్ పాడి కౌశిక్ రెడ్డికే దక్కుతుందని కేటీఆర్ ఇచ్చిన సంకేతాలతో తేలిపోయింది.
కొన్నిరోజుల క్రితం హుజురాబాద్ లోని జమ్మికుంటలో నిర్వహించిన ఓ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న పాడి కౌశిక్ రెడ్డి రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ, పెండింగ్ బిల్లుల అంశంపై గవర్నర్ వ్యహరిస్తున్న తీరుపై అభ్యంతర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి నిలదీశారు. అసెంబ్లీ, కౌన్సిల్ లో పాస్ చేసిన బిల్లుల ఫైళ్లను ఇప్పటి దాకా గవర్నర్ తన దగ్గరే పెట్టుకున్నారని కౌశిక్ రెడ్డి అనుచిత పదజాలాన్ని వాడారు. ఈ వ్యాఖ్యలు గతంలో పెద్ద దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేయడంతో తాజాగా విచారణకు రావాలని కౌశిక్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Governor Tamilisai, Huzurabad, Telangana