Home /News /telangana /

NATIONAL MEDICAL COMMISSION HAS GIVEN PERMISSION FOR TWO MORE NEW MEDICAL COLLEGES IN TELANGANA PRV

Medical Colleges: తెలంగాణలో MBBS​ చదవాలనుకునే వారికి గుడ్​న్యూస్​.. కొత్తగా మరో రెండు కాలేజీలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణలో జిల్లాకో మెడికల్‌ కాలేజీ (Medical college) ఏర్పాటు దిశలో మరో ముందడుగు పడింది. కొత్తగా మరో రెండు కళాశాలలు రానున్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణలో (Telangana) జిల్లాకో మెడికల్‌ కాలేజీ (Medical college) ఏర్పాటు దిశగా మరో ముందడుగు పడింది. వనపర్తి, రంగారెడ్డి జిల్లాల్లో మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (National Medical Commission) ఆమోదం తెలిపింది. ఒక్కో కాలేజీలో 150 సీట్లకు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమం అయినట్టేనని అధికారులు అంటున్నారు. రెండు జిల్లాల్లోనూ ఇప్పటికే మెడికల్‌ కాలేజీల భవనాలు పూర్తయ్యాయి.  వనపర్తి మెడికల్‌ కాలేజీకి అనుమతులు రావడం పట్ల వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

    వనపర్తి (Vanaparti)లో నిబంధనల మేరకు కాలేజీకి అవసరమైన మౌలిక సౌకర్యాలు, లాబొరేటరీ, లైబ్రరీ, హాస్టల్స్‌, సౌకర్యాలు, ఫ్యాకల్టీ, అనుభవం, పబ్లికేషన్స్‌, నర్సింగ్‌ అండ్‌ పారా మెడికల్‌ సిబ్బంది వంటి సౌకర్యాలను ది మెడికల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ రేటింగ్‌ బోర్డు (ఎంఏఆర్‌బీ) పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ బోర్డు నివేదిక ఆధారంగా ఎన్‌ఎంసీ (NMC) అనుమతులు ఇచ్చింది. గత ఎన్నికల సందర్భంగా వనపర్తి జిల్లాకు మెడికల్‌ కళాశాల ఇస్తానని ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్‌ (CM KCR) మంజూరు చేయడంతోపాటు, రూ.510 కోట్ల నిధులు కేటాయించారు. కళాశాల కోసం 50 ఎకరాల స్థలాన్ని జిల్లా కేంద్రంలో కేటాయించారు. ముఖ్యమంత్రి కేటాయించిన నిధులతో మెడికల్‌ కళాశాల (Medical collge) భవనం, పరిపాలనా భవనం, విద్యార్థి, సిబ్బంది, వసతి గృహాల నిర్మాణం చేపట్టనున్నారు.



    సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు..

    ఖమ్మం (Khammam) జిల్లా­లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు చేయడంతో పాటు అను­బంధంగా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిని అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభు­త్వం ఉత్తర్వులు జారీచేయడంపై రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ సీఎం కేసీఆర్‌కు (CM KCR) కృతజ్ఞతలు తెలి పారు. ఖమ్మం వైద్య కళాశాల ఏర్పా­టు ఉత్తర్వు ప్రతిని గురు వారం సీఎం ప్రగతి­భవన్‌లో పువ్వాడకు అందజేశారు.

    రూ.166 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని..

    అనంతరం పువ్వాడ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు వైద్య కళాశాల మంజూరు చేయడంతో ఉమ్మడి జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరిందన్నారు. మౌలిక వసతుల కల్పన, నూతన భవనాల నిర్మాణానికి రూ.166 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందని పేర్కొన్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి వైద్య కళాశాలను ప్రారంభించనున్నారని, ఈ మేరకు వంద సీట్లను కేటాయించిందన్నారు. తరగ­తుల నిర్వహణ, ప్రొఫెసర్లు, నర్సింగ్‌ కళా శాలకు అనువుగా ఉన్న ప్రస్తుత కలెక్టరేట్‌ భవనాల సముదా యం, ఆర్‌అండ్‌బీ శాఖల స్థలాన్ని వైద్య కళాశాలకు అప్పగించనున్నట్టు మంత్రి అజయ్‌ కుమార్‌ చెప్పారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Khammam, Medical colleges, Medicine, Ranga reddy, Rangareddy, Telangana

    తదుపరి వార్తలు