Home /News /telangana /

NANDED RAILWAY DIVISION ELECTRIFICATION OVER AND GREEN SIGNAL TO ELECTRICITY TRAINS BY ADILABAD VRY ADB

Adilabad : ఆ జిల్లా రైలు ప్రయాణికులకు శుభవార్త.. విద్యుత్ రైళ్లకు గ్రీన్ సిగ్నల్..!

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్

ఆదిలాబాద్ రైల్వే స్టేషన్

Adilabad : ఉత్తర దక్షిణ భారత దేశాలకు మధ్య వారధిగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా (Adilabad ) కేంద్రంలోని రైల్వే స్టేషన్ మీదుగా మీదట విద్యుత్ రైళ్శకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. విద్యుదీకరణ పనులు పూర్తికావడంతో రైల్వేశాఖ అధికారులు తనిఖీలు చేసి అనుమతులు ఇచ్చారు.

ఇంకా చదవండి ...
    (కట్టా లెనిన్, న్యూస్ 18 తెలుగు, ఆదిలాబాద్)
    ఉత్తర దక్షిణ భారత దేశాలకు మధ్య వారధిగా ఉన్న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ మీదుగా ఇక మీదట కరెంటు రైళ్ళు పరుగెత్తనున్నాయి. ఇప్పటి వరకు ఈ స్టేషన్ మీదుగా డిజిల్ ఇంజన్ తో రైలు మాత్రమే నడవగా, ఇక మీదట విద్యుత్ తో నడిచే రైళ్ళు కూడా రానున్నాయి. ఇందుకోసం దక్షణ మధ్య రైల్వే నాందేడ్ డివిజన్ లో విద్యుద్దీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నాందేడ్ నుంచి మధ్య రైల్వే పరిధిలోకి వచ్చే నాగపూర్ ను అనుసందానించడం దీని ముఖ్య ఉద్దేశం.

    నాందేడ్ నుంచి నాగపూర్ వరకు 400 కి.మీ దూరం. ఇందులో నాందేడ్ వైపున ముథ్కేడ్ వరకు 24 కి.మీ విద్యుత్ లైన్ ఇదివరకే ఉంది. అటు నాగపూర్ వైపు మాంజరి వరకు,  మాంజరి నుంచి పిప్పలకూటి వరకు విద్యుద్దీకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. నాందేడ్ నుంచి పిప్పల్ కూటి వరకు 200 కోట్ల అంచనాలతో  మూడు ప్యాకేజీల్లో విద్యుద్దీకరణ చేపట్టారు. దీనిలో పిప్పలకోటి నుంచి ఆదిలాబాద్ వరకు, ఆదిలాబాద్ నుంచి కోసాయి వరకు పనులు పూర్తికాగా ఇటీవల దశల వారీగా లైన్ పరిశీలన జరుగుతోంది.

    Nizamabad : యువతులారా జాగ్రత్త.. తన ఇంటిముందే భర్త కావాలంటూ ధర్నా చేపట్టింది.. ఎందుకంటే...!

    ఈ నెల 7వ తేదీన తొలి విడతగా పిప్పల్ కోటి నుంచి కోసాయి వరకు ట్రయల్ రన్ చేపట్టారు. అది విజయవంతం కావడంతో తాజా ఈ రోజు ఈ మార్గం లో విద్యుదీకరణ పనులను సౌత్ సెంట్రల్ సర్కిల్ కమిషనర్ ఆఫ్  రైల్వే  సేఫ్టీ ముఖ్య అధికారి ఏ.కె.రాయ్  తనిఖీ చేసి విద్యుత్ రైళ్ల రాకపోకలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రత్యేక రైలులో ఇక్కడికి వచ్చిన ఆయన పూర్తైన రైల్వే విద్యుద్దీకరణ పనులను పరిశీలించిన తర్వాత అందించిన నివేదిక మేరకు విద్యుత్ రైలు ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

    Siddipet : మొన్న పెన్సిల్.. నేడు సైకిల్ .. పోలీస్ స్టేషన్‌లకు క్యూ కడుతున్న పిల్లలు... వారిలో అంత ధైర్యం ఎలా...?

    దీంతో నాగపూర్-నాందేడ్ వయా ఆదిలాబాద్ మీదుగా వాణిజ్య, ప్యాసింజర్ రైళ్లు నడిచేందుకు అవకాశం కలిగింది. ప్రస్తుతం పిప్పల్ కూటి నుండి ఆదిలాబాద్ దాటి కోసాయి వరకు విద్యుద్దీకరణ పనులు దక్షిణ మధ్య రైల్వేలో మొదటి విడతలో తీసుకొని పూర్తి చేశారు. మధ్య రైల్వే నుండి దక్షిణ మధ్య రైల్వే నాందేడ్ డివిజన్ లో తొలిసారిగా విద్యుత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. కోసాయి నుండి నాందేడ్ వరకు రెండవ విడతలో ఈ విద్యుద్దీకరణ పనులను చేపట్టి రానున్న రోజుల్లో పూర్తిచేయనున్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ కు పిట్ లైన్ కూడా మంజూరైంది. దీని నిర్మాణం కూడా పూర్తయితే నాందేడ్ జంక్షన్ లో రద్దీ రైళ్లన్నీ ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రారంభమై ఇతర ప్రాతాలకు వెళ్లే అవకాశం ఉంటుంది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Adilabad, South Central Railway

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు