(Nagaraju, News 18, Nalgonda)
నల్గొండ (Nalgonda) జిల్లా మునుగోడు మండలంలో గురువారం రాత్రి కాల్పుల ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. మునుగోడు (Munugodu) మండలం సింగారం గ్రామ శివారులో బైక్ పై వెళ్తున్న యువకుడిపై కొందరు దుండగులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు నార్కెట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల స్వామిగా గుర్తించారు. స్వామి మునుగోడులో జనరల్ కిరాణ స్టోర్, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. రోజువారీగా సాయంత్రం సమయంలో దుకాణం కట్టేసి బైక్ పై ఇంటికి వెళ్తుండగా, గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అతనిపై మూడు రౌండ్లు కాల్పులు (Gun firing) జరిపారు. ఈ ఘటనలో స్వామికి గాయాలు అవగా స్థానికులు అతనిని కామినేని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని..పరిస్థితి సమీక్షించారు. ఘటన స్థలంలో ఓ బుల్లెట్ గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Munugodu: మునుగోడు ఉప ఎన్నిక.. టీఆర్ఎస్ మంత్రి హ్యాట్రిక్ కొడతారా ?.. హరీశ్ రావును మరిపిస్తారా ?
బస్సును, టిప్పర్ ఢీకొనటంతో..
బస్సును, టిప్పర్ ఢీకొనటంతో ఐదుగురికి గాయాలైన ఘటన నిడమానూరులో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హలియ నుంచి మిర్యాలగూడ వైపు వెళ్తున్న బస్సు, నిడమానూరు బస్టాండ్‌లోకి వెళ్లి తిరిగి ప్రయాణంలో రోడ్డుపక్కనే ఆగింది. ఈక్రమంలో వేగంగా వచ్చిన టిప్పర్ ఆగిఉన్న బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు వాహనాల్లో ఉన్న ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Bus Accident: జగిత్యాలలో ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. పూర్తి వివరాలివే..
ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన చండూరు మండలంలోని దోనిపాముల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఆలేటి జయమ్మ, యాదగిరి దంపతులు కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కొన్ని రోజులుగా వీరి కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతుంది. ఆర్ధిక ఇబ్బందులతో ఆవేదనకు గురైన జయమ్మ, పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు జయమ్మను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... చికిత్స పొందుతూ గురువారం నాడు మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gun fire, Komatireddy rajagopal reddy, Local News, Nalgonda