హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu : మునుగోడు ఉపఎన్నిక పోటీపై వైఎస్ షర్మిల వెనకడుగు .. ఆ ఒక్క కారణమేనట

Munugodu : మునుగోడు ఉపఎన్నిక పోటీపై వైఎస్ షర్మిల వెనకడుగు .. ఆ ఒక్క కారణమేనట

YS SHARMILA(FILE)

YS SHARMILA(FILE)

Munugodu:మొదట్నుంచి మునుగోడులో పోటీ చేస్తామని ..అభ్యర్ధిని ప్రకటిస్తామని తెలిపిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ నుంచి వైదొలగినట్లుగా తెలుస్తోంది. పోటీకి దూరం కావడానికి కారణం అదేనట. అంతే కాదు బీజేపీ అభ్యర్ధికి మద్దతివ్వాలనే ఆలోచన చేస్తున్నట్లుగా సమాచారం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మునుగోడు( Munugodu)ఉపఎన్నిక రసవత్తరంగా మారుతోంది. రోజు రోజుకు మారుతున్న రాజకీయ పరిణామాలతో పోటీ ఉత్కంఠగా మారుతోంది. ఇప్పటి వరకు బీజేపీ(BJP), టీఆర్ఎస్‌(TRS), కాంగ్రెస్‌(Congress)మాత్రమే ముఖ్య పోటీ దారులుగా భావిస్తున్నప్పటికి ..వైఎస్ఆర్‌టీపీ(YSRTP), ప్రజాశాంతి(Praja Shanthi) పార్టీలతో పాటు స్వతంత్రులు భారీగానే పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కాని చివరి క్షణంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మొదట్నుంచి మునుగోడులో పోటీ చేస్తామని ..అభ్యర్ధిని ప్రకటిస్తామని తెలిపిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పోటీ నుంచి వైదొలగినట్లుగా తెలుస్తోంది. అంతే కాదు బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komati Reddy Rajagopal Reddy)కి తమ సపోర్ట్‌ ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila)నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

Munugodu : ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రజాగాయకుడు .. ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధిగా గద్దర్ ప్రచారం షురూ

అనూష్య పరిణామం..

రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎన్నికల్లో ప్రధాన పోటీలుగా ఉన్న వాళ్లు చివరి క్షణంలో సైడ్ అయిపోవచ్చు...చివరి వరకు పోటీ చేస్తారా లేదా అనే సందేహంలో ఉన్న వాళ్లు ముందుగానే బరిలో నిలబడవచ్చు. మునుగోడు విషయంలో కూడా అదే జరుగుతోంది. బీజేపీ , టీఆర్ఎస్‌, కాంగ్రెస్‌పై ఒంటి కాలుపై లేచిన వైఎస్‌ షర్మిల మునుగోడులో తాము పోటీ చేస్తామని ...అభ్యర్ధిని నిలబెడతానని అందరి కంటే ముందే ప్రకటించారు. కాని ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే ముందే ఆమె మునుగోడు పోటీ విషయంలో వెనకడుగు వేశారని తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో తన తండ్రి వైఎస్‌ఆర్‌ రాజశేఖర్‌రెడ్డితో ఉన్న రిలేషన్‌షిప్పే కారణంగా చూపిస్తోంది వైఎస్ఆర్‌టీపీ.

పోటీకి దూరం..బీజేపీకి సపోర్ట్ ..!

తెలంగాణలో టీఆర్ఎస్‌ని ఎటాక్ చేయడానికి కంకణం కట్టుకున్న వైఎస్ షర్మిల పాదయాత్రలో కూడా అదే తీరుగా ఆ పార్టీ నేతల్ని విమర్శిస్తున్నారు. టీఆర్ఎస్‌ను ఓడించాలని పిలుపునిస్తున్నారు. ఈక్రమంలోనే మునుగోడు ఉపఎన్నిక రావడంతో తమ పార్టీ పోటీ చేసి రాజగోపాల్‌రెడ్డి ఓటింగ్ శాతాన్ని తీల్చడం కంటే ఎన్నికల బరి నుంచి సైలెంట్‌గా తప్పుకుంటే ఆయనకు పరోక్షంగా మద్దతిచ్చినట్లుగా ఉంటుందనే భావిస్తున్నారు. అంతే కాదు తెలంగాణలో షర్మిల కేసీఆర్ ప్రభుత్వంపై కేంద్రానికి ఫిర్యాదులు చేయడానికి ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. కేంద్ర మంత్రులతో టీఆర్ఎస్‌ అవినీతిపై ఓ నివేదికను కూడా ఇస్తారని వైఎస్ఆర్‌టీపీ వర్గాలు చెబుతున్నాయి. ఈక్రమంలోనే తమ ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలున్న రాజగోపాల్‌రెడ్డిపై పోటీ చేయడం కంటే .. పోటీ చేయకపోవడమే బెటర్ అని వైఎస్‌ షర్మిల భావించినట్లుగా ఆ పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

Published by:Siva Nanduri
First published:

Tags: Munugode Bypoll, Telangana Politics, YS Sharmila

ఉత్తమ కథలు