హోమ్ /వార్తలు /తెలంగాణ /

Sad News: ఫ్లోరైడ్ సమస్యపై పోరాడిన వ్యక్తి ఇకలేరు .. స్వామి మృతిపై కేటీఆర్‌ విచారం

Sad News: ఫ్లోరైడ్ సమస్యపై పోరాడిన వ్యక్తి ఇకలేరు .. స్వామి మృతిపై కేటీఆర్‌ విచారం

ktr tweet(Photo:Twitter)

ktr tweet(Photo:Twitter)

Sad News: ఫ్లోరోసిస్ భూతంపై పోరాటం చేసిన బాధితుడు కన్నుమూశాడు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ సమస్య పరిష్కారం కోసం పోరాడి చాలా మందికి ప్రేరణగా నిలిచిన స్వామి మరణంపై మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nalgonda, India

ఉమ్మడి నల్లగొండ(Nalgonda)జిల్లా మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం శివన్నగూడెం(Sivannagudem)కు చెందిన స్కెలెటిన్‌ ఫ్లోరోసిస్‌ బాధితుడు అంశల స్వామి(Swamy) శనివారం కన్నుమూశారు. ఎంతో కాలంగా జిల్లాలోని ఫ్లోరోసిస్(Fluorosis)భూతంపై పోరాటం చేస్తుండటమే కాకుండా మనోధైర్యంతో చాలా మందికి ప్రేరణగా నిలిచిన స్వామి మరణంపై మంత్రి కేటీఆర్(KTR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భగవంతుడు స్వామి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడ్ని ప్రార్ధిస్తున్నట్లుగా ట్వీట్(Tweet)చేశారు. అంశాల స్వామి కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Sad News: టమాటా పంటను పశువులకు వదిలేసిన రైతులు .. అక్కడ అలా ఎందుకు జరిగిందంటే..

స్వామి ఇకలేడు..

అంశాల స్వామి శనివారం మృతి చెందాడు. విచారకరమైన సంఘటన ఏమిటంటే ఓ దాత ఇచ్చిన ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్‌ నుంచి కిందపడిపోయారు. గాయపడిన స్వామి చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశాడు. 32సంవత్సరాల స్వామి ఫ్లోరోసిస్ సమస్య పరిష్కారం కోసం చాలా రోజులుగా పోరాటం చేశారు. అంశాల స్వామి మృతిపై స్థానికులు, జిల్లా ప్రజలు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.

మంత్రి కేటీఆర్ దిగ్బ్రాంతి..

అతని పేరు అంశాల స్వామి. ఉమ్మడి నల్లగొండ జిల్లా శివన్నగూడెంకు చెందిన ఈ వికలాంగుడు ఫ్లోరోసిస్ సమస్య కారణంగా స్కెలెటిన్‌ ఫ్లోరోసిస్‌ బాధితుడిగా మారాడు. దీంతో అతని కుటుంబాన్ని పోషించుకునే దారి లేక...తల్లిదండ్రులపై ఆధారపడాల్సిన పరిస్తితి తలెత్తింది. ఇదే విషయంపై అంశాల స్వామి చాలా రోజుల పాటు పోరాడారు. తమ జిల్లాలో ఫ్లోరోసిస్ భూతానికి ఎంతో మంది కాళ్లు, చేతులు వంకర్లు పోతున్నాయని..తమకు గుక్కెడు మంచి నీళ్లు ఇవ్వమని ..ఈ ఫ్లోరైడ్ సమస్యకు దూరం చేయమని పోరాడాడు.

ఫ్లోరైడ్‌పై పోరాటం ..

అయితే స్వామి అభ్యర్ధన, పోరాటం మేరకు నల్గొండ జిల్లాలో ఇంటింటికి కృష్ణా నీళ్లు రావడంతో ఫ్లోరైడ్‌పై పోరాటం ఆపారు స్వామి. అయితే బ్రతుకు దెరువు కోసం చేస్తున్న పోరాటంలో ఉపాధి కరువైందనే విషయాన్ని తెలుసుకున్న మంత్రి కేటీఆర్ అంశాల స్వామికి 2.7 లక్షలతో సెలూన్‌ పెట్టించారు. అంతే కాదు గతేదాడి శిథిలమై కూలిపోయే స్థితిలో ఉన్న ఇంట్లో కాలం వెళ్లదీస్తున్నానని మంత్రికి ట్వీట్ చేయడంతో డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించారు.

TSRTC: ఒక్కపూటలోనే పార్శిళ్లను చేరస్తున్న TSRTC .. AM టూ PM పేరుతో ఎక్స్‌ప్రెస్‌ పార్శిల్ సేవలు

మర్చిపోలేకపోతున్న గ్రామస్తులు..

ఫ్లోరైడ్ బాధితుడిగా ఉన్న అంశాల స్వామి జీవితంలో కొత్త ఆశలు నింపిన మంత్రిని ఒక్కసారి చూడాలని..తమ ఊరికి రావాలని స్వామి కోరడంపై మునుగోడు ఎన్నికల సమయంలో మంత్రి కేటీఆర్ స్వయంగా శివన్నగూడెంలోని స్వామి ఇంటికి వెళ్లారు. అతనితో కలిసి నేలపై కూర్చొని భోజనం చేశారు. అంశాల స్వామి మంత్రి తన ఇంటికి వచ్చిన విషయాన్ని తన ఆనందంతో అందరితో షేర్ చేసుకున్నారు. ఓ సాధారణ వికలాంగుడిని పలకరించేందుకు..అతని కోరిక తీర్చేందుకు మంత్రి కేటీఆర్ అంశాల స్వామి ఇంటికి వెళ్లిన ఘటన అందరూ మర్చిపోలేకపోతున్నారు.

First published:

Tags: Minister ktr, Telangana News

ఉత్తమ కథలు