హోమ్ /వార్తలు /తెలంగాణ /

Road Accident: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం..అక్కడికక్కడే ముగ్గురు యువకులు మృతి

Road Accident: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం..అక్కడికక్కడే ముగ్గురు యువకులు మృతి

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం

రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అతి వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్, నిద్రమత్తు వంటి కారణాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఈ ప్రమాదంలో నిండు ప్రాణాలు బలవుతున్నాయి. బాధిత కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. ప్రమాదం ఒకటే అయినా అనేక ప్రాణాలనుబలి తీసుకుంటున్నాయి. ఇక తాజాగా నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda | Telangana

రెండు తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. అతి వేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్, నిద్రమత్తు వంటి కారణాలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. ఈ ప్రమాదంలో నిండు ప్రాణాలు బలవుతున్నాయి. బాధిత కుటుంబాలకు తీరని శోకాన్ని మిగులుస్తున్నాయి. ప్రమాదం ఒకటే అయినా అనేక ప్రాణాలనుబలి తీసుకుంటున్నాయి. ఇక తాజాగా నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

PM Narendra Modi : దక్షిణాదిపై ప్రధాని మోదీ ఫోకస్.. తెలంగాణ నుంచి పోటీ చేస్తారా?

ఈ దుర్ఘటనలో ముగ్గురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా..65వ జాతీయ రహదారి కట్టంగూరు శివారు ఎరసానిగూడెం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ఉండగా..ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా..మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతులను ఎండి ఇద్డాక్, ఎస్.కే సమీర్, ఎస్.కే యాసిస్ గా గుర్తించారు. గాయపడ్డ వారిని కామినేని ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ లో వలీమా ఫంక్షన్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వీరంతా ఖమ్మం జిల్లా భాగ్ ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తుంది.

Cold wave: తెలంగాణపై చలి పంజా.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

వీరంతా ఇన్నోవా కారులో హైదరాబాద్ లో వలీమా ఫంక్షన్ కు ఖమ్మం నుండి బయలుదేరి వెళ్లారు. అక్కడి ఫంక్షన్ కు హాజరై తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు డివైడర్ ను ఢీకొట్టి బోల్తా పడింది. దీనితో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో ముగ్గురు యువకులైన  ఎండి ఇద్డాక్, ఎస్.కే సమీర్, ఎస్.కే యాసిస్ తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ప్రమాదానికి అతివేగం కారణమా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు యువకుల మృతితో వారి కుటుంబాల్లో కొండంత విషాదం నెలకొంది. విగతజీవుల్లా కొడుకులు పడి ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు.

First published:

Tags: Crime, Crime news, Nalgonda, Road accident, Telangana

ఉత్తమ కథలు