హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana : గర్భిణి పొట్టపై కాళ్లతో తొక్కిన నర్సులు .. కాన్పు పోయమంటే కాటికి పంపారు

Telangana : గర్భిణి పొట్టపై కాళ్లతో తొక్కిన నర్సులు .. కాన్పు పోయమంటే కాటికి పంపారు

pregnant died

pregnant died

Telangana: నల్గొండ జిల్లాలో ఓ గర్భిణి ప్రసవం కోసం నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే పురుడు పోయాల్సిన నర్సులు ఆ ప్రసూతి మహిళను నరకయాతను గురి చేశారు. గవర్నమెంట్‌ ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తించిన తీరు అందర్ని విస్మయానికి గురి చేస్తోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda, India

(P.Srinivas,New18,Karimnagar)

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులను, వైద్య కోసం వచ్చే వారిని వైద్య సిబ్బంది పురుగుల్లా చూస్తున్నారు. వైద్యం చేసే డాక్టర్ల(Doctors)దగ్గర నుంచి ఆసుపత్రుల్లో పని చేస్తున్ననర్సులు(Nurses), స్వీపర్ల(Sweepers)వరకు అందరిలో నిలువెల్లా నిర్లక్ష్యం చేరిపోయింది. ట్రీట్‌మెంట్‌(Treatment)కి వచ్చే వాళ్లను కనీసం మనుషులుగా కూడా చూడటం లేదనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. తాజాగా నల్గొండ (Nalgonda) జిల్లాలో ఓ గర్భిణి(Pregnant)ప్రసవం కోసం నల్లగొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే పురుడు పోయాల్సిన నర్సులు ఆ ప్రసూతి మహిళను నరకయాతను గురి చేశారు. గవర్నమెంట్‌ ఆసుపత్రి సిబ్బంది ప్రవర్తించిన తీరు అందర్ని విస్మయానికి గురి చేస్తోంది. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Viral video : ఊరికి దెయ్యం పట్టిందని మాంత్రికుడితో పూజలు.. ఒక్కో ఇంటి నుండి డబ్బు వసూలు

కాన్పు చేయమంటే కాటికి పంపారు..

నల్గొండ జిల్లాలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ప్రసవం కోసం బిడ్డను మోస్తూ ఆసుపత్రిలో చేరింది అఖిల అనే గర్భిణి. ఈనెల 9వ తేది ఆసుపత్రిలో చేరిన అఖిలకు నెలలు నిండటంతో శనివారం పురిటి నొప్పులు వచ్చాయి. కాన్పు పోయాల్సిన డాక్టర్లు నర్సులకు బాధ్యత అప్పగిస్తే వాళ్లు దుశ్చర్యకు పాల్పడ్డారు. పురిటి నొప్పులు భరించలేక గట్టిగా అరుస్తున్న అఖిలను సైలెంట్‌గా ఉండూ అంటూ గదమాయించారు. పడుకున్నప్పుడు తెలియదా అంటూ నీచంగా మాట్లాడుతూ కాన్పు కోసం వచ్చిన అఖిలను బండబూతులు తిట్టారు నర్సులు.

నర్సులు కాదు నరరూప రాక్షసులు..

చివరకు ప్రసవం చేయడానికి కూడా నిండు గర్భిణిగా ఉన్న అఖిల పొట్టపై కాళ్లతో నొక్కుతో కాన్పు చేశారు నర్సులు. ఓవైపు పురిటి నొప్పులు మరోవైపు నర్సులు కాళ్లతో పొట్టపై తన్నడంతో బిడ్డను ప్రసవించిన వెంటనే అఖిల ప్రాణాలు విడిచింది. నర్సుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని అఖిల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నల్గొండ జిల్లా కట్టంగూడు మండలం చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన అఖిలను తొలి కాన్పు కోసం అత్తయ్య, అమ్మ ఆసుపత్రికి తీసుకొచ్చారు. 12వ తేదిన పురిటి నొప్పులు రావడంతో నర్సులకు విషయం చెప్పారు. సెల్‌ఫోన్లు చూసుకుంటూ నిర్లక్ష్యపు సమాధానం చెప్పడమే కాకుండా అంత అర్జెంట్ అయితే ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లమని ఉచిత సలహా ఇచ్చారు. అఖిల అత్త పూలమ్మ కళ్ల ముందే గర్భిణిని వైద్యం పేరుతో కాళ్లతో తంతూ పొట్టపై ఒత్తిడి పెంచారు.

NIA searches: ఏపీ , తెలంగాణలో ఎన్‌ఐఏ మెరుపు దాడులు .. ఒకరు అరెస్ట్, కీలక పత్రాలు స్వాధీనం

గర్భిణి పొట్టపై కాలుతో తొక్కిన సిబ్బంది..

నర్సులు చేసిన దారుణానికి అఖిల ఒత్తిడిగి గురవడంతో మగబిడ్డకు జన్మనిచ్చి అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. బిడ్డను కన్న తర్వాత తల్లిని పట్టించుకోకుండా నర్సులు సెల్‌ఫోన్లు చూసుకోవడంతో అఖిల ప్రాణాలు వదిలింది. తన భార్య చావుకు నర్సులే కారణమని ఆరోపిస్తూ భర్త, అత్తమామలు, కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. నర్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈవార్త స్థానికంగా సంచలనం సృష్టించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది.

Published by:Siva Nanduri
First published:

Tags: Nalgonda, Pregnant women, Telangana News

ఉత్తమ కథలు