Home /News /telangana /

NALGONDA MP KOMATIREDDY VENKATREDDY TOOK A SENSATIONAL DECISION EXPRESSING HIS DISPLEASURE OVER THE INCLUSION OF CHERUKU SUDHAKAR IN THE CONGRESS PARTY PRV

Komatireddy Venkatreddy: కాంగ్రెస్​లో చేరిన చెరుకు సుధాకర్​.. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సంచలన నిర్ణయం.. 

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (ఫైల్ ఫోటో)

తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్​ (Cheruku Sudhakar)ను పార్టీలో చేర్చుకోవడంపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. దీంతో షాకింగ్​ నిర్ణయం తీసుకున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్​ (Cheruku Sudhakar)ను పార్టీలో చేర్చుకోవడంపై భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ (Congress)​ సీనియర్​ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkatreddy) అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఈ విషయమై కోమటిరెడ్డి.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth reddy) పై తీవ్రంగా ధ్వజమెత్తారు. తనను ఓడించేందుకు ప్రయత్నించిన చెరుకు సుధాకర్ ను పార్టీలో చేర్చుకోవడంపై వెంకట్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయమై రేవంత్ రెడ్డి పెద్ద తప్పు చేశారన్నారు. దీంతో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను రేవంత్ రెడ్డి ముఖం చూడనని ఎంపీ చెప్పారు. పార్లమెంట్ సమావేశాల తర్వాత తాను మునుగోడుకు వెళ్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.

    కాగా, శుక్రవారం కాంగ్రెస్ పార్టీ లో చెరుకు సుధాకర్ (Cheruku sudhakar) చేరారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Khargey)సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు చెరుకు సుధాకర్. అంతేకాదు.. తన తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేశారు చెరుకు సుధాకర్. ఈ కార్య‌క్ర‌మంలో చెరుకు సుధాక‌ర్‌తో పాటు ఆ పార్టీ నాయ‌కులు నాయ‌కులు బ‌త్తుల సోమ‌య్య‌, సందీప్ చ‌మార్, కాంగ్రెస్ నాయ‌కుడు స‌త్తు మ‌ల్లేష్ పాల్గొన్నారు.





    ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆరెస్ ఏర్పాడ్డాక పొలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశానని.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ ను బలపరిచామని వెల్లడించారు. తెలంగాణ ఇంటి పార్టీని, కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నానని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమం కారుల కోసం త్వరలో పిసిసి కమిటీ ఏర్పాటు చేస్తామని చెరుకు సుధాకర్ స్పష్టం చేశారు.



    తెలంగాణ కోసం 1997 నుంచి పోరాటం..

    చెరుకు సుధాకర్ 1961 ఆగస్టు 31వ తేదీన నల్లగొండ జిల్లా గుండ్రంపల్లిలో జన్మించారు. గాంధీ మెడికల్ కళాశాల నుంచి ఎంబిబిఎస్ డిగ్రీ తీసుకున్నారు. ప్రత్యేక తెలంగాణ కోసం 1997 నుంచి పోరాటం చేస్తూ వచ్చారు. మలిదశ ఉద్యమంలో ప్రస్తుత ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపు మేరకు టిఆర్ెస్ లో చేరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన టిఆర్ఎస్ కు రాజీనామా చేసి తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించారు. తెలంగాణ ఇంటి పార్టీ నుంచి 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి పరాజయం పాలయ్యారు.



    ఆరు నెలల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై చెరుకు సుధాకర్ తో కాంగ్రెస్ పార్టీ చర్చలు జరుపుతోంది. మూడు నెలల కిందట రాష్ట్రానికి వచ్చిన రాహుల్ గాంధీ సైతం ఆయనతో చర్చించారు. తెలంగాణ ఉద్యమకారులతో మాట్లాడారు. కేసీఆర్ ను గద్దె దింపేందుకు ఉద్యమకారులు కలిసి రావాలని రాహుల్ సూచించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కానీ, నల్గొండ ఉమ్మడి జిల్లాలో కొమటిరెడ్డి బ్రదర్స్ కారణంగా ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా పరిణామాలతో చెరుకు సుధాకర్ పార్టీ విలీనం మరోసారి తెరపైకి వచ్చింది.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Komatireddy venkat reddy, Revanth Reddy, TS Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు