హోమ్ /వార్తలు /తెలంగాణ /

Cauliflower farming: స్వల్ప పెట్టుబడి, తక్కువ టైమ్.. అధిక ఆదాయం గడిస్తున్న రైతు

Cauliflower farming: స్వల్ప పెట్టుబడి, తక్కువ టైమ్.. అధిక ఆదాయం గడిస్తున్న రైతు

X
సాధారణ

సాధారణ పంటలకు భిన్నంగా కాలీ ఫ్లవర్ సాగుతో..తక్కువ సమయంలో ప్రభుత్వ ఉద్యోగికి ధీటుగా..

Nalgonda:సాధారణ పంటలకు భిన్నంగా కాలీ ఫ్లవర్ సాగుతో..తక్కువ సమయంలో ప్రభుత్వ ఉద్యోగికి ధీటుగా ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నాడు ఓ యువ రైతు. ఇంతకీ అతను వేస్తున్న పంట ఏంటో తెలుసుకుందాం..!

(Nagaraju,News18, Nalgonda)

కొన్ని రకాల పంటలను సాగు చేయడం వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తుంది. మార్కెట్ లోనూ మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి రైతులు(Farmers)అలాంటి పంటలను సాగుచేయాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. అలాంటి పంటల్లో కాలీఫ్లవర్(Cauliflower)ఒకటి. అలా వ్యవసాయ నిపుణుల మాటలు తూచా తప్పకుండా పాటించారు నల్గొండ(Nalgonda)జిల్లా మట్టంపల్లి (Mattampally) మండలం దోనబండ తండా(Donabanda Tanda)కు చెందిన రైతు భూక్యా హనుమా నాయక్(Bhukia Hanuma Nayak). తనకున్న ఎకరం పొలంలో.. అర ఎకరం పొలంలో కాలానుగుణంగా వివిధ రకాల పంటలు పండిస్తున్నారు. మరో అర ఎకరం పొలంలో రెండేళ్లుగా కాలీ ఫ్లవర్ సాగు చేస్తున్నారు. నీటి వసతి ఉన్న భూమి కావడంతో .. తక్కువ పెట్టుబడితో కేవలం 90 రోజుల్లో దిగుబడి వచ్చే కాలీ ఫ్లవర్ సాగుతో…ప్రభుత్వ ఉద్యోగి(Government employee)కి ధీటుగా 60 వేల ఆదాయం గడిస్తున్నాడు.

క్యాలీఫ్లవర్‌కు మార్కెట్‌లో డిమాండ్..

కాలీఫ్లవర్ లో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా అధికంగా సీ విటమిన్ తో పాటు కె విటమిన్, పోటాషియం, మాంగనీస్, ప్రొటీన్, రైబోప్లేవిన్, మోమిన్ లు ఉన్నాయి. అందువల్ల కాలీఫ్లవర్ ను ఆహారంగా తీసుకోవడంతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, వివిధ రకాల క్యాన్సర్ల ప్రభావాన్ని సైతం కాలీఫ్లవర్ తగ్గిస్తుంది. అందువల్ల దీనికి మార్కెట్ డిమాండ్ అధికంగానే ఉంటుంది.

లాభసాటి పంటలపై రైతు దృష్టి..

అంతేకాక మార్కెటింగ్ సైతం తానే చేస్తూ ప్రంశసలు అందుకుంటున్నాడు.సాధారణంగా కాలీ ఫ్లవర్ ఒక్కో పువ్వు కిలో నుంచి కిలోన్నర బరువు పెరుగుతుందని.. ఆ మేర దిగుబడి చేస్తే ఈ పంట సాగుక వాతావరణం అనుకూలంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు సూచించడంతో.. ఈ సాగు చేస్తున్నట్లు రైతు చెప్పుకొచ్చాడు. ఇక ఆ ప్రాంతంలో బిహారీ, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే కూలీలు సైతం అధికంగా ఉండడంతో పంటకు డిమాండ్ భారీగా ఉంటున్నట్లు వెల్లడించాడు హనుమా నాయక్‌. గతంలో వంగ, బీర, కాకర వంటి కూరగాయల సాగు చేసిన నష్టపోయిన హనుమ నాయక్ కాలీ ఫ్లవర్ సాగుకు అవసరమైనమొక్కల్ని.. పక్క రాష్టం రాజుపాలెం నుంచి 4 వేలకు కొనుగోలు చేశాడు. పంటకు అవసరమైన పురుగుల మందుకు 12 వెలు ఖర్చు చేసినట్లు తెలిపారు. మొత్తంగా పంట మీద ఆదాయం 80వేలు రాగా అందులో పెట్టుబడి 20 వేలు తీసేయగా 60 వేల రూపాయలు లాభం వచ్చిందంటున్నాడు.

కాలీఫ్లవర్‌ సాగుచేసే విధానం..

క్యాలిఫ్లవర్ పంటను పూర్తి విస్తీర్ణంలో ఒకేసారి కాకుండా విడతలవారిగా వేసుకోవడం మంచిది.క్యాలిఫ్లవర్‌ని చల్లని వాతావరణంలో తేమగా ఉన్న వాతావరణంలో సాగు చేస్తే మంచి దిగుబడులను సాధించవచ్చు. ఈ పంటలో మంచి మెలకువ పద్ధతులను పాటించడం వల్ల అధిక దిగుబడులను సాధించి మంచి లాభాలను ఆర్జించవచ్చు.

నేల తయారి

ఈ పంటకు నల్లరేగడి నేలలు, ఎర్రనేలలు అనువైనవి. ఉదజని సూచిక (PH విలువ) 5.5 – 6.5 గా ఉన్న నేలలు సాగుకు అనువైనవి.క్యాలిఫ్లవర్పంట వెయ్యడానికి ఎంచుకున్న నేలను 2 నుండి 3 సార్లు నేల వదులు అయ్యేలా దున్నుకోవాలి. చివరి దుక్కికి ముందు ఎకరానికి 8-10 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల పోటాష్ మరియు 40 కిలోల బాస్వరం వేసుకొని చివరి దుక్కిని కలియ దున్నుకోవాలి.

విత్తుకునే విధానంఒక్క ఎకరానికి సూటి (దేశవాళి) రకం విత్తనాలు అయితే 300 గ్రాముల విత్తనాలు, సంకర రకం విత్తనాలు అయితే 100-150 గ్రాముల విత్తనాలు అవసరం పడుతాయి. విత్తేముందు ఒక్క 1 కిలో విత్తనానికి 3 గ్రా” తైరం లేదా 3 గ్రా” కార్బండిజంతో విత్తన శుద్ధి చేసుకొనవలెను. నారు పెంచుటకు నారు మడులను నేలకు దాదాపుగా 10 – 15 సెంటి మీటర్ల ఎత్తుగా మడులను చేసుకొని మడులపై అచ్చుగా గీతలు గీసుకొని విత్తనాలను వేసి మెత్తటి మట్టితో కప్పివేయ్యాలి. విత్తనాలకు నీటిని అందించి దానిపై వరిగడ్డిని పలుచగా వేసుకోవాలి. లేదా కోకోఫిట్ తో నింపిన ట్రేలలో విత్తుకోవడం మంచిది. ఈ ట్రేలలో విత్తుకోవడం వల్ల నారును ఆకూ తినే పురుగు ఆశించకుండా ఉంటుంది. ప్రతి రోజు నీటిని పైపాటుగా అందించాలి. నేలపై నారును పెంచే క్రమంలో మడులలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. నారును ఆకు తినే పురుగు ఆశిస్తే నివారణ చర్యగా 1 లీటర్ నీటికి 2.5 ML” మాలాథియాన్ కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

మొక్కలు నాటుకునే విధానం

నారు వయస్సు 25 –30 రోజుల మద్య మొక్కలను నాటుకోవడానికి సిద్ధం చేసుకోవాలి. మొక్కలను నాటుకునేప్పుడు సాలుల మద్య దూరం 60 సెం.మీ. మొక్కల మద్య దూరం 45 సెం. మీ. దూరాలు ఉండేలా చూసుకోవాలి. ఎకరానికి 15000 – 18000 మొక్కలు అవసరం పడుతాయి.తేలికపాటి ఎర్రనేలలు లేదా దుబ్బా నేలలో 7 రోజులకు, నల్లరేగడి నేలలు అయితే 10 రోజులకు ఒక్కసారి నీటిని అందిస్తే సరిపోతుంది. పంట చేనులో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. క్యాలిఫ్లవర్ పువ్వు తెల్లగా మచ్చలు లేకుండా నాణ్యంగా ఉండాలంటే పువ్వు కోతకు 5-7 రోజుల ముందు మొక్కను ఆకులతో కప్పివేయ్యాలి. ఇలా చెయ్యడం ద్వారా సూర్యరశ్మి పువ్వు మీద పడకుండా ఉండి వువ్వు తెల్లగా ఉంటుంది.

First published:

Tags: Farmers, Nalgonda

ఉత్తమ కథలు