అట్టడుగు వర్గాలు, నిరుపేదల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల అమలు విషయంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా దళిత బంధు పథకం (Dalit Bandhu Scheme)విషయంలో నల్లగొండNalgonda జిల్లాలో ఓ గ్రామ సర్పంచ్(Sarpanch)లబ్ధిదారుడు తనకు లంచం ఇవ్వలేదనే కోపంతో ఊరి జనం చూస్తుండగా చెప్పుతో కొట్టడం వివాదాస్పదమైంది. నల్లగండ జిల్లా నార్కెట్‌పల్లి(Narketpally)మండలం బజకుంట(Bajakunta)సర్పంచ్ సరితా రెడ్డి (Saritha Reddy) వెలగబెట్టిన ఘనకార్యం కారణంగా ప్రభుత్వంపై మండిపడుతున్నారు విపక్షాల నేతలు. దళిత, అణగారిన వర్గాల ప్రజలు. అసలేం జరిగిందంటే..
లంచం కోసం సర్పంచ్ దాడి..
ప్రభుత్వం ఏ సంక్షేమ పథకం అమలు చేస్తున్నా అందులోని లొసుగులు, ఎంపిక చేసే విధానం అడ్డుపెట్టుకొని అధికారులు, ప్రజాప్రతినిధులు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ముఖ్యంగా దళిత బంధు, రైతుబంధు, రైతు భీమా వంటి పథకాలకు గ్రామసర్పంచ్‌లు, ఎమ్మెల్యేల స్థాయిలో ఎంపిక జరుపుతుండటంతో వివాదాలకు దారి తీస్తున్నాయి. విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలం బజకుంట గ్రామంలో దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందిన వ్యక్తి తనకు లంచం ఇవ్వలేదనే కోపంతో గ్రామ సర్పంచ్‌గా ఉన్నటువంటి మహిళ సరితారెడ్డి గ్రామస్తుల ముందే లబ్ధిదారుల్ని తన చెప్పుతో కొట్టడం దుమారం రేపింది.
#KCR మీరేమో దళిత బందని మోసం చేయవడ్తిరి, మీ అగ్ర వర్ణ సర్పంచులేమో పేద దళితులపై నార్కెట్‌పల్లిలో ఎట్ల దాడి చేస్తున్నరో చూడండి. ఇక మీ పోలీసులేమో ఫిర్యాదు ఇచ్చిన రెండు రోజులకు కూడా మీ అండ చూసుకొని స్పందించడం లేదు. ఈ సర్పంచ్‌ని వెంటనే అరెస్టు చేసి, ఎస్సైని వెంటనే విధులనుండి తొలగించాలి. pic.twitter.com/ugT0YPgsHD
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) December 9, 2022
ఊరి పెద్దే ఇలా చేయవచ్చా..?
గ్రామ పరిపాలన చూడాల్సిన స్థాయిలో ఉన్న మహిళ మగవాళ్లని కూడా చూడకుండా లంచం కోసం చెప్పుతో కొట్టడంపై విపక్షాల నేతలతో పాటు, దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.సదరు గ్రామ మహిళా సర్పంచ్‌గా ఉన్నటువంటి సరితారెడ్డి అధికార పార్టీకి చెందిన నాయకురాలు కావడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది. అంతే కాదు సర్పంచ్ చెప్పుతో దాడి చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న కొందరు వీడియో తీస్తుండగా వారిపై కూడా దాడి చేసింది సర్పంచ్ సరితారెడ్డి. ఈఘటనపై పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇద్దరిపై చర్యలు తీసుకోవాల్సిందే..
ఒక అధికార పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ ..దళితులపై చెప్పుతో దాడి చేయడాన్ని బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తప్పు పట్టారు. దళిత బంధు పేరుతో కేసీఆర్ దళితుల్ని మోసం చేస్తుంటే అగ్రవర్ణాల నేతలు అణగారిన వర్గాలపై దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్టర్లో వీడియో పోస్ట్ చేశారు. గ్రామాల్లో ఇంతటి దారుణాలు జరుగుతున్నా చర్యలు తీసుకోని ఎస్‌ని సస్పెండ్ చేయాలని మహిళా సర్పంచ్ సరితారెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Nalgonda, Telangana News