• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • NANDAMURI BALAKRISHNA SAYS BASAVATARAKAM HOSPITAL GETS 6TH BEST CANCER AWARD IN INDIA SU

Nandamuri Balakrishna: నిరుపేదల వైద్యానికి 3 కోట్ల రూపాయలు కేటాయించాం.. నందమూరి బాలకృష్ణ

Nandamuri Balakrishna: నిరుపేదల వైద్యానికి 3 కోట్ల రూపాయలు కేటాయించాం.. నందమూరి బాలకృష్ణ

బాలకృష్ణ (File Photo)

Nandamuri Balakrishna: బసవతారకం ఆస్పత్రికి దేశంలోనే 6వ ఉత్తమ క్యాన్సర్ ఆస్పత్రిగా అవార్డు వచ్చిందని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తెలిపారు.

  • Share this:
    బసవతారకం ఆస్పత్రికి దేశంలోనే 6వ ఉత్తమ క్యాన్సర్ ఆస్పత్రిగా అవార్డు వచ్చిందని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) తెలిపారు. ఈ అవార్డు రావడం తమకు చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. వ్యవస్థను నెలకొల్పడం కన్నా.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం చాలా గొప్ప విషయమం అని చెప్పారు. శనివారం బసవతారకం ఆస్పత్రిని బాలకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బసవతారకం ఆస్పత్రికి 2011లో ఉత్తమ హాస్పిటల్ పరంగా 13వ స్థానం లభించిందని.. 2020 నాటికి 6వ స్థానానికి చేరుకుందని తెలిపారు. దీనిని భవిష్యత్తులో దేశంలోనే మొదటి స్థానానికి తీసుకెళ్లడానికి కృషి చేస్తానని చెప్పారు. సేవ సంకల్పంతో నడుస్తున్న ఆస్పత్రికి అవార్డులు రావడం తమను మరిన్ని సేవలు అందించేందుకు పోత్సహించినట్టుగా భావిస్తున్నట్టు చెప్పారు.

    అంతర్జాతీయ ప్రమాణాలతో, అతి తక్కువ ధరకు బసవతారకం ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నామని బాలకృష్ణ తెలిపారు. ఆస్పత్రిలో ఇప్పటివరకు 3,200 మంది కరోనా సోకిన క్యాన్సర్‌ రోగులకు చికిత్స అందించినట్టు చెప్పారు. నిరుపేదల వైద్యం కోసం 3వేల కోట్ల రూపాయలను ట్రస్ట్‌కు కేటాయించినట్టుగా బాలకృష్ణ వెల్లడించారు. ఆస్పత్రికి మంచి గుర్తింపు తీసుకురావడమే కాకుండా, పేషెంట్లకు మెరుగైన సేవలు అందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి బాలకృష్ణ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.

    అయితే ఈ సందర్భంగా బాలకృష్ణను కొందరు మీడియా ప్రతినిధులు జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాల గురించి ప్రశ్నించారు. దీనిపై స్పందించిన బాలకృష్ణ తాను ఈరోజు రాజకీయాల గురించి మాట్లాడనని తెలిపారు.
    Published by:Sumanth Kanukula
    First published: