Telangana: దళిత బంధు పేరుపై అభ్యంతరం.. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: దళిత బంధు పథకం పేరుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటిసులు జారీ చేసింది.దీనిపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది.

  • Share this:
    తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దళితబంధు పథకం పేరుపై అభ్యంతరం చెప్పింది మాల సంక్షేమ సంఘం. దళిత స్థానంలో అంబేద్కర్ పదాన్ని వినియోగించాలని డిమాండ్ చేస్తూ మాల సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ జాతీయ ఎస్సీ కమిషన్‌ను ఆశ్రయించారు. దళిత పదానికి అంటరానివారు, నిస్సహాయులు, తక్కువవారు అనే అర్ధాలున్నాయని తన పిటిషన్‌లో పేర్కొన్నారు దీంతో దళిత బంధు పథకంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటిసులు జారీ చేసింది.దీనిపై 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది.

    ఇవన్నీ ఎలా ఉన్నా.. దళితబంధు పథకం అమలును అనుకున్న సమయం కంటే ముందే మొదలుపెట్టింది తెలంగాణ ప్రభుత్వం. నిన్న తన దత్తత గ్రామమైన వాసాలమర్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్.. ఇక్కడి నుంచే దళితబంధు కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. రేపటి నుంచే మీకు పథకానికి సంబంధించిన డబ్బలు వస్తాయని అన్నారు. అందుకు తగ్గట్టుగానే గ్రామంలోని 76 దళిత కుటుంబాలకు అందించేందుకు వీలుగా జిల్లా కలెక్టర్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ. 7.6 కోట్లను విడుదల చేసింది. మరోవైపు తమ గ్రామం నుంచి సీఎం కేసీఆర్ దళితబంధు పథకం ప్రారంభించడంపై ఆ గ్రామంలోని దళితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: