హోమ్ /వార్తలు /తెలంగాణ /

Komati Reddy: కేసీఆర్​ ఆ పని చేయకపోతే రక్త పాతం తప్పదు.. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి హెచ్చరిక

Komati Reddy: కేసీఆర్​ ఆ పని చేయకపోతే రక్త పాతం తప్పదు.. కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి హెచ్చరిక

కోమటిరెడ్డి, సీఎం కేసీఆర్​ (ఫైల్​)

కోమటిరెడ్డి, సీఎం కేసీఆర్​ (ఫైల్​)

నల్గొండ (Nalgonda) జిల్లాలోని సమస్యలపై సీఎం కేసీఆర్​ స్పందించకపోతే రక్తపాతం తప్పదని కాంగ్రెస్​ ఎంపీ కోమటరెడ్డి వెంకట్​రెడ్డి హెచ్చరించారు. నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  నల్గొండ (Nalgonda) జిల్లాలోని సమస్యలపై సీఎం కేసీఆర్ (CM KCR)​ స్పందించాలని కాంగ్రెస్​ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి (MP Komatireddy Venkatreddy) డిమాండ్​ చేశారు. విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా ప్రజలను,  రైతులను తెలంగాణ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే  ఎస్ఎల్‌బీసీకి కేటాయించిన నీటిని రద్దు చేయాలని ఎంపీ కోరారు. 246 జీవోను రద్దు చేయాల్సిందేనని ఎంపీ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలోని సమస్యలపై సీఎం స్పందించకపోతే రక్తపాతం తప్పదని ఎంపీ హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8 సంవత్సరాలు అవుతున్నా.. ఎల్ఎల్బీసీ (SLBC)కి సంబంధించిన డీపీఆర్​ సమర్పించలేదని కోమటిరెడ్డి నిలదీశారు. గ్రావిటీ ద్వారా నీరు వచ్చే ఎస్ఎల్బీసీని పూర్తి చేయకుండా.. లక్షలు ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మాణాన్ని పూర్తి చేశారని మండిపడ్డారు.


  జిల్లాల మధ్య చిచ్చు..


  నల్గొండ, మహబూబ్ నగర్ (Mahbunagar) జిల్లాలో మధ్య చిచ్చు పెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ సందర్భంగా ఆరోపించారు. ఎస్ఎల్‌బీసీకి కేటాయించిన నీటిని రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో తెచ్చిందన్నారు ఎంపీ.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 45 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఇచ్చిన ఆ జీవో 246ను రద్దు చేయాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.  ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ (CM YS Jagan).. కృష్ణా నది నుంచి రోజుకు 8 నుంచి 11 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోతున్నారని కోమటిరెడ్డి ఆరోపించారు. ఏపీ నీటి దోపిడీని అడ్డుకోకపోతే.. నిర్మాణంలో ఉన్న ఎస్ఎల్బీసీ నిరుపయోగంగా మారుతుందన్నారు. నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల రైతులకు అన్యాయం జరుగుతుంటే.. కేసీఆర్ నోరుమీదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్లోరైడ్​ను తమ కాంగ్రెస్ పార్టీ రూపు మాపిందని.. మంత్రి జగదీశ్ రెడ్డికి ప్రాజెక్టులపై, రైతు సమస్యలపై, కరెంట్ పై కనీస అవగాహన లేదని ఎద్దేవా చేశారు. ఉత్తర తెలంగాణ కాలువల నిర్వహణపై ఉన్న శ్రద్ధ.. దక్షిణ తెలంగాణలో  ఏమాత్రం లేదని దుయ్యబట్టారు.


  Business Woman: ఆమెకు వచ్చిన ఈ చిన్న ఆలోచనే.. ఇపుడు వేలకు వేలు సంపాదించి పెడుతోంది..


  246 జీవోను రద్దు చేయాలనే డిమాండ్ తో అవసరమైతే నల్గొండలో దీక్ష చేస్తామని కోమటిరెడ్డి అన్నారు. ఈ విషయమై నీటిపారుదల ఇంజనీర్లతో కూడా తాను చర్చించనున్నట్టుగా వెంకట్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ పాలనలో దక్షిణ తెలంగాణ వెనుకబాటుకు గురైందని ఈ సందర్భంగా కోమటిరెడ్డి అన్నారు. ఎస్ఎల్ బీసీ నల్గొండ జిల్లాకు సాగు తాగు నీరు అందించే ప్రాజెక్టు అని ఆయన గుర్తు చేశారు. ఎస్ ఎల్ బీసీ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లాలోన దేవరకొండ, మునుగోడు, నల్గొండ, నకిరేకల్ వంటి అసెంబ్లీ నియోజకవర్గాలకు సాగు, తాగు నీరు అందించేందుకు ఉద్దేశించిందని ఆయన గుర్తు చేశారు. అయితే 45 టీఎంసీల నీటిని కేటాయించకపోతే జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లనుందని చెప్పారు కోమటిరెడ్డి.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: CM KCR, Komatireddy venkat reddy, Nalgonda

  ఉత్తమ కథలు