హోమ్ /వార్తలు /తెలంగాణ /

BJP vs Trs : మీటర్‌పై కామెంట్‌తో కోమటిరెడ్డి మ్యాటర్ పేలిపోతుందా ..? లేక తేలిపోతుందా..?

BJP vs Trs : మీటర్‌పై కామెంట్‌తో కోమటిరెడ్డి మ్యాటర్ పేలిపోతుందా ..? లేక తేలిపోతుందా..?

KCR, RAJGOPALREDDY(FILE)

KCR, RAJGOPALREDDY(FILE)

BJP vs TRS: బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. మునుగోడు ఓటర్లతో పాటు రైతులు సైతం ఇదేంటి ఈవిధంగా మాట్లాడారంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఇక అధికార పార్టీ టీఆర్ఎస్‌ నేతలు కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి బైపోల్‌లో లబ్ధి పొందాలని చూస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

రాజకీయాల్లో ఉండే వారు ఆచితూచి వ్యవహరించాలి. ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఎన్నికల్లో పోటీ చేసే వ్యక్తులు ఈవిషయంలో ఇంకాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. మునుగోడు ఉపఎన్నిక తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన వేళ మాజీ ఎమ్మెల్యే ...బీజేపీ(BJP) నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komatireddy Rajagopal Reddy)చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. మునుగోడు (Munugodu)ఓటర్లతో పాటు రైతులు సైతం ఇదేంటి ఈవిధంగా మాట్లాడారంటూ చెవులు కొరుక్కుంటున్నారు. ఇక అధికార పార్టీ టీఆర్ఎస్‌(TRS)నేతలు కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి బైపోల్‌లో లబ్ధి పొందాలని చూస్తోంది. అల్టిమేట్‌గా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నరాజగోపాల్‌రెడ్డి తన వ్యాఖ్యలతో మాజీగానే కొనసాగుతారా లేక ఆ కామెంట్స్ బై పోల్ ఫలితాలపై ప్రభావం చూపకుండా కాషాయం జెండా ఎగురవేస్తారా అనే చర్చ జోరుగా సాగుతోంది.

Telangana : అక్కడ కాపురాలు కూల్చుకునే దంపతుల సంఖ్యే ఎక్కువ .. ఎందుకో ..? ఎక్కడో తెలుసా..?

రాజగోపాల్‌రెడ్డి గెలిచేనా..?

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ..నల్గొండ జిల్లా ప్రజలకు సుపరిచితమైన పేరు. గతంలో హస్తం గుర్తుపై ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచిన ఈ సీనియర్ లీడర్ కాంగ్రెస్‌తో దోస్తీ కట్ చేసుకొని బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఆయన రాజీనామాతోనే మునుగోడులో ఉపఎన్నిక అనివార్యమైంది. బీజేపీలో చేరిన రాజగోపాల్‌రెడ్డి..మరోసారి మునగోడు నుంచి కమలం గుర్తుతో బరిలోకి దిగుతున్నారు. స్వలాభం కోసమే ఆయన బీజేపీలో చేరినట్లుగా కాంగ్రెస్ , ఇటు టీఆర్ఎస్‌ ప్రచారం చేస్తున్నాయి. మరోవైపు తెలంగాణలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ వ్యవసాయ మోటర్ల దగ్గర మీటర్లు పెట్టమంటోందని ఇలాంటి పార్టీలను నమ్మవద్దంటూ టీఆర్ఎస్‌ విస్తృతస్ధాయిలో ప్రచారం చేస్తోంది. అదే నినాదంతో మునుగోడులో ఓట్లు అఢుగుతోంది.

ఆ కామెంట్‌తోనే అసలు రచ్చ ..

ఇలాంటి పరిస్థితుల్లో రాజగోపాల్‌రెడ్డి వ్యవసాయ విద్యుత్‌ మోటర్లపై మీటర్లు పెట్టే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ మాటల్ని టీఆర్ఎస్‌ తమకు అనుకూలంగా మలుచుకుంది. ఇందులో భాగంగానే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించే విషయంలో టీఆర్ఎస్‌ ప్రభుత్వం అనవసరమైన రాద్ధాంతం చేస్తోందని కామెంట్ చేశారు రాజగోపాల్‌రెడ్డి. అంతే కాదు కేంద్రంలోని బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం సంస్కరణలతో డిస్కమ్‌లతో సహా విద్యుత్ రంగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటోందన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే తప్పేంటన్నట్లుగా వ్యవహరించారు రాజగోపాల్‌రెడ్డి. ఏ రైతు ఎంత విద్యుత్ వినియోగించుకుంటున్నారో తెలుసుకునేందుకే కేంద్రం మీటర్‌ పెట్టమంటోందని ఇందులో రాష్ట్రాలను అధికారిక ఒత్తిడి ఏమి లేదన్నారు.

రివర్స్ అటాక్..

మునుగోడులో జరిగేది ధర్మయుద్ధంగా ప్రకటించిన రాజగోపాల్‌రెడ్డి ..కేవలం తన కాంట్రాక్టులు, బీజేపీ ఇచ్చే తాయిలాల కోసమే పార్టీ మారినట్లుగా కాంగ్రెస్, టీఆర్ఎస్‌ నేతలు చెబుతూ వచ్చారు. ఇందులో భాగంగానే విపక్షాల మాటలకు బలం చేకూరేలా వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెడితే తప్పేంటన్న చందంగా మాట్లాడటంపై మునుగోడు ఓటర్లతో పాటు రైతులు ఆలోచనలో పడ్డట్లుగా తెలుస్తోంది. దీనికి తోడుగా టీఆర్ఎస్‌ సైతం ఆయన మాటలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లి రాజగోపాల్‌ ఓటమిని చూడాలని ప్లాన్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఓటరు మహాశయులు ఏం తీర్పిస్తారో చూడాలి.

Published by:Siva Nanduri
First published:

Tags: CM KCR, Komatireddy rajagopal reddy, Munugode Bypoll, Telangana Politics

ఉత్తమ కథలు