హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugodu: మునుగోడు సభలో రైతులకు సీఎం కేసీఆర్​ శుభవార్త.. పూర్తి వివరాలివే..

Munugodu: మునుగోడు సభలో రైతులకు సీఎం కేసీఆర్​ శుభవార్త.. పూర్తి వివరాలివే..

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

మునుగోడులో టీఆర్ఎస్ ప్రజాదీవెన సభ వేదికగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. కేంద్రం మునుగోడుకు నీళ్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఓటేసేముందు ఆలోచించాలని అన్నారు కేసీఆర్​.

 • News18 Telugu
 • Last Updated :
 • Nalgonda, India

  ఏ ప్రభుత్వం కూడా గతంలో మునుగోడు (Munugodu) ప్రజల ఫ్లోరైడ్ కష్టాలను తీర్చలేదని తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) తెలిపారు. మునుగోడు నియోజకవర్గం గతంలో ఫ్లోరైడ్‌తో ఎంత బాధపడిందో అందరం చూశామని అన్నారు. నల్గొండ జిల్లాలో కృష్ణా నది పారుతున్నా.. ప్రజలకు తాగునీళ్లు అందలేదని అన్నారు. ఇప్పుడు మిషన్ భగీరథ జలాల ద్వారా జీరో ఫ్లోర్లైడ్ జిల్లాగా మార్చామని చెప్పారు. మునుగోడులో (Munugodu) టీఆర్ఎస్ ప్రజాదీవెన సభలో కేసీఆర్ పాల్గొన్నారు. సభా వేదికపై పార్టీ జెండాను సీఎం ఆవిష్కరించారు. వేదికపై అమరుల స్తూపానికి సీఎం నివాళులు అర్పించారు. అనంతరం ప్రజా దీవెన సభలో మునుగోడు ప్రజలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా నో మ్యాన్ జోన్‌గా మారే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించిందని గుర్తు చేసిందన్నారు. డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించినప్పటికీ అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదని అన్నారు. ఫ్లోరైడ్ బాధితుడుని ఢిల్లీ తీసుకెళ్లి చూపించినా ఎవరూ కూడా మన మొర తీర్చలేదని చెప్పారు.

  రైతుల బతుకులు బాగుండాలంటే..

  కమ్యూనిస్టులతో మాట్లాడానని.. తెలంగాణలోనే (Telangana) కాదు దేశవ్యాప్తంగా ప్రగతిశీల శక్తులు ఏకం కావాలనే అభిప్రాయాలు పంచుకున్నామన్నారు సీఎం. కమ్యూనిస్టులు కలిసి రావాలి.. వారు టిఆర్ఎస్ కి మద్దతు ఇస్తామన్నారని తెలిపారు. రైతుల బతుకులు బాగుండాలంటే కమ్యూనిస్టులు కలిసి రావాలన్నారు సీఎం. బిడ్డా అమిత్ షా.. నువ్వు ఎందుకు మునుగోడుకి వస్తున్నావు, ఏం ఉద్ధరించేందుకు వస్తున్నావు అంటూ కేసీఆర్​ ప్రశ్నించారు.

  మీటర్లు పెట్టం..

  అయితే మునుగోడు సభలో రైతులకు (farmers) సీఎం కేసీఆర్​ శుభవార్త చెప్పారు. కేసీఆర్ (KCR)​ బతికున్నంత వరకు రైతుల పొలాల్లో మీటర్లు (No meters) పెట్టడని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు. ఒక వేళ బీజేపీకి ఓటేస్తే  వాళ్లు వచ్చి మీటర్లు పెడుతారని ఆరోపించారు. కాంగ్రెస్​కు ఓటేస్తే వ్యర్థమేనని కేసీఆర్​ అన్నారు. మోదీకి చెందిన బడాబాబులు సూట్ కేసులతో రెడీగా ఉన్నారని.. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం. నేను చెప్పే మాట నిజమా ,కాదా ఆలోచించుకోవాలన్నారు. రైతుబంధు, రైతు బీమా ఎంతమందికి వస్తుందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. గతంలో రైతులు చనిపోతే కుటుంబం రోడ్డున పడేదని.. ఇప్పుడు రైతు చనిపోతే 10 రోజులలోపు 5 లక్షలు ఇస్తున్నామన్నారు. ఇలాంటి పథకం ఎక్కడా లేదన్నారు సీఎం కేసీఆర్. మునుగోడు లో జరిగేది ఉప ఎన్నిక కాదు.. మన బతుకుకి సంబంధించినది అన్నారు.

  మోసపోతే గోసపడుతామని మునుగోడు ప్రజలకు సీఎం సూచించారు. ఉన్న కరెంట్​, ఫించన్లు, రైతు బంధు ఊడగొట్టుకుందామా అని కేసీఆర్​ ప్రశ్నించారు. ఆఖరికి శ్మశానం మీద కూడా జీఎస్టీ వసూలు చేస్తున్నారని కేంద్రంపై సీఎం మండిపడ్డారు. ఆ డబ్బులన్నీ బ్యాంకులను మోసం చేసే వాళ్లకు పంచి పెడుతున్నారని ఆరోపించారు. మళ్లీ గ్యాస్​ సిలిండర్​ తక్కువ ధరకు రావాలంటే టీఆర్​ఎస్​కు (TRS) ఓటు పడాలని కేసీఆర్​ సూచించారు. ఈ ఎన్నిక ఓ వ్యక్తి కోసమో ఓ పార్టీ కోసమో జరిగేది కాదని సీఎం అన్నారు.

  కేంద్రాన్ని రాజగోపాల్​ అడగడట..

  ‘‘పంద్రాగస్టును ప్రధాని మాట్లాడితే మైకులు పగిలిపోయాయి. నీళ్ల వాటా తేలిస్తే చకచకా నీళ్లు తెచ్చుకుంటాం. తేలిన చోట గోదావరి నుంచి తెచ్చుకున్నాం. తుంగతుర్తి, కోదాడల్లో గోదావరి నీళ్లు పారి లక్షల టన్నుల దిగుబడి వస్తోంది. బసవాపురం ప్రాజెక్టు పూర్తయింది. ఆలేరు, భువనగిరి, రామన్నపేటలకు కూడా వర్షాకాలం తర్వాత నీళ్లు వస్తాయి. ఇక్కడ కూడా రావాలని పనులు మొదలుపెడితే.. ఎందుకు అడ్డంకులు పెడుతున్నారు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడే రాజగోపాల్ రెడ్డినో, కేంద్ర మంత్రో, ఇంకో పెద్ద మనిషో ఢిల్లీకి పోయి మా కృష్ణా జలాలా వాటా ఏంటి? మా శివన్నగూడెం ప్రాజెక్టు ఎప్పుడు నింపుకోవాలి? అని అడగరట. అని సీఎం. ఆగ్రహం వ్యక్తం చేశారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Farmer, Munugodu By Election, Trs

  ఉత్తమ కథలు