హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalgonda : వివాహిత మృతితో పోలీస్‌ స్టేషన్‌ దగ్గర ఉద్రిక్తత .. కారణమైన అతడ్ని వదలద్దంటున్న బంధువులు

Nalgonda : వివాహిత మృతితో పోలీస్‌ స్టేషన్‌ దగ్గర ఉద్రిక్తత .. కారణమైన అతడ్ని వదలద్దంటున్న బంధువులు

NALGONDA LADY DIED

NALGONDA LADY DIED

Nalgonda: వివాహిత మృతి ఘటనలో బాధిత బంధువులు తీవ్ర ఆందోళనకు దిగిన ఘటన నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలంలో సోమవారం చోటుచేసుకుంది. కడుపు నొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన నల్గొండ జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

ఇంకా చదవండి ...

  (Nagaraju,News18, Nalgonda)

  వివాహిత మృతి ఘటనలో బాధిత బంధువులు తీవ్ర ఆందోళనకు దిగిన ఘటన నల్గొండ(Nalgonda) జిల్లా తిరుమలగిరి(Tirumalagiri)మండలంలో సోమవారం(Monday)చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాగార్జునపేట తండాకు చెందిన కొర్ర నర్సింహ(Korra Narsimha), బట్టువెంకన్న(Battuvenkanna)బావితండాకు చెందిన సోనియా(Sonia)ను పెద్దల నిశ్చయం మేరకు పెళ్లి చేసుకున్నారు. ఇటీవల సోనియా అనారోగ్యానికి గురికాగా నాగార్జునసాగర్(Nagarjunasagar) ప్రభుత్వ ఆసుపత్రిలో వారం పాటు చికిత్స తీసుకుంది. జ్వరం ఎంతకూ తగ్గకపోవడంతో మాచర్లలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స ఇప్పించి ఇంటికి తీసుకొచ్చాడు భర్త నర్సింహ. ఈక్రమంలో సోనియా ఆదివారం(Sunday)మధ్యాహ్నం హఠాత్తుగా మరణించింది. కుమార్తె మరణాన్ని జీర్ణించుకోలేని సోనియా తల్లిదండ్రులు... తమ అల్లుడే కుమార్తెను పొట్టనబెట్టుకున్నాడు అంటూ ఆందోళనకు దిగారు. బాధిత బంధువులు సైతం సాగర్ పోలీస్ స్టేషన్(Police station)వద్ద ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మృతురాలి తమ్ముడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని తహశీల్దార్ పాండునాయక్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు.పోస్ట్ మార్టం(Post mortem) కోసం మృతదేహని సాగర్లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శవపరీక్ష అనంతరం కేసు విచారించి చర్యలు తీసుకుంటామని ఎస్సై పెదపంగ బాబు తెలిపారు.

  Telangana : నా మొదటి జీతం నెలకు 800 .. నన్ను మార్గదర్శకంగా తీసుకోని ఎదగండి : వేముల ప్రశాంత్‌రెడ్డి


  వివాహిత మృతిపై కలకలం..

  విద్యుదాఘాతంతో మహిళ మృతిచెందిన ఘటన హుజుర్ నగర్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు....హుజుర్ నగర్‌ చింతల బజారుకు చెందిన పసుపులేటి మున్ని(40) అనే మహిళ పట్టణంలోని మిర్యాలగూడ రోడ్డులో ఉన్న ప్రమీల రైస్ మిల్లులో దినసరి కూలీగా పనిచేస్తుంది. సోమవారం మిల్లులో పనికి వెళ్లిన మున్ని ప్రమాదవశాత్తు కరెంటు షాక్‌కి గురైంది. అక్కడే ఉన్న ఇతర సిబ్బంది బాధితురాలని 108 వాహనంలో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిగా తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై సమాచారం అందుకున్న హుజుర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  పోలీస్‌ స్టేషన్‌లో పంచాయితీ..

  కడుపు నొప్పి భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన నల్గొండ జిల్లా వలిగొండ మండలం వేములకొండ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వలిగొండ ఎస్ఐ ప్రభాకర్ తెలిపిన వివరాలు మేరకు గ్రామానికి చెందిన ఓర్సు రాములు (42) దినసరి కూలీగా జీవనం సాగిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న రాములు... అది భరించలేక సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పనికి వెళ్లిన కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చేసరికి రాములు ఉరి వేసుకుని ఉన్నట్లు గుర్తించారని, ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రభాకర్ పేర్కొన్నారు.

  Published by:Siva Nanduri
  First published:

  Tags: Crime news, Local News, Nalgonda

  ఉత్తమ కథలు