GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికల్లో బాలకృష్ణ ప్రచారం ?

Nandamuri Balakrishna: గత GHMC ఎన్నికల్లో టీడీపీ తరపున బాలకృష్ణ ప్రచారం నిర్వహించారు. గ్రేటర్ పరిధిలోని పలు సెగ్మెంట్లలో ప్రచారం చేశారు.

news18-telugu
Updated: November 19, 2020, 10:32 AM IST
GHMC Elections 2020: గ్రేటర్ ఎన్నికల్లో బాలకృష్ణ ప్రచారం ?
బాలకృష్ణ (balakrishna nandamuri)
  • Share this:
Nandamuri Balakrishna: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగాలని టీడీపీ నిర్ణయించింది. ఆ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనే అంశంపై ఇంకా క్లారిటీ రాకపోయినప్పటికీ... తమకు ఓటు బ్యాంకు ఉన్న చోట బరిలో అభ్యర్థులను దింపాలని యోచిస్తోంది. టీడీపీ అభ్యర్థుల జాబితాపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గ్రేటర్ పరిధిలో సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టీడీపీ బరిలోకి దిగే అవకాశం ఉందని.. మరికొన్ని చోట్ల ఇతర పార్టీల నుంచి వచ్చే బలమైన నేతలకు టికెట్లు ఇవ్వాలని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. టీడీపీ పోటీ చేయడం ఖాయం కావడంతో... ఆ పార్టీ తరపున ఎవరూ ప్రచారం చేస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.

గత GHMC ఎన్నికల్లో టీడీపీ తరపున బాలకృష్ణ ప్రచారం నిర్వహించారు. గ్రేటర్ పరిధిలోని పలు సెగ్మెంట్లలో ఆయన ప్రచారం చేశారు. నారా లోకేశ్ సైతం గతంలో గ్రేటర్ ఎన్నికల్లో రోడ్ షోల్లో పాల్గొన్నారు. అయితే ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీ తరపున బాలకృష్ణ, లోకేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా ? లేదా ఎన్నికలకు దూరంగా ఉంటారా ? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే టీడీపీ తరపున పోటీ చేయాలని భావిస్తున్న కొందరు అభ్యర్థులు... ప్రచారానికి రావాల్సిందిగా బాలకృష్ణను కోరుతున్నట్టు తెలుస్తోంది. అయితే దీనిపై బాలకృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. తనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులు గ్రేటర్ బరిలోకి దిగితే బాలకృష్ణ ప్రచారానికి వచ్చే అవకాశం లేకపోలేదని టీడీపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ఇదిలా ఉంటే గ్రేటర్ ఎన్నికలపై కొద్దిరోజుల క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు సైతం పలుసార్లు పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించారు. ఈ ఎన్నికల ద్వారా తెలంగాణలో మళ్లీ బలపడేందుకు ప్రయత్నాలు చేయాలని సూచించారు. ఇంటింటికి తిరిగి టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి చెప్పి ఓట్లు అడగాలని చంద్రబాబు నేతలకు సూచించారు. అయితే ఎన్నికల ప్రక్రియ మొత్తం 15 రోజుల్లో పూర్తయ్యేలా నోటిఫికేషన్ వెలువడటంతో.. ఉన్న కొద్ది సమయంలో టీడీపీ ఎంతమేరకు అనుకున్న ఫలితాలు సాధిస్తుందన్నది ప్రశ్నార్ధకమే.
Published by: Kishore Akkaladevi
First published: November 19, 2020, 10:32 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading