Home /News /telangana /

NAMPALLY SPECIAL COURT SENTENCED ONE YEAR IMPRISONMENT TO TELANGANA BJP MLA RAJA SINGH SRD

Telangana : రాజాసింగ్ కు షాక్.. గోషా మహల్ ఎమ్మెల్యేకి ఏడాది జైలు శిక్ష

రాజాసింగ్ (ఫైల్ ఫోటో)

రాజాసింగ్ (ఫైల్ ఫోటో)

Telangana : తెలంగాణ బీజేపీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు షాక్‌ తగిలింది. నాంపల్లి ప్రత్యేక కోర్టు రాజా సింగ్‌కు ఒక ఏడాది జైలు శిక్ష విధిస్తూ.. తీర్పు వెల్లడించింది.

    తెలంగాణ బీజేపీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్‌కు షాక్‌ తగిలింది. నాంపల్లి ప్రత్యేక కోర్టు రాజా సింగ్‌కు ఒక ఏడాది జైలు శిక్ష విధిస్తూ.. తీర్పు వెల్లడించింది. 2016 ఉస్మానియా బీఫ్ ఫెస్టివల్ వ్యవహారంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేప‌థ్యంలో ఐదు సంవత్సరాల క్రితం కేసు నమోదయ్యింది. ఆయనను అరెస్ట్‌ చేసి బొల్లారం పీఎస్‌కు తరలించారు. పోలీస్‌ స్టేషన్‌లో రాజా సింగ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై సెక్షన్ 295 ఏ కింద బొల్లారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఐదేళ్ల తర్వాత ఈ కేసులో నాంపల్లి కోర్టు శుక్రవారం తీర్పు ప్రకటించింది. ఇక దీనిపై రాజా సింగ్‌ బెయిల్ పిటీషన్ దాఖలు చేయడంతో కోర్టు ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఇక ఈ కేసుపై హైకోర్టును ఆశ్రయిస్తానని రాజా సింగ్‌ తెలిపారు. బీఫ్ ఫెస్టివల్ సందర్భంగా రాజాసింగ్ ఆ సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీఫ్ ఫెస్టివల్ జరుపుతామని ఓయూ విద్యార్థులు ప్రకటించారు. దీనికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీలోకి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఉస్మానియాలో బీఫ్ ఫెస్టివల్ చేస్తే.. మరో దాద్రి అవుతుందని వివాదస్పద వాఖ్యలు చేశారు రాజాసింగ్.

    ఈ నేపథ్యంలో నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఇవాళ రాజాసింగ్ కేసు విచారణకు వచ్చింది. ప్రాసిక్యూషన్ సమర్పించిన ఆధారాలన్నీ రుజువు కావడంతో ప్రత్యేక న్యాయస్థానం రాజాసింగ్‌కు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. అయితే తన జైలు శిక్ష పైన రాజాసింగ్ వెంటనే బెయిల్ కూడా మంజూరు చేసింది. హైకోర్టులో అప్పీల్ చేసేందుకు నెల సమయం కూడా విధించింది. తాను ఎలాంటి తప్పు చేయలేదని అప్పటికీ పోలీసులు బలవంతంగా తనపై కేసులు వేశారని రాజాసింగ్ ఆరోపించారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bjp, Raja Singh, Telangana, Telangana bjp

    తదుపరి వార్తలు