Rare Surgery In Suryapet Sri Swathi Hospital | రోజులు మారాయి. వైద్యరంగం కొత్త పుంతలు తొక్కుతుంది. టెక్నాలజీ నానాటికి పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం మనిషి గుండెను తీసి మరొకరికి అమర్చే వంటి అత్యుతమ సాంకేతికత అందుబాటులో ఉంది. అందుకే డాక్టర్లను దేవుళ్లతో పోలుస్తారు. మనిషి నిండు ప్రాణాన్ని కాపాడేందుకు డాక్టర్లు పడే శ్రమ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ హాస్పిటల్ లో అందుబాటులో ఉంటూ ఎన్నో రకాల సర్జరీలు చేస్తుంటారు. ఇక వైద్యరంగంలో అరుదైన శస్త్ర చికిత్సలు అనే పదం అప్పుడప్పుడూ వింటుంటాం. గుండెకు సంబంధించి కానీ..కిడ్నీకి సంబంధించి లేక మెదడుకు సంబంధించి లేదా కడుపులో కణితుల తొలగింపుకై గంటల పాటు శ్రమించి ప్రాణాన్ని నిలబెడతారు వైద్యులు. ఈ కణితుల తొలగింపు అనేది పెద్ద టాస్క్. ఎందుకంటే ఆ సమయంలో జరగకూడనిది ఏమైనా జరిగితే ప్రాణానికే పెను ప్రమాదం. ఇక తాజాగా ఇలాంటి అరుదైన శస్త్ర చికిత్స తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా చేశారు. వివరాల్లోకి వెళ్తే..
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కుడకుడ గ్రామంలో పొన్నెబోయిన శ్రీనివాస్ భార్య శశిరేఖ గత కొంతకాలంగా తీవ్ర కడుపునొప్పితో బాధపడుతుంది. నొప్పి భరించలేని శశిరేఖ సూర్యాపేటలోని పలు ఆసుపత్రులకు వెళ్ళింది. కానీ ఎక్కడా కూడా సరైన ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో సూర్యాపేట శ్రీ స్వాతి హాస్పిటల్ కు వెళ్లి వైద్యులను సంప్రదించింది. ఆమెకు వైద్య పరీక్షలు చేసిన వైద్యులు స్కానింగ్ కూడా చేశారు. ఆ స్కానింగ్ ఆధారంగా కడుపులో కణతి ఉందని శ్రీ స్వాతి హాస్పిటల్ వైద్యబృందం గుర్తించారు.
ఆస్పత్రి వైద్య బృందం కొన్ని గంటల పాటు శ్రమించి ఏకంగా 7 నుంచి 8 కిలోల గడ్డను విజయవంతంగా తొలగించారు. అప్పటివరకు తీవ్ర కడుపునొప్పితో బాధపడిన శశిరేఖ కణతి తొలగింపుతో ఆ బాధ నుండి విముక్తురాలైంది. శశిరేఖ, ఆమె కుటుంబసభ్యులు శ్రీ స్వాతి హాస్పిటల్ వైద్య బృందానికి, యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఆస్పత్రి వైద్యులను, నిర్వాహకులను అభినందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.