హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugode Bypoll Result: మునుగోడు ఉపఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్‌ ఘనవిజయం ..ఎన్ని వేల ఓట్ల మెజార్టీ అంటే ..

Munugode Bypoll Result: మునుగోడు ఉపఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్‌ ఘనవిజయం ..ఎన్ని వేల ఓట్ల మెజార్టీ అంటే ..

kusukuntla cm kcr

kusukuntla cm kcr

Munugode Bypoll Result: మునుగోడు ఉపఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్‌ ఘనవిజయం సాధించింది. బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై టీఆర్ఎస్‌ అభ్యర్ధి ప్రభాకర్‌రెడ్డి పది వేలకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda, India

మునుగోడు (Munugodu)ఉపఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్‌(TRS)పార్టీ విజయంఢంకా మోగించింది. బీజేపీ(BJP)అంచనాలను తలదన్నే విధంగా పది వేలకుపైగా ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిKomati Reddy Rajagopal Reddyపై టీఆర్ఎస్‌ అభ్యర్ధి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి Kusukuntla Prabhakar Reddyవిజయం సాధించారు. అయితే ఓట్ల లెక్కింపు మొదలుపెట్టిన 15రౌండ్లలో తొలి రౌండ్‌లో మినహాంచి ప్రతి రౌండ్‌లోనూ టీఆర్ఎస్‌ మెజార్టీ పెరుగుతూ వచ్చింది. మొదట వందల్లో పెరిగిన మెజార్టీ క్రమంగా వేలకు చేరింది. 13వ రౌండ్‌ వచ్చే సరికి 8976 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు టీఆర్ఎస్ అభ్యర్ది. చివరి రౌౌండ్‌తో కలిపి 11666 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించింది టీఆర్ఎస్.

ప్రతీ రౌండ్‌లో ఆధిక్యమే..

టీఆర్ఎస్‌ విజయం ఖాయమని తేలడంతో అప్పటికే రాజగోపాల్‌రెడ్డి తన ఓటమిని అంగీకరించారు. అయితే మొదటి రౌండ్‌ నుంచి టీఆర్ఎస్‌ ఓట్ల ఆధిక్యాన్ని ఒకసారి పరిశీలిస్తే ..ఈవిధంగా ఉన్నాయి.

రౌండ్‌ల వారిగా టీఆర్ఎస్‌ లీడ్‌ డిటెయిల్స్ ఇవిగో..

1st round:

TRS- 6317

BJP- 5127

Lead by TRS-1190

2nd round:

TRS- 7781

BJP- 8623

Total Lead by TRS-348

3rd round:

TRS- 7387

BJP- 7426

Total Lead by TRS-309

4th round:

TRS- 4855

BJP- 4560

Total lead by TRS -604

5th round:

TRS- 6062

BJP- 5245

Total lead by TRS-1426

6th round:

TRS - 6016

BJP- 5378

Total lead by TRS-2258

7th round:

TRS- 7202

BJP- 6799

Total lead by TRS-2572

8th round:

TRS-6520

BJP- 6188

Total lead by TRS-2904

9th round:

TRS- 7234+283 = 7518

BJP- 6506+159 = 6665

Total lead by TRS-3757

10th round:

TRS- 7503

BJP- 7017

Total lead by TRS-4243

11th round:

TRS-7214

BJP- 5754

This round lead by-1461

Total lead by TRS- 5704

12th round:

TRS- 7448

BJP- 5448

This round lead by -2000

Total lead by TRS- 7704

13th round:

TRS- 6618

BJP- 5346

This round lead by TRS -1272

Total lead by TRS-8976

Total lead by TRS-8976

అక్కడి నుంచే ఓటమి భయం మొదలు..

నాల్గో రౌండ్ తర్వాత విజయంపై ధీమా కోల్పోయిన రాజగోపాల్‌రెడ్డి ..పోటీ హోరాహోరీగా ఉందని..గెలిచే అవకాశం లేకపోలేదని చెప్పారు. అయితే ఆ రౌండ్ తర్వాత నుంచి ఎక్కడా టీఆర్ఎస్‌ అభ్యర్ధికి పోటీ ఇవ్వలేకపోయింది బీజేపీ . అర్బన్, మున్సిపాలిటీ, రూరల్‌ ఓట్లు ఉన్న ప్రాంతాల్లో కూడా టీఆర్ఎస్‌ దూసుకుపోయింది. చివరగా 14వ రౌండ్ ముగిసే సరికి ప్రభాకర్‌రెడ్డి 10,094ఓట్ల ఆధిక్యంలో నిలిచారు.

చివరి 15రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ అభ్యర్ధి 11,666ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్ధి రాజగోపాల్‌రెడ్డిపై విజయం సాధించారు.

సంబురాల్లో గులాబీ శ్రేణులు..

మునుగోడులో టీఆర్ఎస్‌ విజయంతో గులాబీ శ్రేణులు సంబురాలు జరుపుకున్నారు. హైదరాబాద్ టీఆర్ఎస్‌ భవన్‌తో పాటు ప్రతి జిల్లాల్లో బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకున్నారు టీఆర్ఎస్‌ నాయకులు, కార్యకర్తలు. మరోవైపు బీజేపీని ఓటమితో సంతోషం వ్యక్తం చేస్తూ డ్యాన్సులు చేశారు.

మునుగోడు ఉపఎన్నికను తన భుజస్కందాలపై వేసుకున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ . టీఆర్ఎస్‌ అభ్యర్ది ప్రభాకర్‌రెడ్డి తరపున కేటీఆర్‌ విస్తృతస్థాయిలో ప్రచారం చేశారు. టీఆర్‌ఎస్‌ని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. వీటితో పాటు మునుగోడులో కాస్తో, కూస్తో ఓటు బ్యాంకు ఉన్న వామపక్షాలు గులాబీతో చేతులు కలపడంతో బాగా ప్లస్ పాయింట్‌గా మారాయి. టీఆర్ఎస్‌ అభ్యర్ధి విజయానికి దోహదపడ్డాయి.

మునుగోడులో నవంబరు 3న పోలింగ్ జరిగింది. మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,25,192 మంది ఓటు వేశారు.  ఇందులో 2,25,192 మంది ఓటు వేశారు. వీరిలో 1,13,853 పురుషులు, 1,11,338, మంది స్త్రీలు ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలుపుకొని 93.41 శాతం నమోదైంది. తెలంగాణలో ఏ ఎన్నికల్లోనూ ఇంత పోలింగ్ నమోదు కాలేదు. ఆ స్థాయిలో మునుగోడు ఓటర్లు పోటెత్తారు.

చౌటుప్పల్‌లో 59,433 ఓట్లు ఉండగా 55,678 ఓట్లు, సంస్థాన్ నారాయణపురంలో 36,430 ఓట్లు ఉండగా 34,157 ఓట్లు, మునుగోడు 35,780 ఓట్లు ఉండగా 33,455 ఓట్లు, చండూరులో 33,509 ఓట్లు ఉండగా 31,333 ఓట్లు, గట్టుప్పల్‌లో 14,525 ఓట్లు ఉండగా 13,452 ఓట్లు, మర్రిగూడలో 28,309 ఓట్లు ఉండగా 25,877 ఓట్లు, నాంపల్లి‌లో 33,819 ఓట్లు ఉండగా 31,240 ఓట్లు పోలయ్యాయి.

పోలింగ్ ప్రక్రియలో భాగంగా చౌటుప్పల్ మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 1, 2, 3, 4 రౌండ్లు, సంస్థాన్ నారాయణపురం  ఓట్ల కౌంటింగ్ 4, 5, 6 రౌండ్లలో చేస్తారు. ఇక మునుగోడు  ఓట్ల కౌంటింగ్ 6, 7, 8 రౌండ్లు, చండూరు మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 8, 9, 10 రౌండ్లు, గట్టుప్పల్ మండలం ఓట్ల కౌంటింగ్ 10, 11 రౌండ్లలో నిర్వహిస్తారు.  మర్రిగూడ మండలం ఓట్ల కౌంటింగ్ 11, 12, 13 రౌండ్లు, నాంపల్లి మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 13, 14, 15 రౌండ్లలో జరుగుతుంది.

మునుగోడులో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఐతే ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్యే నెలకొంది. నువ్వా నేనా అన్నట్లుగా ఫలితాలు వస్తున్నాయి.

First published:

Tags: Munugodu By Election, Telangana News

ఉత్తమ కథలు