హోమ్ /వార్తలు /తెలంగాణ /

Crime news: ఆ చెడు అలవాటు వల్లే కొడుకును చంపిన తల్లిదండ్రులు .. ఈ దారుణం ఎక్కడ జరిగిందంటే..

Crime news: ఆ చెడు అలవాటు వల్లే కొడుకును చంపిన తల్లిదండ్రులు .. ఈ దారుణం ఎక్కడ జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

OMG: చెడు వ్యసనం అతడి ప్రాణాలకే చేటు తెచ్చింది. గంజాయి మత్తులో అతడు చేస్తున్న అరాచకాన్ని కన్నవాళ్లు, కట్టుకున్న భార్య భరించలేకపోయారు. బ్రతికి ఉండి ప్రాణాలు తోడేస్తున్నాడనే బాధతో కన్నవాళ్లే బిడ్డను కడతేర్చిన సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Suryapet, India

జన్మనిచ్చిన తల్లిదండ్రులే బిడ్డను చంపేశారు. కని, పెంచిన బంధాన్ని క్షణికావేశంలో తుంచేసుకున్నారు. చెట్టంత ఎదిగిన కొడుకును శాశ్వతంగా దూరంగా చేసుకున్నారు. సూర్యాపేట(Suryapet)జిల్లాలో జరిగిన ఈదారుణం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. సంతానం కోసం వ్రతాలు, పూజలు చేసే తల్లిదండ్రులు ఎందుకింత దారుణానికి ఒడిగట్టారో తెలిసి స్థానికులతో పాటు పోలీసులు(Police) ఆశ్చర్యపోయారు. పుత్రుడు ప్రయోజకుడు కాలేదన్న బాధ కంటే ..ప్రాణాలతో ఉండి నిత్యం నరకం చూపిస్తున్నాడనే ఆవేశంలో ఘాతుకానికి ఒడిగట్టారు.

OMG : ఘోరం..కూతురిని గొలుసుతో కట్టి 36 ఏళ్లు గదిలో బంధించిన తండ్రి

చెడు వ్యసనమే కారణం..

సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో దారుణం జరిగింది. కిరణ్ అనే యువకుడు మాదకద్రవ్యాలకు బానిసయ్యాడు. ఈవిషయం తల్లిదండ్రులకు తెలియడంతో పలుమార్లు హెచ్చరించారు. వ్యసనం మానుకోమని నచ్చజెప్పారు. అయినా కిరణ్ గంజాయికి అలవాటు పడటంతో భార్య విసిగిపోయింది. కిరణ్‌ను వదిలేసి బిడ్డను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత చెడు వ్యసనం వదులుకోలేక డబ్బుల కోసం కిరణ్ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడం, ఇంట్లోని వసువులు, దుస్తులను తగలబెట్టాడు.

తల్లిదండ్రులే హంతకులు..

ఇంట్లో సామాన్లు అమ్మడమే కాకుండా ఊరిలో అప్పులు చేయడం మొదలుపెట్టాడు. రోజు రోజుకు కొడుకు చేష్టలు మితిమీరడంతో విసిగిపోయిన తల్లిదండ్రులు ఊరు విడిచి వెళ్లిపోయారు. గ్రామంలో బంధువులు చనిపోయారని తెలుసుకొని తిరుమలగిరికి వచ్చిన తల్లిదండ్రుల్ని కిరణ్ సోమవారం ఇంట్లో బంధించాడు. గంజాయి తాగిన మత్తులో ఇద్దర్ని చితకబాదాడు. చెట్టంత ఎదిగిన కొడుకుతో సుఖం లేకపోగా ..మనశాంతిగా బ్రతకనివ్వకపోవడంతో తల్లిదండ్రులు విసిగిపోయారు. ఇలాంటి వ్యసనపరుడితో ఎప్పటికైనా తమకు ప్రమాదం తప్పదని భావించారు. గంజాయికి బానిసైన కొడుకు ఉంటే ఎంతా లేకపోతే ఎంత అని నిర్ణయించుకున్నారు.

Lady Khiladi : ఆమె చేతిలో మంత్రులు,ఎమ్మెల్యేలు,వీఐపీల న్యూడ్‌ వీడియోలు .. ఎంత డబ్బు గుంజిందో తెలుసా..?

మత్తులో ఉండగానే చంపేశారు..

గంజాయి మత్తులో స్పృహ కోల్పోయిన కిరణ్‌ని రాత్రి తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి మెడగు తాడు బిగించి చంపేశారు. బ్రతికుంటే కొడుకు వల్ల తమకు కష్టాలు తప్పట్లేదనే బాధతోనే ఇంతటి దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. మృతుడు తల్లిదండ్రులు చెబుతున్నదాంట్లో ఎంత వాస్తవం ఉందనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

First published:

Tags: Suryapeta, Telangana crime news

ఉత్తమ కథలు