హోమ్ /వార్తలు /తెలంగాణ /

Komatireddy Rajagopal Reddy: బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి .. మునుగోడు సభలో కేసీఆర్‌ను ఏం చేస్తానన్నారంటే

Komatireddy Rajagopal Reddy: బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి .. మునుగోడు సభలో కేసీఆర్‌ను ఏం చేస్తానన్నారంటే

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Komatireddy Rajagopal Reddy: మునుగోడు మాజీ ఎమ్మెల్యే, మాజీ కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారు. కేంద్రం హోంమంత్రి అమిత్‌షా మునుగోడులోని బీజేపీ బహిరంగసభ వేదికపై రాజగోపాల్‌రెడ్డి మెడలో కాషాయం కండువా కప్పు బీజేపీలోకి ఆహ్వానించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda, India

మునుగోడు(Munagodu)మాజీ ఎమ్మెల్యే, మాజీ కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komatireddy Rajagopal Reddy)బీజేపీలో చేరారు. కేంద్రం హోంమంత్రి అమిత్‌షా మునుగోడులోని బీజేపీ బహిరంగసభ వేదికపై రాజగోపాల్‌రెడ్డి మెడలో కాషాయం కండువా కప్పు బీజేపీ(BJP)లోకి ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన కల్వకుంట్ల ఫ్యామిలీని గద్దె దింపడమే తన లక్ష్యమని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.

Telangana | Amit Shah: తెలంగాణలో అడుగుపెట్టిన అమిత్‌షా .. పార్టీ కార్యకర్త ఇంట్లో కేంద్ర హోంమంత్రికి టీ పార్టీ



కండువా మార్చుకున్న రాజగోపాల్..

తాను పార్టీ మారింది మునుగోడు ప్రజల కోసమే. తన రాజీనామాతోనే కేసీఆర్ దిగొచ్చారని రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. తాను స్వార్ధం కోసం పార్టీని మారుతున్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. నిజంగా తాను స్వార్ధం కోసమే చేసుకుంటే ఉపఎన్నికలకు ఎందుకు సిద్ధపడతానని చెప్పారు. కేవలం టీఆర్ఎస్‌ పార్టీకి బుద్ధి చెప్పడానికి, కేసీఆర్ మెడలు వంచడానికే తాను రాజీనామా చేశానన్నారు. తాను చేస్తున్న ధర్మయుద్ధంలో ప్రజలంతా తనకు అండగా నిలబడాలని పిలుపునిచ్చారు రాజగోపాల్‌రెడ్డి.



యుద్ధం చేయడానికి నేను రెడీ ..

ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవిని మునుగోడు ప్రజల కోసమే వదులుకున్నానని చెప్పారు. ఫామ్‌ హౌస్‌లో పడుకునే కేసీఆర్‌కి ప్రజల కష్టాలు గుర్తుకు రాలేదని..తన రాజీనామాతో మునుగోడు ప్రజలు గుర్తుకు వచ్చారని చెప్పారు.శనివారం నిర్వహించిన సభకు డబ్బులిచ్చి ప్రజల్ని తరలించాలని చూశారని ఆరోపించారు. చివరకు తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్ధి పేరును ప్రకటించే ధైర్యం చేయలేకపోయారు కేసీఆర్ అంటూ ఘాటు విమర్శలు చేశారు రాజగోపాల్‌రెడ్డి.

First published:

Tags: Amit Shah, Komatireddy rajagopal reddy, Munugode Bypoll, Telangana News

ఉత్తమ కథలు