హుజురాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా గెలిచి సత్తా చాటుకున్నఎమ్మెల్యే ఈటల రాజేందర్ మునుగోడులో కూడా తన ప్రభావాన్ని చూపించారు. తన అత్తగారి ఊరైన పలివెల గ్రామంలో 134 బూత్ పరిధిలో టీఆర్ఎస్కు 312 ఓట్లు పడగా బీజేపీకి 519ఓట్లు వేశారు. అలాగే 135 బూత్‌లో టీఆర్ఎస్కు 386 ఓట్లు వస్తే ..బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి 510 ఓట్లు పడ్డాయి. ఇక్కడ మొత్తం 400ఓట్లకుపైగా బీజేపీ లీడ్‌లో నిలిచింది. ఇంకా విచిత్రం ఏమిటంటే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ గ్రామానికి ఇన్చార్జ్గా ఉన్నప్పటికి పార్టీకి అనుకూలంగా ఓటర్ల తీర్పు రాలేకపోవడంపై సీనియర్ లీడర్ అంతర్మధనం చెందుతున్నారు.
నైతిక విజయం బీజేపీదే..
ఈటల రాజేందర్ మునుగోడు ఫలితాలపై ప్రజలు ఇచ్చిన తీర్పును సమర్ధించుకున్నారు. ఇది కేసీఆర్‌కు, టీఆర్ఎస్ పార్టీకి చెంప పెట్టు లాంటిదన్నారు. ఒకరకంగా నైతిక విజయం బీజేపీదేనంటూ చెప్పుకొచ్చారు.
మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి స్వయంగా ముఖ్యమంత్రే రంగంలోకి దిగి మునుగోడులో ఓడిపోతే పార్టీ భవిష్యతే ప్రశ్నార్ధకమవుతుంది అని భావించి ఆయనతో సహా మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు అడ్డపెట్టాలి అని ఆదేశించారని చెప్పారు ఈటల.
టీఆర్ఎస్కు గుణపాఠం..
అయితే మునుగోడులో తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం గెలుస్తుందన్నారు. టెక్నికల్‌గా 100 ఓట్లు తక్కువ ఎక్కువ రావచ్చని జోస్యం చెప్పారు. సాక్షాత్తు మంత్రులు పని చేసిన గ్రామాల్లోనే బీజేపీకి ఓట్లు వేసి మునుగోడు ఓటర్లు టీఆర్ఎస్ నేతల చెంప చెళ్లుమనిపించారని విమర్శించారు. ఈ ఎన్నికలో కేసీఆర్ నైతికంగా ఓడిపోయారు. డబ్బు సంచులు, మద్యం బాటిల్లు, ప్రలోభాలు, అధికార దుర్వినియోగం పనిచేయదు అని మరోసారి నిరూపితమైంది. హుజురాబాద్‌లో దుబ్బాకలో చెప్పిన కూడా కేసీఆర్ కి ఇంకా జ్ఞానోదయం రాలేదు. మునుగోడులో కూడా అదే ప్రయత్నం చేశారు.
సాధారణ ఎన్నిక్లో ఇలా ఉండదు..
నల్లగొండ జిల్లాలో కూడా బీజేపీ ఈ స్థాయికి రావడం గొప్ప పరిణామంగా భావిస్తున్నట్లు చెప్పారు ఈటల. ఒక నియోజకవర్గం కాబట్టి సీఎం దబాయించి పనిచేయగలిగాడు రేపు జనరల్ ఎలక్షన్లో ఇలాంటి పరిస్థితి ఉండదు. మునుగోడు ప్రజా స్పందన తెలంగాణ ప్రజలకు మేలుకొలుపు. మార్పుకు నాంది. కేసీఆర్ నమ్ముకున్న డబ్బు మద్యం కు కాలం చెల్లింది. రేపు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ విజయం తథ్యం అన్నారు.
మునుగోడులో నవంబరు 3న పోలింగ్ జరిగింది. మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,25,192 మంది ఓటు వేశారు. ఇందులో 2,25,192 మంది ఓటు వేశారు. వీరిలో 1,13,853 పురుషులు, 1,11,338, మంది స్త్రీలు ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలుపుకొని 93.41 శాతం నమోదైంది. తెలంగాణలో ఏ ఎన్నికల్లోనూ ఇంత పోలింగ్ నమోదు కాలేదు. ఆ స్థాయిలో మునుగోడు ఓటర్లు పోటెత్తారు.
చౌటుప్పల్‌లో 59,433 ఓట్లు ఉండగా 55,678 ఓట్లు, సంస్థాన్ నారాయణపురంలో 36,430 ఓట్లు ఉండగా 34,157 ఓట్లు, మునుగోడు 35,780 ఓట్లు ఉండగా 33,455 ఓట్లు, చండూరులో 33,509 ఓట్లు ఉండగా 31,333 ఓట్లు, గట్టుప్పల్‌లో 14,525 ఓట్లు ఉండగా 13,452 ఓట్లు, మర్రిగూడలో 28,309 ఓట్లు ఉండగా 25,877 ఓట్లు, నాంపల్లిలో 33,819 ఓట్లు ఉండగా 31,240 ఓట్లు పోలయ్యాయి.
పోలింగ్ ప్రక్రియలో భాగంగా చౌటుప్పల్ మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 1, 2, 3, 4 రౌండ్లు, సంస్థాన్ నారాయణపురం ఓట్ల కౌంటింగ్ 4, 5, 6 రౌండ్లలో చేస్తారు. ఇక మునుగోడు ఓట్ల కౌంటింగ్ 6, 7, 8 రౌండ్లు, చండూరు మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 8, 9, 10 రౌండ్లు, గట్టుప్పల్ మండలం ఓట్ల కౌంటింగ్ 10, 11 రౌండ్లలో నిర్వహిస్తారు. మర్రిగూడ మండలం ఓట్ల కౌంటింగ్ 11, 12, 13 రౌండ్లు, నాంపల్లి మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 13, 14, 15 రౌండ్లలో జరుగుతుంది.
మునుగోడులో మొత్తం 47 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఐతే ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్యే నెలకొంది. నువ్వా నేనా అన్నట్లుగా ఫలితాలు వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.