హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalgonda: ఆగి ఉన్న లారీ ఢీకొని యువకుడు మృతి!..

Nalgonda: ఆగి ఉన్న లారీ ఢీకొని యువకుడు మృతి!..

a man died due to accident on the highway cause of he hit lorry

a man died due to accident on the highway cause of he hit lorry

హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా రవాణా చేస్తున్న నిషేధిత గుట్కా సంచులను కోదాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్ధిక సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన తిప్పర్తి మండలం తాన్ దార్ పల్లిలో బుధవారం చోటుచేసుకుంది.

  (Nagaraju,News18, Nalgonda)

  ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో గంజాయి, గుట్కా అక్రమ రవాణా జోరుగా కొనసాగుతుంది. పోలీసులు పటిష్ట నిఘా ఉంచినా..కేటుగాళ్లు అక్రమంగా గంజాయి, గుట్కా రవాణా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ కు అక్రమంగా రవాణా చేస్తున్న నిషేధిత గుట్కా సంచులను కోదాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళుతున్న కె.వి.ఆర్ ట్రావెల్ బస్సులో నిషేధిత గుట్కా తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో రామాపురం క్రాస్ రోడ్డు వద్ద కోదాడ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ట్రావెల్స్ బస్సులో 9 సంచుల నిషేదిత గుట్కాను గుర్తించిన పోలీసులు బస్సు డ్రైవర్ నాగరాజు, హెల్పర్ జ్ఞానేశ్వర్ లను అదుపులోకి తీసుకున్నారు. మచిలీపట్నం పట్టణానికి చెందిన గున్ బాడ శ్రీరామ్  గుట్కా సంచులను తరలించేందుకు బస్సు డ్రైవర్ తో ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నాడని, తనిఖీల సమయంలో బస్సులోనే ఉన్న శ్రీరామ్. పోలీసుల కళ్లుగప్పి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గుట్కా విలువ రూ.3.43 లక్షలు ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సాయి ప్రశాంత్ తెలిపారు.

  ఆర్ధిక సమస్యలతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన తిప్పర్తి మండలం తాన్ దార్ పల్లిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిప్పర్తి మండలం తాన్ దార్ పల్లి గ్రామానికి చెందిన సుంకరబోయిన వెంకన్న వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాడు. దీంతో పాటు డోజర్, హార్వెస్టర్ కొనుగోలు చేసి బాడుగ తిప్పుతున్నాడు. హార్వెస్టర్ కొనుగోలు సమయంలో సుమారు రూ. 20 లక్షల వరకు అప్పులు చేసిన వెంకన్న, అందులో నష్టం రావడంతో అప్పు తీర్చే మార్గం కనిపించలేదు. అదే సమయంలో వ్యవసాయం కలిసి రాలేదు. దీంతో మానసికంగా కృంగిపోయిన వెంకన్న జులై 16న రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంకన్నను నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ వెంకన్న మంగళవారం మృతి చెందాడు. మృతుడి భార్య నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ మట్టయ్య తెలిపారు.

  ఆగి ఉన్న లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా చౌటుప్పల్ పరిధిలో చోటుచేసుకుంది. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై బుధవారం నాడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. చౌటుప్పల్ పోలీసులు తెలిపిన వివరాలు మేరకు గుంటూరు జిల్లా కాకుమన్ గ్రామానికి చెందిన యార్లగడ్డ హేమంత్ హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగం చేస్తూ బీరంగూడాలో నివాసం ఉంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి స్వగ్రామం కాకుమాన్‌కు బైక్ పై బయలుదేరారు. ఇదే సమయంలో కర్ణాటక నుంచి ఖమ్మంకు టమాటాల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనం లకారం చేరుకోగానే మరమ్మతుకు గురై ఆగిపోయింది. తెల్లవారు జామున కావడం... రోడ్డుపై ఎలాంటి సిగ్నల్స్ కనిపించకపోవడంతో వేగంగా బైక్ పై వస్తున్న హేమంత్,  డీసీఎంను వెనక నుంచి ఢీ కొట్టాడు. ఈ ఘటనలో హేమంత్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు, పోలీసులు స్పందించి బాధితుడిని హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సీతాపాండు తెలిపారు.

  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Crime news, Local News, Nalgonda, Telangana

  ఉత్తమ కథలు