హోమ్ /వార్తలు /తెలంగాణ /

నేషనల్ హెరాల్డ్ కేసు..ఈడీ విచారణకు హాజరైన కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్

నేషనల్ హెరాల్డ్ కేసు..ఈడీ విచారణకు హాజరైన కాంగ్రెస్ సీనియర్ నేత అంజన్ కుమార్

ఈడీ విచారణకు కాంగ్రెస్ సీనియర్ నేత

ఈడీ విచారణకు కాంగ్రెస్ సీనియర్ నేత

నేషనల్ హెరాల్డ్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. యంగ్ ఇండియన్ కు ఇచ్చిన వివరాలపై అంజన్ కుమార్ స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్ చేసినట్లు తెలుస్తుంది. కాగా అంజన్ కుమార్ గత నెలలోనే ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉండగా అనారోగ్య కారణంగా హాజరు కాలేకపోయారు. కాగా ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటికే ఈడీ ముందు హాజరు అయ్యారు. 

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

నేషనల్ హెరాల్డ్ కేసు (National Herald Case) దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ (Anjan Kumar yadav) ఈడీ (Enforcement Directorate) విచారణకు హాజరయ్యారు. యంగ్ ఇండియన్ కు ఇచ్చిన విరాళాలపై అంజన్ కుమార్  (Anjan Kumar yadav) స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డ్ చేసినట్లు తెలుస్తుంది. కాగా అంజన్ కుమార్  (Anjan Kumar yadav) గత నెలలోనే ఈడీ (Enforcement Directorate) విచారణకు హాజరు కావాల్సి ఉండగా అనారోగ్య కారణంగా హాజరు కాలేకపోయారు. కాగా ఈ కేసులో ఇప్పటికే కాంగ్రెస్ అగ్ర నాయకులు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీ (Rahul Gandhi), ప్రస్తుత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) ఇప్పటికే ఈడీ ముందు హాజరు అయ్యారు.

Telanagana: తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ రూ. 36 వేల కోట్ల పెట్టుబడులు.. ఏటా 48 వేల ఉద్యోగాలు ..

కాగా ఈ కేసులో ఐదుగురు కాంగ్రెస్‌ నేతలకు ఈడీ (enforcement directaret) నోటీసులు జారీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్‌లుగా ఉన్న గీతారెడ్డి, రేణుకాచౌదరి, షబ్బీర్ అలీ, సుదర్శన్‌రెడ్డితో పాటు మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే ఇప్పటికే ఈడీ (enforcement directaret) విచారణకు గీతారెడ్డి, షబ్బీర్ అలీ, సుదర్శన్ హాజరయ్యారు. అలాగే కర్ణాటక కాంగ్రెస్ నాయకులకు ఈడీ (enforcement directaret) నోటీసులు జారీ చేసి వారిని కూడా విచారించింది.

నేషనల్ హెరాల్డ్ కేసు అంటే ఏమిటి?

నేషనల్ హెరాల్డ్ అనేది ఓ పత్రిక. దీనిలో రూ .2000 కోట్ల విలువైన ఆసెట్స్ ఈక్విటీ ట్రాన్సక్షన్ లో అవకతవకలకు సంబంధించిందే ఈ కేసు. నేషనల్ హెరాల్డ్ పేపర్ కు ఆర్ధిక సమస్యలు తలెత్తినప్పుడు కాంగ్రెస్ పార్టీ పలు దఫాలుగా సొమ్ము అందించింది. అయినా కానీ పత్రిక మూతపడడం ఆగలేదు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ బోర్డు డైరెక్టర్లుగా యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది స్థాపితమైనది. యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ జర్నల్స్ లిమిటెడ్ టేకోవర్ చేసుకుంది. దీనిపై ఫిర్యాదులు అందాయి. పొలిటికల్ సంస్థ థర్డ్ పార్టీతో ఆర్ధిక లావాదేవీలు జరపరాదు అనేది ఐటీ యాక్ట్ ప్రకారం ఉన్న నిబంధన.  అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు సంబంధించి ఆస్తులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఎక్కువ మొత్తంలో లాభంతోనే సొంతం చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. తద్వారా సొమ్మంతా పొందారని పలువురు ఫిర్యాదు చేశారు. దీనితో మనీలాండరింగ్, ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ఈడీ దర్యాప్తు చేపట్టింది.

First published:

Tags: Congress, Enforcement Directorate, Hyderabad, Telangana, TS Congress

ఉత్తమ కథలు