హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nalgonda: డబ్బులిచ్చి మరీ కొడుకును చంపించిన తల్లిదండ్రులు .. కారణం అదేనట

Nalgonda: డబ్బులిచ్చి మరీ కొడుకును చంపించిన తల్లిదండ్రులు .. కారణం అదేనట

Nalgonda murder

Nalgonda murder

Nalgonda: కుమారుడు సాయినాద్ కొన్నేళ్లుగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. మార్కెట్లోకి వచ్చిన ప్రతి కారు కొంటూ 6 నెలలో దాన్ని అమ్మేస్తూ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తు డబ్బుల కోసం తల్లిదండ్రులు నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తు భౌతికంగా దాడులకు దిగేవాడు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda, India

(Narsimha, News18, Nalgonda)

కన్న కొడుకును స్వయంగా తల్లిదండ్రులే హత్య చేయించిన ఘటన సంచలనం కలిగించింది. కుమారుడి చేష్టలకు విసిగి.. అతని ప్రవర్తనను భరించలేక తల్లిదండ్రులు మేనమామతో కలిసి రూ. 8 లక్షలు సుపారీ(Supari)ఇచ్చి హత్య చేయించారు. సూర్యాపేట(Suryapet)జిల్లా పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఖమ్మం(Khammam)జిల్లా సత్తుపల్లి(Satupalli)మండల కేంద్రానికి చెందిన క్షేత్రియ రామ్ సింగ్ (Ramsingh),రాణిబాయి(Ranibai)ప్రస్తుతం ఖమ్మం పట్టణంలోని అదిత్య డ్రిమ్స్ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. రామ్ సింగ్ సత్తుపల్లిలోని రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్(College Principal)గా పనిచేస్తున్నారు. వీరికి కూతురు, కుమారుడు సాయినాథ్ (Sainath)ఉన్నారు. కూతురికి వివాహం కావడంతో భర్తతో కలిసి అమెరికా(America)లో ఉంటుంది. కుమారుడు సాయినాద్ కొన్నేళ్లుగా చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. మార్కెట్లోకి వచ్చిన ప్రతి కారు కొంటూ 6 నెలలో దాన్ని అమ్మేస్తూ స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తు డబ్బుల కోసం తల్లిదండ్రులు నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తు భౌతికంగా దాడులకు దిగేవాడు. అతని మానసిక పరిస్థితి బాగలేదని మద్యానికి బనిసగా మారడంతో హైదరాబాదులోని రిహాబిటేషన్ సెంటర్‌కు తరలించి 6 నెలలు చికిత్స చేయించారు. కానీ సాయినాధ్ ప్రవర్తన మారకపోవడంతో కొడుకు సాయినాధ్‌ను అంతమొందించాలని తల్లిదండ్రులు భావించారు.

Mulugu: మేడారం కంటే ముందుగా దర్శించుకునే 'గేట్ వే అఫ్ ములుగు': ఎక్కడుంది? ఏంటి ప్రత్యేకత?

రూ.8 లక్షలకు సుఫారి..

సాయినాద్‌ను హతమార్చేందుకు తల్లిదండ్రులు గతంలో మిర్యాలగూడలో ఉంటున్న ఆటో డ్రైవర్ రవి నాయక్‌తో రూ. 8 లక్షలకు సుపారీ మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించి అడ్వాన్స్‌గా రూ. 1.50 లక్షను రవి నాయక్ గ్యాంగ్‌కు తీసుకొన్నారు. అనంతరం సాయినాద్‌ను హతమార్చేందుకు ఖమ్మం పట్టణంలో అతను ఉంటున్న అపార్ట్‌మెంట్‌కు వెళ్లిన రవినాయక్ గ్యాంగ్ అపార్ట్‌మెంట్‌లో సీసీ కెమెరాలు ఉండాడంతోపాటు అందులో కొంత మంది వీఐపీలు ఉంటున్నట్లు గమనించి అక్కడ వీలు పడకపోవడంతో వెనుదిరిగి వెళ్లి పోయారు.

ప్లాన్ మిర్యాలగూడకు మార్పు:

రామ్‌సింగ్ అత్తగారిది మిర్యాలగూడ కావడంతో ఈ ప్లాన్ మిర్యాలగూడకు మార్చారు. అక్కడ రామ్ సింగ్ బావమరిది సత్యనారాయణ..కధనం నడిపించాడు. నల్గొండ జిల్లా దమరచర్ల మండలంలోని కల్లెపల్లి మైసమ్మ వద్ద మెుక్కు ఉందని సాయినాద్‌ను తీసుకువెళ్ళారు. అక్కడ కోడి కోసి దావత్ చేస్తుండగా...ముందే ప్లాన్ ప్రకారం అక్కడికి చేరుకున్న రవినాయక్ గ్యాంగ్(5 గురు) సాయినాధ్‌ను చెట్ల పొదలలోకి తీసుకువెళ్ళి గొంతుకు ప్లాస్టిక్ తాడుతో ఉరివేసి హత్య చేశారు. అనంతరం కారులో తీసుకువెళ్లి సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలంలోని శూన్యపహడ్ వద్ద మూసీ నదిలో పడేసి వెళ్లిపోయారు.

Nalgonda: మునుగోడు అభ్యర్ధులపై ఓటర్లు ఆగ్రహం .. కారణం తెలిస్తే షాక్ అవుతారు

కాల్ డేటా ఆధారంగా ..

గుర్తు తెయలిన యువకుడిని హత్య చేసి మూసీ నదిలో వేసిన ప్రాంతంలో పోలీసు అధికారులు గుర్తించి అక్కడ నెట్వర్క్ సహయంతో కాల్ డేటాను సేకరించారు. కాల్ డేటా ఆధారంగా వివరాలను సేకరించేందుకు కొంతమందికి ఫోన్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ ప్రయత్నంలో మిర్యాలగూడకు చెందిన ఒక వ్యక్తి కాల్ చేయగా అతను భయపడి అతనికి తెలిసిన ఒక వ్యక్తికి విషయాన్ని చెప్పారు. హత్యతో తనకు సంబంధం లేదని కొంతమంది ఉన్నారని చెప్పారు. దీని ఆధారంగా నిందితులను పట్టుకుని విచారణ చేపట్టారు పోలీసులు. ఈఘటనలో మృతుడి తల్లిదండ్రులు సహా మొత్తం ఏడుగురిని రిమాండ్ లోకి తీసుకున్న పోలీసులు హుజూర్‌నగర్ కోర్టులో హజరు పరిచారు.

నిందితులు వీరే..

1.క్షత్రియ. రామ్ సింగ్ 2.క్షేత్రియ .రాణిబాయి. 3. సహదేవుల. సత్యనారాయణ సింగ్ 4. రామవత్ .రవి 5.పాగుగోతు. నాగరాజు 6.బురుగు. రాంబాబు 7.దానవత్. సాయి 8. దీరవత్. దర్మ. వీరి నుంచి 4 కార్లు 1 మోటార్ సైకిల్, ప్లాస్టిక్ తాడు మెబైల్ పోన్లు, సుపారీ నగదు రూ. 23500 స్వాధీన పరచుకున్నారు.

First published:

Tags: Local News, Nalgonda, Telangana News

ఉత్తమ కథలు