హోమ్ /వార్తలు /తెలంగాణ /

Modern Farmer:ఎలక్ట్రిక్ సెన్సార్లు అమర్చి వరిసాగు .. నల్లగొండ జిల్లా రైతుకు తట్టిన ఐడియా

Modern Farmer:ఎలక్ట్రిక్ సెన్సార్లు అమర్చి వరిసాగు .. నల్లగొండ జిల్లా రైతుకు తట్టిన ఐడియా

(ఎలక్ట్రిక్ సెన్సార్లతో సాగు)

(ఎలక్ట్రిక్ సెన్సార్లతో సాగు)

Nalgonda: వ్యవసాయం చేసే విధానంలో ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వచ్చి చాలా కాలమైంది. కాని ఇప్పుడు అత్యాధుని టెక్నాలజీ కూడా తోడైంది. నల్లగొండ జిల్లాలో ఓ రైతు ఏకం ఎలక్ట్రిక్ సెన్సార్లను ఉపయోగిస్తూ వరిసాగు చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడంటే

ఇంకా చదవండి ...

(Nagaraju,News18, Nalgonda)

ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ సాంకేతికత వినియోగం పెరిగింది. నానాటికీ కొత్త పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానా(Technology)న్ని వినియోగించుకుంటూ..స్వల్ప వ్యవధిలోనే తక్కువ ఖర్చుతో మంచి లాభాలు గడిస్తున్నారు వ్యాపారస్తులు. అయితే ప్రధానంగా వ్యవసాయంపై ఆధారపడ్డ మన దేశంలో ఇప్పుడిప్పుడే పరిస్థితులు మారుతున్నాయి. సాంప్రదాయ పద్ధతులకు స్వస్తి పలుకుతూ, సాంకేతికతను అందిపుచ్చుకుంటే రైతులకు ఎన్నో విధాలుగా ఉపయోగం ఉంటుంది. అలా నల్గొండ (Nalgonda)జిల్లాకు చెందిన రైతులు..సాంకేతికత సహాయంతో, తక్కువ శ్రమతో వ్యవసాయం చేస్తున్నారు. వినూత్న రీతిలో వరి సాగులో ఎలక్ట్రానిక్ సెన్సార్స్ (Electronic sensors)ఉపయోగించి నూతన సాగు విధానాలతో ముందుకు సాగుతున్నారు. ఇంతకు ఆ సెన్సార్ కథేంటి? దాని వలన ప్రయోజనాలు ఎంటో తెలుసుకునేందుకు ప్రయత్నించింది న్యూస్18.

వరి సాగులో సాంకేతిక హంగులు:

నల్గొండ జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి సాగు చేస్తుంటారు రైతులు. జిల్లాలోని త్రిపురారం మండలం కొణతాలపల్లి, కామారెడ్డి గూడెం గ్రామాలలో చెరువు నీటి ద్వారా రైతులు వరి సాగు చేస్తుంటారు. పంట సమయంలో వచ్చే తెగుళ్లతో రైతులు సతమతం అవుతుంటారు. అదే సమయంలో పొలంలో నిత్యం నీటి తడి ఉండేలా రైతులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇటువంటి సమస్యలకు పరిష్కారం చూపుతూ \"కంపసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం\" \"భారత వరి పరిశోధన మండలి\" \"ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్\"లోని నీటి పరిశోధన సంస్థ.. బెంగళూరుకు చెందిన \"కల్టివేట్\" సంస్థ ఆధ్వర్యంలో ఓ సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేశారు. వరి సాగులో నీటి వృధా లేకుండా తెగుళ్లను తట్టుకునేలా ఎలక్ట్రానిక్ సెన్సార్ వినియోగిస్తూ వినూత్న రీతిలో నూతన సాగు విధానాలతో ముందుకు సాగుతున్నారు త్రిపురారం మండల రైతులు.

సెన్సార్ పనిచేసే విధానం:

మొదట గ్రామంలో \"గేట్ వే\"ను అమర్చుతారు. అనంతరం రైతు పొలంలో ప్లాస్టిక్ పైపులు ఏర్పాటు చేసి.. సెన్సార్ బోర్డుల నుంచి \"గేట్ వే\"కు సిగ్నల్స్ వచ్చేలా చేస్తారు. సెన్సార్లు అందించే సమాచారం బెంగుళూరులోని \"కల్టివేట్\" సంస్థకు చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆ సమచారాన్ని సంస్థ ప్రతినిధులు ఫోన్ ద్వారా ఇక్కడి రైతులకు తెలియజేస్తారు. ఇక సెన్సార్ కిట్ ఏర్పాటుకు మొత్తం ఖర్చు రూ.లక్షకు పైగా అవుతుండగా, కల్టివేట్ సంస్థ వారే ప్రస్తుతానికి ఈ వ్యయాన్ని భరిస్తున్నారు.

ఇది చదవండి:రాళ్లతో 100 అడుగుల లోతులో 500ఏళ్ల క్రితం కట్టించిన బావి..ఇప్పుడు ఎలా ఉందో చూడండి


రైతులకు మంచి ప్రయోజనాలు:

వరి సాగులో ఎలక్ట్రానిక్ సెన్సార్ వాడకం వలన..తడి పొడి విధానాన్ని వాడుతు..నేలలో అందుబాటులో ఉన్న నీటి స్థాయిని ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. వరి మడిలో నీటిమట్టం 2.5 సెంటీమీటర్లు ఎగువుగా ఉన్నప్పుడు నీటిని నిలిపివేస్తుంది. అంతేకాక నీటి మట్టం నేల మట్టానికి 2.5 సెంటీమీటర్లు దిగువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా నీటిని అందిస్తుంది. ఈవిషయం..ఫోన్లోని జీపీఎస్ ద్వారా రైతుకు సమాచారం అందుతుంది. సెన్సార్ వాడకం వలన వాతావరణ కాలుష్య కారణామైన మీథేన్ వాయువు విడుదల తగ్గుతుందని.. వాతావరణ పరిస్థితి కలిసి వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. వరి సాగులో సెన్సార్ విధానం వలన రైతులు నేరుగా పొలం వద్దకు వెళ్లాల్సిన పని ఉండదనీ, దీంతో ఆ సమయాన్ని ఇతర పనులకు వినియోగించుకుంటున్నామని కొణతాల పల్లి గ్రామానికి చెందిన రైతులు అంటున్నారు. అదే విధంగా వరి మడిలో నీటి వృథాను అరికట్టి, భవిష్యత్తులో నీటి కొరత రాకుండా చూడొచ్చని తెలిపారు. విద్యుత్ సాగు ఖర్చులు తగ్గుతాయని..దోమ ఉదృతి తక్కువగా ఉంటుందని రైతులు వాపోతున్నారు.

First published:

Tags: Local News, Nalgonda, New technology, Paddy

ఉత్తమ కథలు