హోమ్ /వార్తలు /తెలంగాణ /

Rajagopal Reddy: త్వరలోనే జైలుకి కేసీఆర్ ఫ్యామిలీ , మునుగోడులో కేసీఆర్‌కి పోటీ చేసే దమ్ముందా : రాజగోపాల్‌రెడ్డి

Rajagopal Reddy: త్వరలోనే జైలుకి కేసీఆర్ ఫ్యామిలీ , మునుగోడులో కేసీఆర్‌కి పోటీ చేసే దమ్ముందా : రాజగోపాల్‌రెడ్డి

KCR RAJGOPALREDDY(FILE)

KCR RAJGOPALREDDY(FILE)

Munugode | Rajagopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టీఆర్ఎస్‌ పార్టీపైన, కేసీఆర్ ఫ్యామిలీపైనే మాటల తూటాలు ఎక్కుపెట్టారు. మునుగోడులో ఎవరు పోటీ చేసిన గెలిచేది తానేనని చెప్పుకుంటూనే దమ్ముంటే కేసీఆర్‌ని పోటీ చేసి తనపై గెలవాలని సవాల్ విసిరారు. ఇంకా ఏమన్నారంటే.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మునుగోడు(Munugode)ఉపఎన్నికపై టీఆర్ఎస్‌(TRS), కాంగ్రెస్‌ (Congress)కామ్‌గా ఉండటం, అభ్యర్ధిని ఎంపిక చేయకపోవడంతో బీజేపీ (BJP)జోరు పెంచింది. ఆల్రెడీ కమలం అభర్ధిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komati Reddy Rajagopal Reddy) కన్ఫామ్‌ కావడంతో ..ప్రత్యర్ధిగా ఏ పార్టీకి చెందిన వాళ్లైనా గెలుపు కష్టమే అన్నట్లుగా బీజేపీ దూసుకుపోతోంది. అంతే ఆ పార్టీ నాయకులు సైతం అంతే దూకుడుగా ప్రత్యర్ధి పార్టీలపై సవాళ్లు విసురుతున్నారు. ముఖ్యంగా వరంగల్‌(Warangal)లో బీజేపీ సభ సక్సెస్‌ కావడంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి టీఆర్ఎస్‌ పార్టీపైన, కేసీఆర్ ఫ్యామిలీపైనే మాటల తూటాలు ఎక్కుపెట్టారు. మునుగోడులో ఎవరు పోటీ చేసిన గెలిచేది తానేనని చెప్పుకుంటూనే దమ్ముంటే కేసీఆర్‌(KCR)ని పోటీ చేసి తనపై గెలవాలని సవాల్ విసిరారు. అభ్యర్ధి ఎంపికలోనే తర్జనభర్జనలు పడుతున్న టీఆర్ఎస్‌ పార్టీకి రాజగోపాల్‌రెడ్డి సవాల్‌ను సీరియస్‌గా తీసుకుంటుందో లేదో అనే చర్చ జోరుగా జరుగుతోంది.


BJP | Telangana : ఎన్టీఆర్, నితిన్, మిథాలీని బీజేపీ నేతలు కలవడం వెనుక అసలు కారణం అదే.. ఎంపీ లక్ష్మణ్ క్లారిటీకేసీఆర్‌ నిలబడినా ఓడిస్తా ...
మునుగోడు ఉపఎన్నిక తెలంగాణలోని మూడు ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. గెలుస్తామనే ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్న బీజేపీ ఇప్పుడు ప్రత్యర్ధి పార్టీగా ఉన్న టీఆర్ఎస్‌కు సవాల్ విసురుతోంది. మునుగోడులో చివరకు సీఎం కేసీఆర్‌ పోటీ చేసినా గెలిచేది తానేనని మునుగోడు బీజేపీ కార్యకర్తల సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దమ్ముంటే కేసీఆర్‌ మునుగోడులో పోటీ చేసి గెలిచి చూపించాలంటూ సవాల్ విసిరారు. అంతే కాదు కేసీఆర్‌ కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాజగోపాల్‌రెడ్డి.దమ్ము, ధైర్యం ఉంటే కాస్తోండి..

కేసీఆర్ కుటుంబం లక్ష కోట్ల రూపాయలను దోచుకుందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్‌ కుమార్తె కవిత దొరికిపోయిందన్న రాజగోపాల్‌రెడ్డి తర్వాత కేసీఆర్ ఆయన కొడుకు, అల్లుడు జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడ్డాయని చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా కేసీఆర్ కుటుంబ సభ్యులను త్వరలోనే జైలుకు పంపుతారంటూ కీలక వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా దుమారం రేపుతున్నాయి.


Telangana : 24గంటల్లో 59ఆపరేషన్లు చేసి పరేషాన్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు .. ఎక్కడంటే


త్వరలో అంతా జైలుకే ..

కేసీఆర్‌ నియంత పాలనను అంతమొందించడానికి, కుటుంబ పాలనకు స్వస్తి పలకడానికే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ బీజేపీలో చేరానన్నారు. ఇప్పటికైనా సవాల్ చేస్తున్నా మునుగోడు ఉపఎన్నికకు కేసీఆర్‌కి దమ్ము, ధైర్యం ఉంటే తనపై పోటీ చేసి గెలిచి చూపించాలని సవాల్ విసిరారు రాజగోపాల్‌రెడ్డి. బీజేపీ జోరు ..రాజగోపాల్‌రెడ్డి ధీమా చూస్తుంటే ప్రత్యర్ధి పార్టీలకు ఆయనపై సమర్ధవంతమైన అభ్యర్ధిగా ఎవర్ని నిలబెడితే బాగుంటుందనే ఆలోచన మరింత పెరిగినట్లుగా తెలుస్తోంది.

Published by:Siva Nanduri
First published:

Tags: CM KCR, Komatireddy rajagopal reddy, Munugode Bypoll, Telangana Politics

ఉత్తమ కథలు