తెలంగాణ కాంగ్రెస్(Telangana congress)లో గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి(Uttam kumar reddy)సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి నల్లగొండ (Nalgonda)జిల్లాలో కాంగ్రెస్ పరిస్థితితో పాటు పార్టీ భవిష్యత్తుపై కీలక కామెంట్స్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కోదాడ(Kodada),హుజుర్‌నగర్ (Huzurnagar)నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 50వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమని జోస్యం చెప్పారు కాంగ్రెస్ ఎంపీ. అంతే కాదు ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడైనా ఒక్క ఓటు మెజార్టీ తగ్గినా తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని శపథం చేశారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. అంతే కాదు గతంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడ, హుజుర్‌నగర్ నియోజకవర్గాల్లో ఉత్తమ్ పోటీ చేసి గెలిచారు. హుజుర్‌నగర్ ఉపఎన్నికల్లో ఆయన సతీమణి పద్మఉత్తమ్‌కుమార్ టీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి షడన్‌గా తన భవిష్యత్ రాజకీయాలపై తన నిర్ణయాన్ని ప్రకటించడం రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఉత్తమ్ కుమార్ శపథం ..
రాజకీయాల్లో వాగ్ధానాలు చేయడం, సవాళ్లు విసరడం సర్వ సాధారణమైన విషయం. అయితే హామీలు, సవాళ్లు కేవలం ఎన్నికలు జరిగే సమయంలో మాత్రమే ఓట్ల కోసం రాజకీయ నాయకులు ప్రత్యర్ధులపై చేస్తుంటారు. కాని కాంగ్రెస్ ఎంపీ, మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాత్రం షడన్‌గా రాబోయే ఎన్నికల్లో గెలుపు, ఓటములతో పాటు పార్టీ భవిత్యం, తన రాజకీయ జీవితానికి సంబంధించి డేరింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. 1994లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కెప్టెన్ ..1999 నుంచి ఐదు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఒకసారి ఎంపీగా గెలిచారు. కాంగ్రెస్ హైకమాండ్‌కి బాగా దగ్గరైన వ్యక్తుల్లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఒకరు. ప్రస్తుతం నల్లగొండ ఎంపీగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాబోయే ఎన్నికల్లో తాను ప్రాతినిధ్యం వహించిన కోదాడ, హుజుర్‌నగర్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 50వేల ఓట్ల మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. అందులో ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని శపథం చేశారు.
రాజకీయ సన్యాసమే..
ఎంతో రాజకీయ అనుభవం కలిగిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గత ఉపఎన్నికల్లో తన సతీమణిని హుజుర్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయించారు. అయితే ఆమెను గెలిపించుకోలేకపోవడంతో రాజకీయాల్లో యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయడం లేదు. రీసెంట్‌గా నల్లగొండ జిల్లా పరిస్థితులపై మాట్లాడిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందన్నారు. తాను సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్న కెప్టెన్ ..తనకు ఎక్కడా సొంత ఇల్లు లేదని ..హైదరాబాద్ , కోదాడ, హుజుర్‌నగర్‌లో అద్దె ఇళ్లలోనే ఉంటున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆస్తులు, పదవులపై తనకు వ్యామోహం లేదన్న నల్లగొండ ఎంపీ ...రాబోయే ఎన్నికల గురించి ఇప్పుడే శపథం చేయడంపై రాజకీయ పార్టీ నేతలు తొందరపడి ఓ కోయిలా ముందే కూసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం తీయించుకోనంటూ శపథం చేశారు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. ఆయన సవాల్‌పై టీఆర్ఎస్, బీజేపీ నేతలు నేతలు బాగానే ఎండగట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.