హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu: ఎన్నికల ప్రచారంలో మంత్రి మల్లారెడ్డిని ఆ డబ్బుల కోసం అడ్డుకున్న జనం .. వీడియో ఇదిగో

Munugodu: ఎన్నికల ప్రచారంలో మంత్రి మల్లారెడ్డిని ఆ డబ్బుల కోసం అడ్డుకున్న జనం .. వీడియో ఇదిగో

(Photo Credit:Face Book)

(Photo Credit:Face Book)

Munugodu: తెలంగాణ మంత్రి మల్లారెడ్డికి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మునగోడు ఉపఎన్నికల ప్రచారంలో ఆయనకు వరుసగా చేదుఅనుభవాలు ఎదురవుతున్నాయి. ఆరెగూడెంలో మంత్రి డబ్బుల కోసం గ్రామస్తులు, కులసంఘాల నాయకులు నిలదీశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda, India

తెలంగాణ మంత్రి మల్లారెడ్డి(Mallareddy)కి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మునగోడు (Munugodu)ఉపఎన్నికల ప్రచారంలో ఆయనకు వరుసగా చేదుఅనుభవాలు ఎదురవుతున్నాయి. మొన్న మద్యం పోస్తున్న ఫోటోలు వైరల్ అయితే ..నిన్న జర్నలిస్ట్ సెల్‌ఫోన్ లాక్కొని విమర్శలు ఎదుర్కొన్నారు. ఇది మర్చిపోక ముందే ఆదివారం చౌటుప్పల్ (Chautuppal)మండలం ఆరెగూడెంలో గౌడ కులస్తుల నుంచి మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. ఓ గుడి నిర్మాణం కోసం మంత్రి ఆర్ధిక సాయం ప్రకటించి అందులో కొంత మాత్రమే ఇచ్చి మిగిలిన వాటిని ఇవ్వకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. మరోసారి ప్రచారానికి వచ్చిన మంత్రిని నిలదీశారు. ఇస్తానని హామీ ఇచ్చిన డబ్బును వెంటనే ఇవ్వాలని పట్టుబట్టడంతో మంత్రి నోరు వెళ్లబెట్టాల్సిన పరిస్థితి తలెత్తింది.

TRS vs BJP: TRSను వీడిన ఆ మాజీ ఎంపీని BJPనేతలు ఆ విధంగా అవమానిస్తున్నారా ..ఆ మంత్రి చెబుతోంది నిజమేనా..?

మంత్రి మల్లారెడ్డికి మరో జలక్..

మునుగోడు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌ గెలుపు పక్కన పెడితే మంత్రి మల్లారెడ్డికి మాత్రం నియోజకవర్గ ఓటర్ల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. ప్రచారంలో భాగంగా మంత్రి ఆదివారం మునుగోడు నియోజకవర్గంలో మల్లారెడ్డి చౌటుప్పల్ ఆరెగూడెం గ్రామానికి వెళ్లారు. అయితే అక్కడే మంత్రిని గౌడ కులస్తులతో పాటు గ్రామస్తులు అడ్డుకున్నారు. కాటమయ్య గుడి కోసం 12 లక్షలు ఇస్తామని రెండ్రోజుల కింద ఒప్పుకొని 2 లక్షలు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. మిగతా 10లక్షలు కూడా ఇవ్వాలని గౌడకులస్తులు డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల తర్వాత ఎవరూ కనిపించరంటూ ఇస్తామని ప్రకటించిన ఆర్ధిక సాయాన్ని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. గౌడ సంఘ నాయకులు, యాదవ, వడ్డెర సంఘానికి కూడా మంత్రి మల్లారెడ్డి ఆలయాల నిర్మాణం కోసం హామీ ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.

వారం వ్యవధిలో మూడో ఘటన..

వారం రోజుల క్రితం మునుగోడు ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు మద్యం పోస్తున్నట్లుగా ఫోటోలతో అడ్డంగా బుక్కయ్యారు. ఆ తర్వాత మూడ్రోజుల క్రితం ఆరెగూడెం రెడ్డిబావి గ్రామంలో కుల సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఆ సమయంలో అక్కడికి న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టు సెల్‌ఫోన్‌ని లాక్కున్నారు. దీనిపై కూడా మంత్రిని సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా తప్పుబట్టారు.మంత్రి ప్రవర్తన చూసి స్థానికులు ఆశ్చర్యపోగా..జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

First published:

Tags: Malla Reddy, Munugode Bypoll, Telangana Politics

ఉత్తమ కథలు