దిశా హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ జరుపుతోన్న సంగతి తెలిసిందే. శనివారం నిందితుల మృతదేహాలతో పాటు చటాన్‌పల్లి ఎన్కౌంటర్ స్థలాన్ని పరిశీలించిన ఎన్హెచ్ఆర్సీ.. ఆదివారం కూడా విచారణ జరుపుతోంది.ఈ క్రమంలో దిశా తల్లిదండ్రులను ఆదివారం మధ్యాహ్నం 3.30గంటలకు విచారణకు హాజరుకావాలని సమాచారం పంపించింది.అయితే దిశా తల్లి ఆరోగ్యం బాగాలేదని.. విచారణకు హాజరవడం కష్టమని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే శంషాబాద్ పోలీసులు దిశా నివాసానికి చేరుకుని.. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీకి వారిని తీసుకెళ్లనున్నారు. అక్కడే ఎన్హెచ్ఆర్సీ బృందం వారిని విచారించే అవకాశం ఉంది. బాధిత కుటుంబం తరుపున ఎన్హెచ్ఆర్సీ సభ్యులకు వాస్తవాలు వెల్లడిస్తామని దిశా తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఇక ఎన్కౌంటర్ ఘటనలో గాయపడ్డ ఎస్ఐ,కానిస్టేబుల్స్ వాంగ్మూలాన్ని కూడా ఎన్హెచ్ఆర్సీ ఇప్పటికే రికార్డు చేసింది.ఈ విచారణను జాతీయ మానవ హక్కుల కమిషన్ రహస్యంగా నిర్వహించింది. ఆ సమయంలో వైద్యులను తప్ప ఎవరినీ లోపలికి అనుమతించలేదు. పోస్టుమార్టమ్‌పై వైద్యులను అడిగి పలు వివరాలు తెలుసుకున్నారు.
Published by:Srinivas Mittapalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.