Home /News /telangana /

NATION HAS LOST ITS AIM WE WILL SET IT RIGHT BY ALTERNATIVE AGENDA NOT BY POLITICAL FRONT SAYS CM KCR IN TRS PLENARY MKS

KCR | TRS plenary: కేసీఆర్ సంచలనం.. జాతీయ అజెండా ప్రకటన.. భారత రాష్ట్ర సమితి (BRS)!

టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్

టీఆర్ఎస్ ప్లీనరీలో కేసీఆర్

భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దారి తప్పిన దేశానికి మంచి మార్గం చూపెట్టాల్సిన బాధ్యత తెలంగాణపై ఉందని, ఆ దిశగా టీఆర్ఎస్ జాతీయ బాద్యతను తలకెత్తుకుంటున్నదని చెప్పారు.

భారతదేశం తన లక్ష్యాన్ని కోల్పోయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. విభజనవాదం పేట్రేగిపోయి, సమిష్టి లక్ష్యం కొరవడిన ప్రస్తుత పరిస్థితుల్లో.. దేశ గమనం చీకట్లో గుడ్డి ఎద్దు తిరుగాడుతున్నట్లుగా తయారైందన్నారు. ప్రకృతి వరంగా లభించిన వందలాది నదులు.. 44 కోట్ల ఎకరాల సాగు భూమి.. బలమైన యువశక్తి.. అన్నీ ఉన్నా నిర్దిష్టమైన మార్గనిర్దేశం లేకపోవడం వల్లే దేశానికి ఈ దుస్థితి దాపురించిందన్నారు.

దారి తప్పిన దేశానికి మంచి మార్గం చూపెట్టాల్సిన బాధ్యత తెలంగాణపై ఉందని, ఆ దిశగా టీఆర్ఎస్ జాతీయ బాద్యతను తలకెత్తుకుంటున్నదని, హైదరాబాద్ వేదికగా దేశానికి ప్రత్యామ్నాయ అజెండా రూపుదిద్దుకోవడం అందరికీ గర్వకారణమని సీఎం వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రారంభ ఉపన్యాసం చేసిన కేసీఆర్.. అన్నిటికి అన్నీ సంచలన విషయాలనే ప్రస్తావిస్తూ తన జాతీయ అజెండాను ప్రకటించారు. టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ ఏం చెప్పారో ఆయన మాట్లల్లోనే..

KCR | TRS plenary: బీజేపీ-మోదీపై కేసీఆర్ 13 బాణాలు -ప్లీనరీలో అన్నీ సంచలన తీర్మానాలు


‘భారతదేశం ఇప్పుడు తన లక్ష్యాన్ని కోల్పోయింది. దేశం లక్ష్యమంటే ఒక వ్యక్తి లేదా ఒక గుంపు నిర్ణయించేది కాదు.. నలుమూలల్లోని ప్రజలు సామూహిక లక్ష్యాన్ని కలిగి ఉండటం. 75ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో రాష్ట్రాల మద్య నీటి పంచాయితీలు కావొచ్చు, పేదలు ఇప్పటికీ కనీ రెండు పూటలా భోజనం చేయలేని దుస్థితి కావొచ్చు, 60 లక్షల టీఎంసీల నీటి లభ్యత ఉండి కూడా కేవలం 30 లక్షల టీఎంసీలనే వాడుకుటటుండం కావొచ్చు.. 30ఏళ్ల కిందట మనకంటే వెనకున్న చైనా ఇవాళ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగడం కావొచ్చు.. మన దగ్గర ఒక జిల్లా సైజు లేని ఇజ్రాయెల్ నుంచి ఆయుదాలు కొనడం కావొచ్చు.. అన్నిటికి అన్ని అంశాల్లో మనకు బుర్రలేక వెనుకబడ్డాం. విభజనవాదాలు, మత రాజకీయాలు పరిస్థితిని మరింత దరిద్రంగా మర్చేశాయి. ఈ దుస్థితిపై మనమంతా తీవ్రంగా ఆలోచించాలి. సామూహిక లక్ష్యాన్ని దేశం ఎందుకు కోల్పోయింది? అని తర్కించాలి.

KCR | TRS plenary: కేసీఆర్ జాతీయ పార్టీ.. నేటి ప్లీనరీలో ప్రకటన.. పీకే ద్వారా చక్రంతిప్పేలా!


దేశం బాగుపడాలంటే రావాల్సింది, కావాల్సింది రాజకీయ ఫ్రంట్లు కాదు. ఇప్పటికే నేషనల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ , మన్ను ఫ్రంట్ లాంటివి చాలా వచ్చాయి. ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బీజేపీని ఓడించడానికి విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలనే వాదన కూడా తెరపైకి వచ్చింది. కానీ అది పనికిమాలిన ఆలోచన అని నేను చెప్పాను. రాజకీయ పునరేకీకరణలు, కొందరు ముఖ్యమంత్రుల కలయిక, కొన్ని పార్టీల గుంపు, ఇవేవీ దేశాన్ని మార్చలేవు. ఇండియాకు ఇవాళ కావాల్సింది స్పష్టమైన ప్రత్యామ్నాయ అజెండా. అదిగో.. ఆ సిద్ధాంతానికి ప్రాతిపదిక పడాలి. ప్రారంభం మనమే చేయాలి. దేశాన్ని ఫక్తు రాజకీయ కోణంలోనే ఆలోచించేవారికి ఇదంతా తామాషాగానే ఉంటుంది.

Revanth | PK : రేవంత్ బ్రో.. పీకేతో ప్రెస్‌మీట్ ఎప్పుడు బ్రో? -తలకిందులైన టీకాంగ్రెస్ అంచనాలు!


టీఆర్ఎస్ ప్లీనరీ సందర్బంగా కేసీఆర్ జాతీయ రాజకీయ ఫ్రంట్ ప్రకటిస్తాడని మీడియాలో విస్తృతమైన చర్చ జరుగుతోంది. అయితే దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కాదు.. ప్రత్యామ్నాయ సామూహిక అజెండా. అదంతా ఒక ప్రాసెస్ ప్రకారం జరుగుతుంది. దేశ నిర్మాణానికి విధానాలు రూపొందుతాయి. ఎవరికీ వ్యతిరేకమైన లేదా మరొకరికికి అనుకూలమైన ఫ్రంట్లు కాదు.. ప్రజలకు అవసరమైన వేదిక ఉండాలన్నదే మా లక్ష్యం. దేశ అజెండాను సెట్ చేద్దాం.

CM KCR: అట్లుంటది కేసీఆర్‌తోని.. టీఆర్ఎస్ ప్లీనరీలో 33 రకాల పసందైన వంట‌కాలు..


దేశం బాగుకు మన రాష్ట్రం నుంచి ఏదైనా ప్రారంభం జరిగితే అది మనందరికీ గర్వకారణం. హైదరాబాద్ వేదికగా కొత్త సిద్దాంతం తయారై, దేశం నలుమూలలా వ్యాప్తిస్తే మనకు గర్వకారణం. ప్రత్యామ్నాయ అజెండాలో నూతన వ్యవసాయ విధానం ఉంటుంది. ప్రతివాడు పనిచేసే అవకాశం దక్కుతుంది. కేవలం సంకుచిత రాజకీయ లక్ష్యంతో, ఎవరినో ప్రధానిని చేయడమో ఈ అజెండా లక్ష్యం కాదు. మా యువ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ ఇవాళొక వ్యాసం రాసిండు, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇకపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా ఆవిర్భవించాలని అన్నాడు. అన్ని విషయాలనూ మీతో సమగ్రంగా పంచుకుంటాను..’అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్లీనరీ సందర్బంగా టీఆర్ఎస్ పార్టీ ఆస్తుల వివరాలను కూడా ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Telangana, Trs

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు