Covid-19 Vaccine: కరోనాపై గెలిచాం.. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నర్సుల విజయోత్సాహం. నెట్టింట్లో సెల్ఫీ వైరల్

నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో నర్సుల సెల్ఫీ

తెలుగు రాష్ట్రాల్లో కూడా కొవిడ్ వ్యాక్సిన్ సరఫరా ప్రక్రియ ప్రారంభమయింది. కరోనా మహమ్మారిని తరిమికొడుతున్నామన్న ఆనందం ప్రతి పౌరుడిలోనూ కనిపిస్తోంది. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రజల ప్రాణాలను కాపాడిన వైద్య సిబ్బందిలో ఆనందం వెల్లివిరుస్తోంది.

  • Share this:
    దేశవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్ సరఫరా ప్రక్రియ శనివారంతో ప్రారంభమయింది. మొదటి విడతగా అత్యవసర విభాగాల సిబ్బందికి ఈ కొవిడ్ వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. కరోనా సమయంలో దేశానికి అంకిత భావంతో సేవలు అందించిన పారిశుధ్య కార్మికులు, వైద్య సిబ్బంది వంటి వారికి కొవిడ్ వ్యాక్సిన్ ను మొదటి విడతలో అందజేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో కూడా కొవిడ్ వ్యాక్సిన్ సరఫరా ప్రక్రియ ప్రారంభమయింది. కరోనా మహమ్మారిని తరిమికొడుతున్నామన్న ఆనందం ప్రతి పౌరుడిలోనూ కనిపిస్తోంది. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రజల ప్రాణాలను కాపాడిన వైద్య సిబ్బందిలో ఆనందం వెల్లివిరుస్తోంది.

    తెలంగాణలో ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిసి హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో మొదటి టీకాను కృష్ణమ్మకు అందించారు. ఆ తర్వాత ఇతర వైద్య సిబ్బంది, పారిశుధ్య సిబ్బందికి అందించారు. ఇదే సమయంలో నాంపల్లిలోని ఏరియా ఆసుపత్రిలో కూడా కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగింది. ఆ ఆసుపత్రిలో కొవిడ్ వ్యాక్సిన్ ను తీసుకున్న తర్వాత కొందరు నర్సులు సెల్ఫీని తీసుకున్నారు. ‘మొత్తానికి కరోనాపై మనం గెలిచాం‘ అన్న క్యాప్షన్ తో ఆ సెల్ఫీని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసుకున్నారు. ఇది కాస్తా వైరల్ గా మారింది. కరోనా మహమ్మారి విజ‌ృంభించిన సమయంలో ప్రాణాలను కాపాడిన వారే, నేడు కరోనాను గెలిచేశామన్న ధీమాను వ్యక్తం చేస్తుండటం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    ఇదిలా ఉండగా, ఏపీలో కూడా కరోనా వేక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమయింది. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ వేక్సినేషన్ ప్రక్రియకు హాజరయ్యారు. ఏపీలో తొలి వ్యాక్సిన్ ను హెల్త్ వర్కర్ పుష్పకుమారికి అందించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు మొదటి విడతగా కరోనా టీకాను అందిద్దామంటూ ప్రధాని మోదీ కొద్ది రోజుల క్రితం పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా రాజకీయ నేతలంతా మోదీ సూచనను అనుసరిస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published: