(Nagaraju,News18, Nalgonda)
Wonderkid: ఆ పిల్లాడి వయస్సు ఆరేళ్లే.. కానీ అనర్గళంగా దేశ విదేశాల రాజధానులు(Country Capitals), జెండాలు(Flags), అబ్రివేషన్స్ (Abbrevations)..ఆవిష్కర్తల పేర్లు..ఇలా ఎన్నో రకాల టాలెంట్‌లతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు.సూర్యాపేట జిల్లా మంఠపల్లి మండలం పెదవీడు గ్రామానికి చెందిన గాదె తిరుమల రెడ్డి చంద్రిక దంపతులఆరేళ్ల కొడుకు చేతన్ రెడ్డి. ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమంలో ఒకటో తరగతిచదువుతున్నాడు. ఆరేళ్ల చిన్నారి ప్రపంచ పటంలోని 80 దేశాల రాజధానులు.. జెండాలను గుర్తించడంతో పాటు గూగుల్, ఎస్‌సీఈఆర్‌టీ(SCERT), ఎఫ్ఎస్ఎస్ఏటీ(FSSAT) తదితర క్లిష్టమైన 100కు పైగా సంక్షిప్త నామాలకు పూర్తి పదాలు ఇట్టే చెప్పేస్తూ అబ్బుర పరుస్తున్నాడు.100 వరకు ఆవిష్కరణలు.. వాటి ఆవిష్కర్తల పేర్లు అడిగినా క్షణాల్లోనే సమాధానమిస్తూ ఔరా అనిపిస్తున్నాడు.
సూపర్ కిడ్..వాటే నాలెడ్జ్ ..
కేంద్రపాలిత ప్రాంతాలు రాష్ట్రాలు రాజధానులు.. జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు, రాష్ట్ర దేశ చిహ్నలు.. భూవి ఆవరణలు అనర్గళంగా చెప్పడం మేధావులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
మ్యాథ్స్‌లోనూ తగ్గేదేలే..
ఆంగ్ల గణిత వైజ్ఙానిక అంశాలలో అపార జ్ఞానాన్ని అందిపుచ్చుకున్న ఈ చిన్నారి ద్విమితీయ త్రిమితీయ ఆకారాలు(2D3D), ఖండాలు, వాటి మహాసముద్రాలను పేర్కొవడం( ఆసియా ఆఫ్రికా నార్త్ సౌత్ అమెరికాలు యూరోప్ ఖండాలు) పజిల్స్ 2 నిమిషాల్లో పూర్తి చేయడం విశేషం. అంతేకాదు టేబుల్స్, వాటి స్వేర్ వాల్యూస్(square Values) కూడా చెబుతున్నాడు.
తల్లే గురువు..!
ఎంటెక్ పూర్తిచేసిన తల్లిదండ్రులు: చిన్నారి తండ్రి తిరుమలరెడ్డి పాలకవీడు మండలం మహంకాళి గూడెంలోని డెక్కన్ సిమెంట్స్ పరిశ్రమలో ఏఈగా .. తల్లి చంద్రిక కోదాడలోనిమిట్స్ కళశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నారు. డీసిఎల్ డెక్కన్ సిమెంట్స్ పాఠశాలలో చదువుకుంటున్న చేతన్ రెడ్డి జ్ఞాపక శక్తి చురుకుదనాన్ని గుర్తించిన అక్కడి ఉపాధ్యాయులు… తల్లిదండ్రులను యూకేజీలో ఉండగానే విజ్ఞానదాయక అంశాలలో సాధన చేయించాలని సూచించారు. విద్యావంతురాలైన తల్లి కోవిడ్ సమయంలో జీకే ఇతర అంశాలపై చేతన్కు తర్పీదు ఇచ్చారు.
తెలుగు సంస్కృతిని నేర్పేపనిలో..!
వివిధ శ్లోకాలు, వేదాలు, ఇతిహసాలు, షడ్రుచులు , తెలుగు నెలలు, 100 మంది కౌరవులు పేర్లు చెప్పగలిగే విధంగా చేయించాలన్నదే ఆశయమని తల్లిచంద్రిక తెలిపారు. భర్త తిరుమలరెడ్డి సహకారంతో అంతర్జాతీయ సమాచారాన్ని సేకరించి శిక్షణ ఇస్తున్నట్లు ఆమె వెల్లడించారు. భవిష్యత్‌లో తనకు కలెక్టర్(IAS) కావాలని ఉందని చెబుతున్నాడు ఈ చిచ్చరపిడుగు. పువ్వు పట్టుగానే పరిళమిస్తుందనడానికి చేతన్ లాంటి సూపర్ కిడ్సే ఎగ్జామ్‌పుల్‌గా చెప్పుకోవచ్చంటున్నారు ఈ పిల్లాడి నాలెడ్జ్ చూసినవాళ్లంతా. ఆరేళ్లకే ఇంతటి మెమరీ పవర్‌తో దూసుకెళ్తున్న చేతన్..ఫ్యూచర్‌లో అతను అనుకున్నట్లుగా కలెక్టర్ అవ్వాలని ఆశిద్దాం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.