హోమ్ /వార్తలు /తెలంగాణ /

TS|Suryapeta:11ఏళ్ల బాలుడికి బ్లడ్ క్యాన్సర్..బ్రతికించమని వేడుకుంటున్న తల్లిదండ్రులు

TS|Suryapeta:11ఏళ్ల బాలుడికి బ్లడ్ క్యాన్సర్..బ్రతికించమని వేడుకుంటున్న తల్లిదండ్రులు

(బ్లడ్ క్యాన్సర్‌తో పోరాటం)

(బ్లడ్ క్యాన్సర్‌తో పోరాటం)

స్నేహితులతో గ్రౌండ్‌లో ఆడుకోవాల్సిన వయసులో ప్రాణం కాపాడుకునేందుకు హాస్పిటల్‌ బెడ్‌పై పోరాడుతున్నాడు. 11 ఏళ్ల వయసులోనే బ్లడ్‌ క్యాన్సర్‌తో నరకయాతన అనుభవిస్తున్నాడు. ఆపన్నహస్తం కోసం ఆస్పత్రిలో ఎదురుచూస్తున్నారు ఆ బిడ్డ తల్లిదండ్రులు.

ఇంకా చదవండి ...

(Nagaraju,News18, Nalgonda)

రెక్కాడితే గాని డొక్కాడని పేద తరగతి కుటుంబం పాలిట క్యాన్సర్ మహమ్మారి శాపంగా మారింది. ఆ కుటుంబంలోని పదకొండేళ్ళ బాలుడు షడన్‌గా అనారోగ్యానికి గురవడంతో వైద్య పరీక్షలు చేయించారు. అప్పుడే ఆ తల్లిదండ్రులకు పిడుగులాంటి వార్త చెవిన వేశారు డాక్టర్లు(Doctors). పూట గడవడమే కష్టంగా ఉన్నా ఆ పేద కుటుంబం ఇప్పుడు కొడుకు వైద్యం కోసం లక్షలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలెత్తడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. సూర్యాపేటSuryapeta జిల్లా ఆత్మకూరు(Atmakuru)మండలం పల్లెర్ల(Pallerla)గ్రామానికి చెందిన సాయిబాబా(Saibaba),అనిత(Anitha) దంపతులకు ముగ్గురు కుమారులు. దంపతులు కూలిపని చేసుకుంటూ ఉన్నంతలో జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో చిన్న కుమారుడు మహేందర్Mahender..గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. గత మార్చి నెలలో మహేందర్ పాఠశాల(School)కు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వస్తూ కాళ్లు చేతులు గుంజుతున్నాయి అంటూ నడవలేక మార్గమధ్యలోనే కిందపడిపోయారు. కుమారుడు అస్వస్థతకు గురికావడంతో తల్లి దండ్రులు…వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినప్పటికీ మహేందర్ ఆరోగ్య పరిస్థితిలో మార్పు కనిపించలేదు. దీంతో హైదరాబాద్‌ని ఓ ప్రైవేట్ ఆస్పత్రి(Private hospital)లో చికిత్స చేయించగా.. బ్లడ్ క్యాన్సర్ (Blood cancer)అని తేలింది.

బ్లడ్‌ క్యాన్సర్‌గా నిర్ధారణ..

హాయిగా ఫ్రెండ్స్‌తో ఆడిపాడే వయసులో.. క్యాన్సర్‌ బారిన పడడంతో ఆ బాలుడు నరకయాతన అనుభవిస్తున్నాడు. బిడ్డ పడుతున్న బాధను చూస్తూ భరించలేకపోతున్న తల్లిదండ్రులు తమకు సాధ్యమైనంతలో రెండు లక్షలు ఖర్చు చేసి వైద్యం చేయిస్తూ వచ్చారు. అయితే పూర్తి వైద్యం చేయించడానికి మరో 10లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు తేల్చి చెప్పారు.

వైద్యానికి 10లక్షలు అవసరం..

బిడ్డను బ్రతికించుకునేందుకు తమకు ఉన్నంతలో డబ్బులు సమకూర్చుకుంటేనే గాంధీ వైద్యుల సూచన మేరకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేస్తున్నారు. అయితే వైద్య ఖర్చులకు ఇప్పటివరకు దాచుకున్న డబ్బుతో పాటు అప్పు చేసి 2లక్షలు ఖర్చు చేశారు. పూర్తి స్ధాయిలో వైద్యం చేయాలంటే 10 లక్షలు అవసరం అవుతుందని..ఆ డబ్బులు చేతిలో లేకపోవడంతో ఆపన్నహస్తం అందించే మహానుభావుల కోసం చేతులు జోడించి అర్ధిస్తున్నారు.

ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు..

ప్రాణాంతక వ్యాధి కొడుకుని మంచానపడేసింది. కూలీ , నాలి చేసుకొని కాలం వెళ్లదీస్తున్న సాయిబాబా అనిత దంపతులు బిడ్డను చూస్తూ ఆసుపత్రిలోనే గడపాల్సి వస్తోంది. చెంగు చెంగుమని గెంతాల్సిన బిడ్డ ఆసుపత్రి బెడ్‌పై అచేతనస్థితిలో పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే కొలుకుని ఇంటికి వెళ్తానని.. ఫ్రెండ్స్‌తో కలిసి స్కూల్‌కు కూడా వెళ్తానని మహేందర్‌ అంటుంటే కన్నీరు ఆగట్లేదని తల్లిదండ్రులు తల్లిడిపోతున్నారు. తమ కుమారుడి కోరిక నిజం కావాలని..దేవుడే తమ బిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చాలని కోరుకుంటున్నారు.

ఆదుకునే మహానుభావులెవరో..

రోగం నయం కావాలంటే మరో 10 లక్షల రూపాయలు కావాల్సి వస్తుంది. సాయిబాబా, అనీత దంపతులకు ఏం చేయాలో అర్ధం కావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వేరే దారి లేకపోవడంతో తమ బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఎవరైనా మానవతా హృదయముతో ముందుకు వచ్చి ఆర్ధిక సాయం అందజేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. దయగలవారు, బాలుడి ట్రీట్‌మెంట్ కోసం సాయం చేయాలనుకునే వాళ్లు ఈ ఫోన్‌ నెంబర్లకు 91 63009 63290 / 97019 87198 కాల్‌ చేసి సంప్రదించాలని తమ కుమారుడికి సహాయం చేయాలని మహేందర్‌ తల్లిదండ్రులు కోరుతున్నారు.

First published:

Tags: Cancer children, Suryapeta

ఉత్తమ కథలు