హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bullets :ఏకే 47 బుల్లెట్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పేరు..చెన్నూరులో కలకలం

Bullets :ఏకే 47 బుల్లెట్లతో టీఆర్ఎస్ ఎమ్మెల్యే పేరు..చెన్నూరులో కలకలం

బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు

బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు

గురువారం వాట్సాప్స్ గ్రూప్ లలో ఓ ఫొటో చక్కర్లు కొట్టింది. ఆ ఫొటోలో ఓ టవల్ పై మొత్తం 62 రైఫిల్ బుల్లెట్లతో జై బాలక్క సుమన్ అని రాసి ఉంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

టీఆర్ఎస్ నాయకుడు,చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) పై అభిమానం చాటుకున్న ఓ జవాన్ చిక్కుల్లో పడ్డాడు. గురువారం వాట్సాప్స్ గ్రూప్ లలో ఓ ఫొటో చక్కర్లు కొట్టింది. ఆ ఫొటోలో ఓ టవల్ పై మొత్తం 62 రైఫిల్ బుల్లెట్లతో జై బాలక్క సుమన్ అని రాసి ఉంది. టీఆర్ఎస్ కార్యకర్త, బాల్క సుమన్ అనుచరుడు కొప్పుల రవి తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకున్నాడు. సీఎం కేసీఆర్ సింగరేణిలో లాభాల వాటా 30 శాతం ప్రకటించిన సందర్భంగా ఉబ్బితబ్బిబ్బయిన సింగరేణి కార్మికుడైన కొప్పుల రవి ఇలా తన అభిమానాన్ని చూపించుకున్నాడు.  కొప్పుల రవి పెట్టిన స్టేటస్‌లో దాదాపు 62 బుల్లెట్లు కనిపిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ ఫొటో కాస్తా వాట్సాప్ లో వైరల్ గా మారడంతో ఆ బుల్లెట్లు ఎక్కడివి?అతడికి ఈ బెల్లెట్లు ఎలా వచ్చాయి?ఎవరు బుల్లెట్లతో బాల్క సుమన్ అని రాశారు అని పోలీసు,నిఘా వర్గాలు ఆరా తీశాయి. దీనిపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

ట్రాఫిక్ కష్టాలకు చెక్..బెంగుళూరులో హెలికాఫ్టర్ రైడ్ సర్వీసులు ప్రారంభం!

చెన్నూరు టౌన్ కి చెందిన వంగాల సతీష్ సీఆర్పీఎఫ్ జవాన్ గా ప్రస్తుతం బీజాపూర్ లో విధులు నిర్వహిస్తున్నాడు. తన దగ్గర ఉన్న బుల్లెట్లతో ఎమ్మెల్యే పేరు రాసి ఫొటో తీసి,పట్టణంలో పలువురికి సతీష్ వాట్సాప్ లో పంపాడు. ఈ ఫొటోలను కొందరు వాట్సాప్ గ్రూప్ లలో పోస్ట్ చేయడంతోపాటు మరికొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు స్టేటస్ గా పెట్టుకున్నట్లు విచారణలో తెలింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Balka Suman, Crime news, CRPF, Telangana, Trs

ఉత్తమ కథలు