అది నల్గొండ (Nalgonda) మిర్యాలగూడ (Miryalaguda) ప్రాంతం. ఓ సమాధి దగ్గరికి పోలీసులు, కుటుంబ సభ్యులు, ఇతర అధికారులు వచ్చారు. 45 రోజుల కిందట సమాధి చేసిన మృతదేహాన్ని (Dead body)బయటికి తీశారు. అక్కడ చూస్తున్న వారికి ఏం అర్థం కాలేదు. డెడ్‌బాడీని బయటికి తీయడం ఏంటని అందరూ వింతగా చూశారు. అసలేం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఆ డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. అసలేమైంది? తహశీల్దార్ అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 19న పట్టణంలోని బాపూజీనగర్ కి చెందిన గోన ప్రవళిక కుటుంబ సభ్యులతో కలిసి శ్రీశైలం వెళ్ళింది. అలసటగా ఉందని దైవ దర్శనం చేసుకోకుండా రూంలోనే ఉంది. మరుసటి రోజు కుటుంబ సభ్యులంతా చందంపేట మండలం వెలమగూడెంలోని మేనమామ ఇంటికి వెళ్లగా గుండె నొప్పి వస్తుందన్న ప్రవళికను దేవరకొండ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతిచెందిందని వైద్యులు చెప్పగా మిర్యాలగూడలోని బాపూజీ నగర్ స్మశానవాటికలో ప్రవళిక మృతదేహాన్ని పూడ్చిపెట్టారు.
నగదు చెల్లింపులు, చాటింగ్ వివరాలు చూసి..
అయితే, దహన సంస్కారాల అనంతరం ప్రవళిక మొబైల్ ఫోన్ ను సోదరి అఖిల చూడగా పందిరి మహేష్ అనే యువకుడికి చేసిన నగదు చెల్లింపులు వెలుగు చూశాయి. బీటెక్ చదివి మిర్యాలగూడలో జాబ్ చేస్తున్న ప్రవళికను మహేష్ వెంటపడగా కుటుంబ సభ్యులు మందలించారు. దీంతో వెంటపడడం మానేశాడని భావించిన తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా నగదు చెల్లింపులు, చాటింగ్ వివరాలు చూసి అతడి వేధింపుల వల్లనే తమ కూతురు మరణించిందంటూ చందంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తండ్రి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు శుక్రవారం చందంపేట ఎస్సె యాదయ్య, ప్రభుత్వ డాక్టర్ బాలాజీ నాయక్ ల సమక్షంలో రెవెన్యూ అధికారులు శ్యామ్, కుమార్ ల సమక్షంలో మున్సిపల్ సిబ్బంది యువతి మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్ మార్టం (Postmortem) చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Miryalaguda, Nalgonda, Suryapet