హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugode: ఏ పార్టీ డబ్బులిచ్చినా తీసుకోండి .. మందు పోసినా తాగండి .. ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయండి : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

Munugode: ఏ పార్టీ డబ్బులిచ్చినా తీసుకోండి .. మందు పోసినా తాగండి .. ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయండి : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

(Photo Credit:Twitter)

(Photo Credit:Twitter)

TS Congress | Munugodu: మునుగోడు నియోజకవర్గంలో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యాచరణను మొదలుపెట్టారు. అభ్యర్ధిగా ఎవర్ని నిలబెట్టాలనే విషయంపై ఇంకా క్లారిటీకి రాని హస్తం నేతలు ..బీజేపీని గెలిపిస్తే మత కల్లోలాలు పెరుగుతాయని ప్రచారం చేస్తున్నారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్‌కి ఓటు వేయడం వృధా అని చెబుతున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda, India

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి (Komatireddy rajgopalreddy)రాజీనామాతో చేజారిపోతున్న మునుగోడు(Munugodu)నియోజకవర్గంలో గెలిచేందుకు కాంగ్రెస్(Congress) పార్టీ నేతలు కార్యాచరణను మొదలుపెట్టారు. అభ్యర్ధిగా ఎవర్ని నిలబెట్టాలనే విషయంపై ఇంకా క్లారిటీకి రాని హస్తం నేతలు ..బీజేపీ(BJP)ని గెలిపిస్తే మత కల్లోలాలు పెరుగుతాయని ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేని టీఆర్ఎస్‌(TRS)కు ఓటేస్తే మునుగోడు ప్రజలు మోసపోక తప్పదన్నారు. ఏపార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకొని ఓటు మాత్రం హస్తం గుర్తుకే వేయాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్‌ సీనియర్ నేతలు. మునుగోడు బైపోల్ నేపధ్యంలో చార్జ్ షీట్‌(Charge sheet)ని విడుదల చేసి ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమాన్ని షురూ చేశారు.

Telangana : మావోయిస్టుల కంచుకోటలో పోలీసుల అలజడి .. అణువణువు తనిఖీలు చేస్తోంది ఎందుకంటే ..?


ఛార్జ్ షీట్ విడుదల ..

మునుగోడు ఉపఎన్నిక గెలుపును కాంగ్రెస్‌ పార్టీ నేతలు అత్యంత ప్రతిష్టత్మకంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఏఐసీసీ సైతం ఇక్కడి రాజకీయ పరిణామాలను గమనిస్తూ ఉండటంతో బేషజాలు, బేధాభిప్రాయాలు పక్కనపెట్టి మరీ ప్రచారరంగంలోకి దిగారు. ఇప్పటి వరకు కలిసి రాని నేతలంతా శనివారం మునుగోడులో వాలిపోయారు. టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో పాటు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత జానారెడ్డి టీఆర్ఎస్‌, బీజేపీ వైఫల్యాలకు సంబంధించిన ఛార్జ్‌షీట్‌ను విడుదల చేశారు. ఇంత మంది కలిసి వచ్చినప్పటికి ఈ పార్టీ స్టార్ క్యాంపెయినర్, జిల్లాలో మంచి పట్టున్న నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం డుమ్మా కొట్టడం విశేషంగా చూడాలి. తమ్ముడి ఓటమి కోసం పని చేయడం ఇష్టం లేకనే ఆయన శనివారం జరిగిన కార్యక్రమానికి దూరంగా ఉన్నారనే టాక్‌ కూడా వినిపిస్తోంది.

మత కల్లోలాలు తప్పవు..

మునుగోడులో కాంగ్రెస్‌ విజయం తెలంగాణకే మేలు చేసే అంశంగా ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు నేతలు. ముఖ్యంగా మాజీ టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మునుగోడులో బీజేపీ అడుగుపెడితే మత కల్లోలాలను సృష్టిస్తుందన్నారు. బీజేపీ ప్రయత్నాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజలపై ఉందని చెప్పారు. కొన్ని రోజుల క్రితం బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయన్నారు ఉత్తమ్. అంతే కాదు ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకొని మందు పోయించినా తాగి ఓటు మాత్రం కాంగ్రెస్‌కే వేయాలని పిలుపునిచ్చారు.

కేసీఆర్ వాగ్ధానం ఏమైంది ..?

మునుగోడులో కాంగ్రెస్‌ని గెలిపించుకోవడానికి ఇదే సరైన సమయం అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. దేశానికి, తెలంగాణకు ఎంతో చేసిన కాంగ్రెస్‌ని ప్రజలు మర్చిపోవద్దని .. 20, 40 ఏళ్ల క్రితం పుట్టిన తోక పార్టీలైన బీజేపీ, టీఆర్ఎస్‌ నాయకుల మాటలను నమ్మవద్దన్నారు. మతం పేరుతో బీజేపీ, టీఆర్ఎస్‌ వైషమ్యాలు రెచ్చగొడుతున్నాయని తప్పుబట్టారు. రజాకార్లపై పోరాటం చేసినప్పుడు బీజేపీ ఎక్కడుందని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్. ఆ రెండు పార్టీలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు.

Telangana: తెలంగాణ విమోచన వేడుకలు.. మూడు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం లేఖవిమోచన దినోత్సవం నిర్వహించరా ..?

ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. రాజగోపాల్‌రెడ్డి కుటుంబానికి కాంగ్రెస్‌ పార్టీ ఎంతో చేస్తే ఆయన బీజేపీకి అమ్ముడుపోయి మునుగోడు ప్రజల తీర్పును అవమానపరిచారని విమర్శించారు. అలాంటి వాళ్లకు సరైన బుద్ధి చెప్పాలని మునుగోడు ప్రజల్ని కోరారు. ప్రాజెక్టులన్ని పెండింగ్‌లో పెట్టిన టీఆర్ఎస్‌ పార్టీకి అప్పు పుట్టే పరిస్థితి లేదన్నారు. జానారెడ్డి. కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకొని మునుగోడు ప్రజలు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి రెండు పార్టీలకు బుద్ది చెప్పాలని జానారెడ్డి కోరారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Munugode Bypoll, Telangana Politics, TS Congress

ఉత్తమ కథలు