నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు

నందమూరి తారకరామారాలు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. 2015లో ఈ కాలేజీని గండిపేటలో స్థాపించారు.

news18-telugu
Updated: September 12, 2019, 7:19 PM IST
నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు
ఎన్టీఆర్ ట్రస్ట్ కాలేజీలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న నారా భువనేశ్వరి
  • Share this:
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి, నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నందమూరి తారకరామారాలు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కాలేజీ ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. 2015లో ఈ కాలేజీని గండిపేటలో స్థాపించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన నారా భువనేశ్వరి.. ‘మీరు ఉద్యోగాలు అడిగే వారు కాదు. జాబ్స్ ఇచ్చేవారిగా ఎదగాలి. మీ మీద మీకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు. జీవితం చాలా చిన్నది. ఆనందంగా జీవించండి. ఎన్టీఆర్ కాలేజీలో చదువు ఒక్కటే కాదు విలువలు నేర్పుతారు. చదువుకు మార్కులు ఒక్కటే కొలమానం కూడా కాదు. విద్యార్థులు...పెద్దల పట్ల గౌరవం, ఎదుటివారి పట్ల ప్రేమాభిమానాలు చూపించాలి.’ అని సూచించారు. విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు.
ఫ్రెషర్స్ డే సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: September 12, 2019, 7:17 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading