ktr : మంత్రి కేటిఆర్‌తో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి భేటి... సీఎం టూర్ తర్వాత సమావేశం ..?

ktr : మంత్రి కేటిఆర్‌తో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి భేటి... సీఎం టూర్ తర్వాత సమావేశం ..?

ktr : ఇటివల సీఎం కేసిఆర్ వరంగల్ పర్యటనలో అవమానాలకు గురైన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మంత్రి కేటిఆర్‌తో భే అయ్యారు. తన నియోజకవర్గ అభివృద్దిపై మంత్రి కేటిఆర్‌తో చర్చించారు. నర్సంపేట అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కేటిఆర్‌ను కోరారు.

  • Share this:
ఉమ్మడి జిల్లాలో ఓ వెలుగు వెలిగిన పెద్ది సుదర్శన్ రెడ్డి చాలా కాలం తర్వాత వార్తల్లోకి ఎక్కాడు. సీఎం కేసిఆర్ ఇటివల వరంగల్ జిల్లాలో పర్యటించిన నేపథ్యంలోనే పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గోన్నారు. సీఎం టూర్‌లో భాగంగా హజరైన పెద్ది సుదర్శన్‌రెడ్డికి అవమానాలు ఎదురయ్యాయి. ఆయన వాహానాన్ని రెండు చోట్ల ఆపారు. దీంతో నడుచుకుంటూనే సీఎం సభకు నడుచుకుంటూనే వెళ్లాడు. దీంతో ఆయన నడుచుకుంటూ వెళ్లిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. జరిగిన అంశంపై అంతర్గత విచారణ చేపట్టారు. ఆరోజు ఏం జరిగిందనే దానిపై ఆరా తీశారు. ఆయన్ను ఆపిన పోలీసులు ఎవరు అనే కోణంలో క్షుణ్ణంగా విచారణ చేపట్టారు. అయితే పెద్ది సుదర్శన్ రెడ్డి మాత్రం చాలా రోజులుగా సైలంట్‌గానే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలతో పాటు ఇతర అంశాలపై సుదీర్ఘ అనుభవం ఉన్న సుదర్శన్ రెడ్డి ఇలా సైలంట్‌గా ఉండడంతో పాటు ఒక్కసారిగా సీఎం కార్యక్రమంలో అవమానాలకు గురికావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయం అయింది..అప్పటికే మాజి మంత్రి ఈటలను దూరం పెట్టడడంతోపాటు పార్టీ కోసం గతంలో పనిచేసిన వాళ్లని కూడా పట్టించుకోవడం లేదనే విమర్శలు వచ్చాయి. దీంతోపాటు సుదర్శన్‌రెడ్డి కూడా అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు కూడా వెలువడ్డాయి.

అయితే ఈ వార్తలను ఆయన ఖండించినా...అంతర్గతంగా ఎలాంటీ సమస్య లేకుంటే... సీఎం కార్యక్రమాలకు ఆయన్ను అడ్డుకోవడం...హఠాత్తుగా రోడ్డుపై నడుచుకుంటూ రావడానికి కారణాలు ఉంటాయనేది సుష్పష్టం అవుతోంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కేటిఆర్‌తో సమావేశం కావడంతో చర్చనీయాంశంగా మారింది. సుదర్శన్‌రెడ్డి కి పార్టీకి మధ్య సయోధ్య కుదిరిందా అందుకే నియోజకవర్గ అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులను సమకూర్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చిందా అనే కోణంలో చర్చ కొనసాగుతోంది.

ఈ సంధర్బంగా నర్సంపేట అభివృద్ది,చేపట్టవలసిన పనులు,పెండింగ్ పనుల పూర్తిపై మంత్రి కేటీఆర్ తో ఎమ్మెల్యే చర్చించారు..నర్సంపేట పట్టణాభివృద్దిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని,కొత్తపనుల మంజూరీ చేయడంతో పాటు పెండింగ్ పనుల పూర్తికి సహాకారం అందించాలని కోరారు..  ప్రదానంగా.. నర్సంపేట నియోజకవర్గంలో ఫుడ్ ప్రాసెసింగ్ స్పెషల్ ఎకనామికల్ జోన్ ఏర్పాటు చేయాలని కోరారు..నర్సంపేట నుండి వరంగల్ వరకు ఫోర్ లైన్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని,తద్వారా నర్సంపేటకు ఇండస్ట్రీలు వచ్చే అవకాశం ఉంటుందని కేటీఆర్ గారిని ఎమ్మెల్యే కోరారు..

ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ తన నియోజకవర్గానికి సంబంధించి ప్రతిపాదించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు తమ శాఖ తరఫున పూర్తి మద్దతు ఇస్తామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చినట్టు ఆయన చెప్పారు. ఎమ్మెల్యే కోరినట్లు త్వరలోనే నర్సంపేట పట్టణానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని నిర్వహించి... అక్కడ జరిగిన అభివృద్ధి ప్రస్థానానికి మరింత అండగా ఉంటామని కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే పట్టణానికి సంబంధించి అనుమతి లభించిన కార్యక్రమాలు, పనుల పురోగతి మరింత వేగవంతం అయ్యేలా మున్సిపల్ శాఖ అధికారులకు సూచిస్తానని తెలిపారు
Published by:yveerash yveerash
First published: