హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: టీఆర్ఎస్‌కు ఆ సీటు టెన్షన్.. తేడా వస్తే.. ఆ మూడు చోట్ల రియాక్షన్ ?

Telangana: టీఆర్ఎస్‌కు ఆ సీటు టెన్షన్.. తేడా వస్తే.. ఆ మూడు చోట్ల రియాక్షన్ ?

కేసీఆర్‌తో కేటీఆర్(ఫైల్ ఫోటో)

కేసీఆర్‌తో కేటీఆర్(ఫైల్ ఫోటో)

Nalgonda Warangal Khammam MLC Election: తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ తమ పట్టు నిలుపుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి.. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు అత్యంత కీలకంగా మారినట్టు పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతోంది.

ఇంకా చదవండి ...

తెలంగాణలో జరగనున్న రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారాయి. రాష్ట్ర రాజకీయాల్లో దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీ.. ఇక్కడ కూడా టీఆర్ఎస్‌కు షాక్ ఇస్తుందా ? అనే ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఈ రెండు సీట్లను గెలుచుకుని పట్టు నిలుపుకోవాలని టీఆర్ఎస్ యోచిస్తోంది. అయితే ఈ రెండు సీట్లలో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సీటు టీఆర్ఎస్‌కు ఎంతో కీలకంగా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఈ సీటు టీఆర్ఎస్ సిట్టింగ్ సీటు. ఇక్కడి నుంచి గతంలో ఎమ్మెల్సీగా గెలుపొందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. మళ్లీ టీఆర్ఎస్ తరపున తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే ఈసారి ఆయన గెలుపు అంత ఈజీ కాదనే టాక్ వినిపిస్తోంది. ఇక్కడి నుంచి బరిలో ప్రధాన పార్టీలతో పాటు కోదండరాం సహా అనేక మంది ఇండిపెండెంట్లు ఉన్నారు. అది టీఆర్ఎస్‌కు ప్లస్ అవుతుందా లేక మైనస్ అవుతుందా అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే ఈ సీటును టీఆర్ఎస్ కోల్పోతే.. ఈ మూడు జిల్లాల్లో ఆ ప్రభావం ఉంటుందనే చర్చ సాగుతోంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో త్వరలోనే నాగార్జునసాగర్ ఉప ఎన్నిక జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే.. దాని విపక్షాలు అక్కడ క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ఇక వరంగల్ జిల్లాకు సంబంధించిన వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఎన్నిక ప్రభావం వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై ఉంటుందని జిల్లా వర్గాల్లో ఊహాగానాలు మొదలయ్యాయి. మరోవైపు ఖమ్మంలోనూ ఇదే పరిస్థితి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి.

ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఎదురుగాలి వీస్తే.. ఆ ప్రభావం ఆ ఎన్నికలపై ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది. ఇలా ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో మూడు వేర్వేరు ఎన్నికలు ఉండటంతో.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రభావం వాటిపై ఎంతో కొంత ఉంటుందనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ తమ పట్టు నిలుపుకోవాలని తీవ్రంగా శ్రమిస్తున్న అధికార టీఆర్ఎస్ పార్టీకి.. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు అత్యంత కీలకంగా మారినట్టు పరిస్థితులను బట్టి చూస్తే అర్థమవుతోంది.

First published:

Tags: Khammam, Nalgonda, Telangana, Trs, Warangal

ఉత్తమ కథలు