Home /News /telangana /

NALGONDA SON CREATES FAKE DOCUMENTS CLAIMING DEATH OF MOTHER IN NALGONDA DISTRICT FOR RYTHU BHIMA MONEY SNR

Telangana | Rythu Bima : ఆ డబ్బు కోసం కక్కూర్తి పడిన కొడుకు .. తల్లి పేరుతోనే ప్రభుత్వానికి టోకరా

(RYTHU BIMA SCAM)

(RYTHU BIMA SCAM)

Rythu Bhima scam: ఏ కొడుకు తల్లి చావు కోరుకోడు. కాని అతను మాత్రం కేవలం డబ్బు కోసం బ్రతికున్న తల్లి లేదని ప్రభుత్వాన్ని మోసం చేశాడు. నవమాసాలు మోసి కనిపించిన తల్లికి చనిపోయిందని నమ్మించి ..అందుకు వచ్చిన ప్రతిఫలంతో ఎంజాయ్ చేశాడు. చేసిన నేరానికి ఊరు వదిలి పారిపోయాడు.

ఇంకా చదవండి ...
ఏ కొడుకు తల్లి చావు కోరుకోడు. కాని అతను మాత్రం కేవలం డబ్బు కోసం బ్రతికున్న తల్లి లేదని ప్రభుత్వాన్ని మోసం చేశాడు. నవమాసాలు మోసి కనిపించిన తల్లికి చనిపోయిందని నమ్మించి ..అందుకు వచ్చిన ప్రతిఫలంతో ఎంజాయ్ చేశాడు. విషయం ఆ మాతృమూర్తికి తెలియడంతో ఆశ్చర్యపోయింది. తన బిడ్డేనా ఇంతటి నీచానికి ఒడిగట్టిందని బాధపడింది. కొడుకు పరువు తీయాలనే ఉద్దేశంతో కాకుండా తాను బ్రతికే ఉన్నానని నిరూపించుకునేందుకు చేసిన ప్రయత్నంలో ఆ కొడుకు బండారం బయటపడింది. నల్గొండ(Nalgonda)జిల్లాలో రైతుబీమా(Rythu Bhima)డబ్బుల కోసం ప్రభుత్వాన్ని(Government), కన్నతల్లిని మోసం చేశాడో వ్యక్తి.

Peddapalli: రిపోర్టర్లమంటూ ట్రాలీ డ్రైవర్‌ను దారి దోపిడీ చేసిన దుండగులు!..



ప్రభుత్వానికే తప్పుడు రిపోర్ట్ ..
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన కో లింగమ్మకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. పెద్ద కొడుకు అదే గ్రామంలో టిఫెన్‌ సెంటర్ నడుపుతుండగా అతని దగ్గరే ఉంటోంది తల్లి. లింగమ్మ పేరుతో లక్ష్మీదేవిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని చలిచీమలపాలెం శివారులో తొమ్మిది గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమికి ప్రభుత్వం ఏదాడి రైతుబంధు పథకం కింద డబ్బులను బ్యాంకు ఖాతాలో జమ చేస్తోంది. అయితే గత ఏఢాది నుంచి తనకు రైతుబంధు పథకం నిధులు జమ కాకపోవడంతో లింగమ్మ జులై 16వ తేదిన వ్యవసాయశాఖ అధికారిణి రుపేంద్రమణిని కలిసి విషయం చెప్పింది. ఆమె ఆన్‌లైన్‌లో లింగమ్మ పేరు చెక్‌ చేయడంతో అసలు విషయం బయటపడింది.



బ్రతికున్న తల్లి లేదని ..
లింగమ్మ కొడుకు వీరస్వామి కాసుల కక్కూర్తితో బ్రతికున్న తల్లిని చనిపోయినట్లుగా తప్పుడు ధృపత్రాలు సృష్టించాడు. కేవలం తల్లి రైతుబీమా పథకం పేరులో తాను నామినీగా ఉండటంతో తల్లి చనిపోయిందని తెలిస్తే 5లక్షల రూపాయలు వస్తాయని బంధువు , గ్రామ ఉపసర్పంచ్‌ కోల సైదులు సహకారం తీసుకున్నాడు. గతేడాది ఏప్రిల్‌ 6న తన తల్లి లింగమ్మ చనిపోయినట్లుగా నకిలీ కాగితాన్ని సృష్టించాడు. అదేనెల 16న వ్యవసాయాధికారికి రైతుబీమా డబ్బు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. నకిలీ పత్రాన్ని సృష్టించిన నెల రోజుకు అంటే.. 2021 మే6న సూర్యాపేట యూకో బ్యాంకులో ఉన్న వీరస్వామి ఖాతాలో రైతుబీమా తాలుకు సొమ్ము జమైంది. వచ్చిన డబ్బుతో దర్జాలు వెలగబెట్టిన వీరస్వామి ..తాను చేసిన తప్పును తల్లితో చెప్పకుండా దాచిపెట్టాడు.

Hyderabad : బ్యాంక్ ఖాతాలు అద్దెకిస్తూ రూ.కోట్లకు టోకరా.. ఆ యువతి తీరుకు పోలీసులే షాక్..



డబ్బు కోసం కక్కూర్తి ..
ఏడాది నుంచి రైతుబంధు పథకం ద్వారా పడాల్సిన రెండు విడతల నగదు బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడంతో లింగమ్మ పీఎం కిసాన్‌ నిధులు కూడా అందకపోవడంతో లింగమ్మ 15 రోజుల క్రితం జూలై 16న వ్యవసాయాధికారి రుషేంద్రమణిని కలిసి విషయం చెప్పడంతో నిజం బయటపడింది. కన్న కొడుకే ఐదు లక్షల కోసం తల్లి చనిపోయినట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వానికి ఇవ్వడం కారణంగా ఆన్‌లైన్‌లో లింగమ్మ మృతిచెందినట్లు రికార్డై ఉంది. అంతే కాదు రైతుబీమా డబ్బులు నామినీగా ఉన్న కొడుకు వీరాస్వామి పొందినట్లు అందులో ఉంది. గ్రామ కార్యదర్శి నిర్మిత మరణ ధ్రువీకరణ పత్రం జారీచేసినట్లుగా ఉంది.

ఏడాది తర్వాత బయటపడ్డ మోసం..
లింగమ్మ సదరు అధికారిణిని ప్రశ్నించగా తాను లింగమ్మ పేరున ఎలాంటి పత్రాలను జారీచేయలేదని ఆమె స్పష్టం చేశారు. దీంతో జూలై 28న పోలీస్‌ స్టేషన్‌లో ఏవో రుషేంద్రమణి ఫిర్యాదు చేశారు. నకిలీ ధ్రువపత్రాలు దాఖలుచేసి బీమా సొమ్ము వాడుకున్న వీరస్వామితోపాటు అతడికి సహకరించిన సైదులుపై కేసు నమోదు చేశారు పోలీసులు. విషయం బయటపడటంతో కొడుకు వీరాస్వామి, ఉపసర్పంచ్ సైదులు పరార్ అయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు పోలీసులు.
Published by:Siva Nanduri
First published:

Tags: Rythu bima, Rythubandhu, Telangana News

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు