ధూంధాంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే బర్త్ డే... సరుకుల కోసం పేదల తోపులాట..

భూపాల్ రెడ్డి పుట్టిన రోజువేడుకల సందర్భంగా నిత్యావసరాలు పంపిణీ, ఎగబడిన జనం

నారాయణ్ ఖేడ్‌లో జరిగిన భూపాల్ రెడ్డి వేడుకులకు వందల మంది అతిథులు హాజరయ్యారు. పేదలకు నిత్యావసరాల పంపిణీ సందర్భంగా ఓ రకమైన తోపులాట కూడా జరిగింది.

  • Share this:
    కరోనా వైరస్ లాక్ డౌన్ సమయంలో కూడా సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తన పుట్టిన రోజును ధూంధాంగా జరుపుకొన్నారు. నారాయణ్ ఖేడ్‌లో జరిగిన భూపాల్ రెడ్డి వేడుకులకు వందల మంది అతిథులు హాజరయ్యారు. అలాగే, పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తారని చెప్పడంతో వారు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు. బర్త్ డేకు వచ్చిన వారంతా ఎలాంటి సామాజిక దూరం పాటించకుండా పక్కపక్కనే కూర్చున్నారు. అందులో చాలా మంది మాస్క్‌లు కూడా ధరించలేదు. కేవలం కొద్దిమంది మాత్రమే మాస్క్‌లు ధరించారు. పుట్టిన రోజు వేడుకల సందర్భంగా పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసే సమయంలో పేదలు అందరూ ఒక్కసారిగా ముందుకు వచ్చారు. తమకు సరుకులు దొరకవేమో అనే ఆందోళనతో తోసుకున్నారు. క్యూలైన్లో ఒకరి మీద మరొకరు పడుతూ తోపులాటకు దిగారు. ఒకరిద్దరు పోలీసులు అక్కడ ఉన్నా.. వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి తలెత్తింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: