తెలంగాణ కార్మిక, ఉపాధిశాఖ మంత్రి మల్లారెడ్డి(Mallareddy)మరోసారి విమర్శలను ఎదుర్కొంటున్నారు. నాలుగు రోజుల క్రితం మునుగోడు(Munugodu)ఎన్నికల ప్రచారంలో ఓటర్లకు మద్యం పోస్తున్నట్లుగా ఫోటోలు బయటపడిన వార్త మర్చిపోక ముందే మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు.ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి చౌటుప్పల్(Chautuppal)మండలం ఆరెగూడెం రెడ్డిబావి గ్రామంలో కుల సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఆ సమయంలో అక్కడికి న్యూస్ కవర్ చేయడానికి వచ్చిన జర్నలిస్టులు(Journalists)లకు మంత్రి మల్లారెడ్డి జలక్ ఇచ్చారు. మంత్రి ప్రవర్తన చూసి స్థానికులు ఆశ్చర్యపోగా..జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోసారి చిక్కుల్లో మంత్రి..
వివాదాలకు కేంద్ర బింధువుగా మారుతున్నారు మంత్రి మల్లారెడ్డి. గతంలో ల్యాండ్ సెటిల్మెంట్లో వాటా కోసం బెదిరిస్తూ ఆడియో లీకవగా ..ఆ తర్వాత రెడ్డి గర్జన కార్యక్రమంలో మంత్రి కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. వీటికి కొనసాగింపుగానే మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో మరోసారి బుక్కయ్యారు. శుక్రవారం చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో ప్రచారం ముగియగానే స్థానిక కుల సంఘాల నాయకులతో సమావేశమయ్యారు మల్లారెడ్డి. అయితే ప్రోగ్రామ్ కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టులను మంత్రి అనుచరులు అడ్డుకున్నారు. వీడియోలు రికార్డ్ చేయవద్దని చెప్పి అటుపై అనుమతించారు.
అనుమానంతో..
అదే సమయంలో మంత్రి మల్లారెడ్డి ఆగ్రహానికి గురై ఓ రిపోర్టర్ ఫోన్ లాక్కెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. అక్కడ చాలా మంది రిపోర్టర్లు ఉన్న సమయంలో ఒక జర్నలిస్ట్ ఫోన్ లాక్కొని అతడ్ని అవమానించారంటూ జర్నలిస్టుల సంఘం నాయకులు మండిపడ్డారు. మంత్రి మల్లారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మల్లారెడ్డిపై జర్నలిస్టులు ఆగ్రహం..
నాలుగు రోజుల క్రితం మంత్రి మల్లారెడ్డి చౌటుప్పల్ మండలం సైదాబాద్ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం గుండ్లబావి గ్రామంలో కొంత మంది ఓటర్లతో కలిసి సమావేశమయ్యారు. అక్కడున్న వారిలో కొందరు మంత్రిని మద్యం కావాలని కోరడంతో మంత్రి మల్లారెడ్డి స్వయంగా తన సిబ్బందితో మద్యం తెప్పించారు. ఓటర్లతో కలిసి మంత్రి మందు తాగినట్లు, వాళ్లకు మద్యం పోస్తున్నట్లుగా ఉన్న ఫోటోలు నెట్టింట్లో ప్రత్యక్షమయ్యాయి. దాంతో మంత్రి మద్యం తాగిస్తూ ఓటర్లను ప్రలోభపెడుతున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. దానికి భయపడే మంత్రి ఈసారి ఎవరూ తన వాయిస్, వీడియో రికార్డ్ చేయకూడదని కండీషన్ పెట్టినట్లు, రిపోర్టర్ ఫోన్ లాక్కోవడానికి కారణమైంది. ఏది ఏమైనా మంత్రి ఒక జర్నలిస్ట్ ఫోన్ లాక్కోవడం తప్పు కాదా అని విపక్షాల పార్టీల నేతలు, జర్నలిస్టులు ఖండిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.